సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కళాశా లల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్) ఫలితాల వెల్లడి తేదీ గురువారం ఖరారుకానుంది. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ఎంసెట్ ఫలితాల తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. ఎంసెట్ ఫలితాల విడుదల ఈ నెల 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవ్వ నుంది.
మరోవైపు జేఈఈ ఫలితాలు వెల్లడవ్వడం, ఈ నెలాఖరు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికా రులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్‌టీయూహెచ్ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment