TS Eamcet
-
జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్ఈఏపీ సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.సెట్లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 12 నుంచి స్లైడింగ్... ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్‌లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్‌లో కేటాయించిన బ్రాంచ్‌కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి. జూన్ 8 నుంచి ఈ–సెట్ కౌన్సెలింగ్ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.కౌన్సెలింగ్ తేదీలు ఇలా... -
ఒక్క క్లిక్‌తో ఈఏపీ సెట్ ఫలితాలు
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాను ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి... ఇంజనీరింగ్ ఫలితాల కోసం క్లిక్ చేయండిఅగ్రికల్చర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అలాగే.. రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే టాప్ ఫైవ్ ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్ & మెడిసిన్(AM) కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్‌గా నిలిచాడు. ఇక.. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో విశాఖపట్నంకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్‌గా నిలిచాడు. ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
TS EAMCET: ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా.ఎన్.శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులూ లేవని.. మే 10, 11 తేదీల్లోనే యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. కాగా ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది. -
మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చ ర్, ఫార్మా, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి మే నెలలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) శుక్రవారం విడుదల చేసింది. వర్సిటీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీసీ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆన్లైన్ విధానంలో ఎంసెట్ దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 10లోగా అభ్యర్థులు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం తెలంగాణలో 16, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లు (కర్నూలు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు) ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ప్రక్రియ పూర్తయ్యేలోగానే అనుబంధ కాలేజీలకు అఫ్లియేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈసారి నర్సింగ్ కూడా.. నర్సింగ్ కోర్సుల సీట్లను కూడా ఈసారి ఎంసెట్ ద్వారానే భర్తీ చేస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వర్సిటీ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఎంసెట్‌కు ఇంటర్లో (జనరల్ 45 శాతం, రిజర్వేషన్ కేటగిరీకి 40 శాతం) కనీస మార్కులు సాధించాలనే నిబంధన అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్‌కు వెయిటేజీ తొలగించినట్టు ప్రకటించారు. వెయిటేజీ విధానం కష్టసాధ్యమవ్వడం, జాతీయ పరీక్షల్లోనూ దీన్ని అనుసరించకపోవడంతో తీసివేశామన్నారు. ఫస్టియర్ ఇంటర్ నుంచి 70 శాతం, సెకండి యర్ నుంచి వంద శాతం సిలబస్ ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డా.శ్రీనివాస్, ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం https://eamcet. tsche. ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ తెలిపారు. -
Telangana: మే 7 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023ను మే 7న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తోంది. ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. -
ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, బయోటెక్నాలజీ కోర్సుల కోసం ఎంసెట్–22(బైపీసీ) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిట్టల్ శనివారం విడుదల చేశారు. రెండుదశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ సమాచారాన్ని టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో ఈ నెల 27న అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. -
11న ఎంసెట్ రెండో విడత డౌటే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11న జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణపై సాక్షాత్తు అధికారులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు. ఫీజుల వ్యవహారంలో పీటముడి వీడకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాస్తవానికి విద్యార్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ కన్నా, రెండో విడత అత్యంత కీలకం. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ర్యాంకులపై దాదాపు స్పష్టత వస్తుంది. జాతీయ కాలేజీల్లో కోరుకున్న బ్రాంచ్ రాని విద్యార్థులు రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరగడంతో గత కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా వదిలేసుకున్న విద్యార్థులు కూడా రెండో దశపై ఆశలు పెట్టుకుంటారు. ఇతర బ్రాంచీల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులు పొందేందుకు ఈ దశ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ తర్వాత డిగ్రీ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది. ఫీజుల నిర్ణయం తేలేనా? ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) దోబూచులాడుతోందన్న విమర్శలొస్తున్నాయి. జూలైలో కాలేజీల ఆడిట్ రిపోర్టులు పరిశీలించి, కొత్త ఫీజులు నిర్ణయించిన ఎఫ్ఆర్సీ అంతలోనే యూటర్న్ తీసుకుంది. ఆడిట్ నివేదికలు సరిగ్గా పరిశీలించలేదని భావించడం, మళ్లీ కాలేజీలను పిలిచి ఆడిట్ నివేదికలను ఆమూలాగ్రం పరిశీలించడం, తర్వాత కొన్ని కాలేజీల ఫీజులు తగ్గించడం అనేక సందేహాలకు తావిస్తోంది. రెండోసారి ఆడిట్ నివేదికల్లో కన్పించిన తప్పులు మొదటిసారి ఎందుకు గుర్తించలేకపోయారనే అనుమానాలు అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫీజులు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. 2019తో పోలిస్తే ఎక్కువ కాలేజీల ఫీజులు పెరిగాయని పలువురు అంటున్నారు. రెండుసార్లు పరిశీలించినా, మరోసారి సంప్రదింపులకు 20 కాలేజీలను పిలవడం, ఆ తర్వాత ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫీజుల వ్యవహారంపై ఎటూ తేల్చకపోవడంతో ఈ ప్రభావం రెండో దశ కౌన్సెలింగ్‌పై పడే అవకాశముంది. ఇలా జాప్యమైతే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఈసారి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. -
కసరత్తు చేస్తే... కోరుకున్న సీటు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21 నుంచి ఎంసెట్ తొలిదశ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 1.56 లక్షల మంది ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీపడనున్నారు. 21, 22 తేదీల్లో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఉంటుంది. 23వ తేదీ నుంచి ఆన్లైన్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కన్వీనర్ కోటా కింద దాదాపు 75 వేల సీట్లు ఉంటే, మరో 35 వేల వరకు మేనేజ్మెంట్ కోటా సీట్లున్నాయి. మొత్తం 1.10 లక్షల సీట్లున్నా, బీటెక్‌లో చేరుతున్నది ఏటా 80 వేల మందే ఉంటున్నారు. 58 శాతం వరకూ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కొత్త కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సుల్లోనే చేరుతున్నారు. ఈసారి డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గాయి. దీంతో ఆచితూచి ఆప్షన్లు ఇవ్వాలని, గతంలో జరిగిన కౌన్సెలింగ్‌లను అధ్యయనం చేసి తమ ర్యాంకు ఆధారంగా ఒక అంచనాకు రావాలని, అప్పుడు టాప్ కాలేజీ కాకపోయినా కోరుకున్న బ్రాంచి దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అభ్యర్థులు ఎన్ని ఆప్షన్లయినా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు ఇచ్చే ప్రాధాన్యతలు కీలకంగా మారనున్నాయి. టాప్ ర్యాంకుల్లో ఇలా.. ఆప్షన్లు ఇచ్చే విషయంలో తికమకపడి అస్పష్టతతో ఆప్షన్లు ఇస్తుంటారు. దీంతో కొంతమంది అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 500లోపు ఎంసెట్ ర్యాంకర్లు ఆప్షన్లు ఇస్తారు. వీళ్లల్లో చాలామంది ఆయా కోర్సుల్లో చేరే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్లకు జేఈఈ వంటి ర్యాంకులు కూడా వచ్చి ఉంటాయి. 500–1000 లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 25% వరకే వచ్చిన సీటులో చేరుతుంటారు. అంటే వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లోనో, టాప్ ప్రైవేట్ కాలేజీల్లోనో చేరతారు. 1000–1500 ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్లో 50% పైగా టాప్ టెన్ కాలేజీల్లో నచ్చిన బ్రాంచిలో చేరే వీలుంది. ఇక 1500 నుంచి 5 వేల ర్యాంకు వరకు వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులు ఇతర టాప్ కాలేజీ ల్లో కన్వీనర్ కోటా కింద అవకాశం దక్కించు కునే అవకాశం ఉంటుంది. వీరిలో 80% వచ్చిన సీటును వదులుకోవడం లేదు. ఏదో ఒక బ్రాంచిలో ఇష్టం లేకున్నా చేరి తర్వాత కౌన్సెలింగ్‌లో నచ్చిన బ్రాంచి దక్కించుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. 10 వేల ర్యాంకు తర్వాత... విద్యార్థులు డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు, టాప్ కాలేజీలకే తొలి ఆప్షన్ ఇస్తారు. ఇలాంటప్పుడు 10 వేల పైన ర్యాంకు వచ్చిన వారు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే... 40 వేల ర్యాంకుపైన వచ్చిన వాళ్లు కూడా టాప్ కాలేజీలకు మొదటి ఆప్షన్ ఇస్తు న్నారు. కొంతమంది పోటీ ఉన్న బ్రాంచికి కాకుండా, సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి బ్రాంచిలకు ప్రాధాన్యత ఆప్షన్లుగా ఇస్తున్నారు. పోటీ లేదని, సీటు వస్తుందని భావిస్తారు. 10 వేల ర్యాంకు తర్వాత కూడా సీటు వచ్చే కాలేజీ ల్లో ఆప్షన్లు ఇవ్వడం లేదు. దీంతో వాళ్ల తర్వాత ర్యాంకు వారు ఆ కాలేజీలకు ఆప్షన్లు ఇస్తే వారికి సీటు వెళ్తుంది. వారు చేరితే టాప్ కాలేజీల్లో సీటు రాక తర్వాత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరైన అంచనా అవసరం ►ఆప్షన్లు ఇచ్చే ముందు తమకు వచ్చిన ర్యాంకు ప్రకారం గతంలో ఎక్కడ, ఏ కాలేజీలో సీటు వచ్చిందనే దానిపై ప్రాథమిక అంచనాకు రావాలి. వాటిల్లో నచ్చిన బ్రాంచిని ఎంపిక చేసుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ►ఈసారి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సీట్లు తగ్గాయి. అయితే పోటీ పెద్దగా ఉండే అవకాశం కన్పించడం లేదు. అంతా కంప్యూటర్ సైన్స్ గ్రూపుల వైపు వెళ్తున్నారు. కాబట్టి డిమాండ్ లేని కోర్సులు కోరుకునే వారు మంచి కాలేజీకి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ►వెయ్యిలోపు ర్యాంకులు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లో వచ్చే సీటు సాధారణంగా మంచి కాలేజీలోనే అయి ఉంటుంది. కాబట్టి కోరుకున్న కాలేజీ, బ్రాంచి.. తర్వాత జరిగే కౌన్సెలింగ్‌లో అయినా దక్కుతుందనే ధీమాతో ఉండొచ్చు. వీళ్ళు తుది దశ కౌన్సెలింగ్ వరకు వేచి చూసి, ఆ తర్వాతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం మంచిది. -
TS EAMCET Counselling Dates 2022: 21 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది. చదవండి: ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్లో బాలికలు -
Telangana: ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఎంసెట్) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. అదే సమయంలో ఈసెట్ ఫలితాలను కూడా విడుదల చేశారు. ఎంసెట్(ఇంజనీరింగ్) రిజల్ట్స్ కోసం.. ఎంసెట్(అగ్రికల్చర్) రిజల్ట్స్ కోసం.. ఈసెట్ రిజల్ట్స్ కోసం.. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశా లల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఎంసెట్) ఫలితాల వెల్లడి తేదీ గురువారం ఖరారుకానుంది. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఎంసెట్ ఫలితాల తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. ఎంసెట్ ఫలితాల విడుదల ఈ నెల 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవ్వ నుంది. మరోవైపు జేఈఈ ఫలితాలు వెల్లడవ్వడం, ఈ నెలాఖరు నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికా రులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్టీయూహెచ్ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. -
ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్‌టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్‌రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు రీషెడ్యూల్.. తేదీలివే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాయిదాపడిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, టీఎస్ ఈసెట్, టీఎస్ పీజీఈసెట్ పరీక్షలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్లో మార్పులను అభ్యర్థులు గమనించాలని కోరింది. హాల్ టికెట్స్‌ను త్వరలో డౌన్లోడ్ చేసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలు.. 1. టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)-జులై 30 మరియు 31 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు 3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు -
ఎంసెట్‌కు 91 శాతం హాజరు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం జరిగిన టీఎస్ ఎంసెట్‌కు తొలి రోజు 91.31 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో భారీ స్పందన ఉంటే, ఏపీలో కాస్త తక్కువే కనిపించింది. సమస్యాత్మకంగా భావించిన వరద బాధిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ 96 శాతం హాజరు నమోదై నట్టు అధికారులు తెలిపారు. తొలిరోజు ఎంసెట్ విజయవంతంగా ముగిసిందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు తలెత్తలేదని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి స్పష్టం చేశారు. జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డితో కలసి ఆయన నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. టీఎస్ ఎంసెట్ ఈ నెల 14 నుంచే జరగాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా 14, 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. విద్యార్థుల పోటాపోటీ.. గతంలో పోలిస్తే ఈసారి ఎంసెట్ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులకు కలిపి దాదాపు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 88, ఏపీలో 19... మొత్తం 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి రోజున రెండు రాష్ట్రాల్లోనూ 58,547 మంది పరీక్ష రాయాల్సి ఉంటే, 53,509 (91.31 శాతం) మంది హాజరయ్యారు. ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో జరిగిన ఈ పరీక్షకు తెలంగాణవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. రాష్ట్రంలో 46,570 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 44,169 (94.84 శాతం) హాజ రయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 11,977 మంది దరఖా స్తు చేసుకోగా, పరీక్షకు హాజరైంది మాత్రం 9,340 మంది (77.98 శాతం) మాత్రమే. ఇటీవలే ఏపీలో ఎంసెట్ జరగడంతో అక్కడ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు విశ్లేషించారు. పరీక్షపై విద్యార్థుల సంతృప్తి ఎంసెట్ పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రితం సంవత్సరం కన్నా ప్రశ్నపత్రం తేలికగా ఉందని హైదరా బాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద ఎంసెట్ విద్యార్థిని పద్మప్రియ, నిఖిలేష్ తెలిపారు. ఆన్లైన్ మోడ్‌లో ఎలాంటి సమస్యా లేకుండా పరీక్ష రాయగలిగినట్లు వెల్లడించారు. మొత్తం ప్రశ్నల్లో కెమెస్ట్రీ తేలికగా చేసే వీలుందని, ఫిజిక్స్ కాస్త మధ్యస్తంగా ఉందని, మేథ్స్ సుదీర్ఘ ప్రశ్నలతో ఉందని గణిత శాస్త్ర నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. మొత్తం మీద విద్యార్థులు ఈ పరీక్షను తేలికగా రాయగలిగినట్లు ఆయన తెలిపారు. -
Telangana: ప్రారంభమైన టీఎస్ ఎంసెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి(సోమవారం) మూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1,72,241 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణ లో 89, ఏపీ లో 19 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు నిర్వాహణ అధికారులు. ఒక్క నిమిషం నిబంధన అమలు కానుంది. అంటే.. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్ధులను గంట ముందు నుండే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 79 వేల 365 దరఖాస్తులు వచ్చాయి. ప్రత్యేక ఏర్పాట్లు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెట్ వర్క్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నిమిషం రూల్ అమలు చేస్తున్నారు, సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి పంపిస్తారు. మొబైల్స్ , వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు. -
Telangana: ఎంసెట్ నిర్వహణపై.. ఉన్నత విద్యామండలి చైర్మన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. గతంలో ప్రకటించిన తేదీల్లోనే ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. వర్షాలున్నా, పరీక్షకు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. 17 నుంచి 19 వరకూ ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ తేదీలను గతంలోనే ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటం, అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం 3 రోజులపాటు సెలవులు ప్రకటించడంతో పరీక్ష తేదీల మార్పుపై అధికారులు తొలుత కసరత్తు చేశారు. కానీ మండలి సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ మాత్రం ఎంసెట్ వాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో పలు పరీక్ష తేదీలను దృష్టిలో పెట్టుకొని ఎంసెట్ తేదీలు ఖరారు చేసినందున ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని ఉన్నత విద్యామండలికి సూచించింది. ఇదే విషయాన్ని మండలి చైర్మన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 14, 15 తేదీల్లో జరిగే ఎంసెట్‌కు హాజరుకాలేని విద్యార్థులుంటే ఏం చేయాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 17 నుంచి జరిగే ఇంజనీరింగ్ ఎంసెట్ సమయానికి వర్షాలు తగ్గుతాయనే విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలో ఎంసెట్ వాయిదా వేస్తే ఇప్పటికే సిద్ధమైన విద్యార్థులు ఇబ్బంది పడే వీలుందని లింబాద్రి తెలిపారు. పేద విద్యార్థులకు నష్టం: విద్యార్థి సంఘాలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్‌ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షల వల్ల గ్రామీణ, పేద విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాగులు, వంకలు పొంగుతున్న వేళ ఎంసెట్ నిర్వహిస్తే ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఎంసెట్ వాయిదా కుదరదని ఓ సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ చెబితే ప్రభుత్వం వినడం ఏమిటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి ప్రశ్నించారు. -
ఎంసెట్ వాయిదా..!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీఎస్ ఎంసెట్) విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అనూహ్యంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఎడతెరిపిలేని వర్షాల దృష్ట్యా ఎంసెట్‌ను వాయిదా వేసే యోచనలో ఉన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి సోమవారం భేటీ కానుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా వాస్తవపరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్ కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే, తాజాగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రవాణా స్తంభించింది. చాలా ప్రాంతాలు జలమయ మయ్యాయి. విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు వెళ్లడం కూడా కష్టమేనని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ప్రభుత్వం కూడా రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అనేకచోట్ల విద్యుత్ సరఫరాకు, ఇంటర్నెట్ సదుపాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరీక్షాకేంద్రాల్లో కూర్చునే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని ఎంసెట్‌ను వాయిదా వేయడమే సరైనదని అధికారులు భావిస్తున్నారు. కొంత సమయం ఇద్దామా? ఈసారి ఎంసెట్‌కు కూడా విపరీతమైన పోటీ ఉందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ చేపట్టాల్సి ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు తప్పకుండా ఉండాల్సిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ రెండు మౌలిక సదుపాయాలకు అంతరాయం ఏర్పడుతోంది. బేటరీలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల సాయంతో పరీక్షలు నిర్వహించినా, చాలామంది విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవడమే కష్టంగా ఉందని అంటున్నారు. పరీక్షల కోసం ఏపీ, తెలంగాణలో 109 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్లా పరిస్థితి ప్రతికూలంగానే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పరిస్థితిని అంచనా వేసి నిర్ణయిస్తాం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ నిర్వహణ సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని సోమవారం చర్చిస్తాం. అన్ని ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసి ఓ నిర్ణయానికి వస్తాం. ఎంసెట్ నిర్వహణకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ సలహా తీసుకుంటాం. 14వ తేదీ నాటికి పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే, పరీక్ష నిర్వహణకు వెనుకాడబోం. – ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
6 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ ఎంసెట్–2022) నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈసారి కూడా ఈ పరీక్షను హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 5 జోన్లలో.. జూలై 14 నుంచి 20వ తేదీ మధ్య ఈ పరీక్ష జరుగుతుంది. ఇంటర్మీడియెట్ తత్సమానమైన పరీక్ష రెండో ఏడాది రాస్తున్న అభ్యర్థులు ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. ఎంసెట్‌ను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ ఎంసెట్ ద్వారా ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో నిర్వహించే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లోని వివిధ బ్రాంచ్‌ల్లో సీట్లు పొందే వీలుంది. 70 శాతం సిలబస్‌తోనే.. ఈసారి కూడా 70 శాతం ఇంటర్ సిలబస్‌లోంచే ఎంసెట్ ప్రశ్నావళి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఇంటర్ సిలబస్‌ను కుదించిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌లో మొత్తం 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. నెగెటివ్ మార్కులు ఉండవు. 3 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఇంటర్ విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఎవరి జోన్లో వారు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. https://eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. పెరగనున్న అభ్యర్థుల సంఖ్య! ఈసారి కూడా ఎంసెట్ అభ్యర్థుల సంఖ్య పెరిగే వీలుంది. ఇంటర్ విద్యార్థులందరూ కనీస మార్కులతో ఉత్తీర్ణులైన నేపథ్యంలో అందరూ ఎంసెట్ రాసేందుకు అవకాశం ఏర్పడింది. 2021లో నిర్వహించిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94,550 మంది (85.70) అర్హత సాధించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 175 ఉన్నాయి. వీటిల్లో కన్వీనర్ కోటా కింద 79,790 సీట్లు ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఈసెట్ దరఖాస్తులు డిప్లొమా కోర్సులు పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలనుకునే వారికి నిర్వహించే ఈ–సెట్ కోసం కూడా ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ ఈసెట్ విభాగం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూన్ 8గా పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https:// ecet. tsche. ac. in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వొచ్చు. జూలై 13న ఈసెట్ నిర్వహించనున్నారు. ఫీజును రూ.400 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు), రూ.800 (ఇతరులకు) ప్రకటించారు. -
14న ఎంసెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్–2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. దీనిపై సమీక్ష సమావేశం సోమవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగింది. ఈ భేటీలో నోటిఫికేషన్ వెలువరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు అంగీకారం కుదిరిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మంగళవారం మీడియాకు తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు వివరించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్దిష్ట మైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది. ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు హాజరయ్యే సెట్ లు, జేఈఈ, ఇతర జాతీయ పోటీ పరీక్షలను టీసీఎస్ పరిశీలించి.. ఇబ్బంది లేకుండా చూసేందుకే కసరత్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని పరీక్ష కేంద్రాలుండాలి? ఎక్కడ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది? అనే అంశాలను టీసీఎస్ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ 2 రోజుల్లో పూర్తయ్యే వీలుందని, అనంతరం ఎంసెట్ తేదీలను ఖరారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపుతామని అధికారులు చెప్పారు. జూన్ చివరి వారం.. మే నెలలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఇదే నెలలో జేఈఈ మెయిన్స్ పరీక్షలూ ఉంటాయి. ఇవన్నీ నిర్వహించిన తర్వాత ఎంసెట్ సన్నద్ధతకు విద్యార్థులు కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వారం ఎంసెట్ నిర్వహణకు అనుకూలమైనదిగా ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయించారు. ఇదే విషయాన్ని టీసీఎస్‌కు వివరించినట్లు వారు తెలిపారు. దీంతో పాటే పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంసెట్ ర్యాంకుల వెల్లడికీ కసరత్తు చేయాలని తీర్మానించారు. వాస్తవానికి గతంలో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండేది. కానీ, ఈసారి దానికి అవకాశం లేదని ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫస్టియర్ పరీక్షల్లో కనీస మార్కులతో ప్రమోట్ చేశారు. కాబట్టి ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇంటర్ పరీక్ష ఫలితాలకు, ఎంసెట్ ర్యాంకుల వెల్లడికి సంబంధం ఉండదు. అందుకే త్వరగా ఫలితాలు వెల్లడించే వీలుంది. అలాగే కౌన్సెలింగ్ తేదీలపై మరికొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ ఫలితాలు, ఐఐటీ, నీట్ ప్రవేశాల తేదీలను బట్టి ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఖరారు చేయాలనే యోచనలో అధికారులున్నారు. -
టీఎస్ ఎంసెట్: నేటి నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్స్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి నేటి నుంచి 16 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది. ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లిస్టులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్ కోటా ఉన్నాయి. -
టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్– 2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నాటిక్ సంగీతం, కూచిపూడి, కథక్ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ (ఎంసెట్).. ఆగస్టు 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ (ఎంసెట్).. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్.. ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్, ఆగస్టు 23న లాసెట్.. ఆగస్టు 24, 25 తేదీల్లో ఎడ్‌సెట్, జులై 17న పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణలో జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. నేరుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు నేరుగా క్లాసులు నిర్వహించే యోచన చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనుకుంటోంది. -
Telangana: ఎంసెట్, లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కమిటీ పేర్కొంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించింది. చదవండి: Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
ఎంసెట్‌లో ముందుగా ఏ పరీక్ష?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ముందుగా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించాలా? ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు పరీక్షను నిర్వహించాలా? అన్న విషయంలో ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ చర్యలు చేపట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి తేదీలను ఖరారు చేసింది. సాధారణంగా అందులో ముందు 3 రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్లైన్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఆరు సెషన్లలో (రోజుకు రెండు సెషన్లు) నిర్వహిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైతే 8న కూడా ఒక సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు, ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒక రోజు గడువే ఉంటోంది. దీంతో మ్యాథమెటిక్స్ విద్యార్థుల వెసులుబాటు కోసం ముందుగా ఇంజనీరింగ్ ఎంసెట్ కాకుండా అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం ఎంసెట్‌ను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది ఉన్నత విద్యామండలి. అయితే నీట్ తేదీలను ప్రకటించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పుడే అగ్రికల్చర్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో ఎంసెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూన్‌లో పాలీసెట్! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ను ఈసారి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా పదో తరగతి పరీక్షలు పూర్తికాగానే ఏప్రిల్ చివరలో పాలీసెట్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మే 17 నుంచి 26వ తేదీ వరకు ఉండటంతో పాలీసెట్‌ను జూన్‌లో నిర్వహించేలా ఎస్బీటీఈటీ కసరత్తు చేస్తోంది. చదవండి: తెలంగాణ ఎంసెట్ 2021 షెడ్యూల్ విడుదల సింగరేణిలో 2087 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్...