
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా నిర్వాహకులు ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపుతున్నారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ బదులు ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకోనున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
సెకండ్ సెషన్‌లో ఈ మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment