
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023ను మే 7న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 7 నుంచి 11 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ను జేఎన్‌టీయూహెచ్ నిర్వహిస్తోంది.
ఎంసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెట్స్‌కు సంబంధించిన దరఖాస్తు తేదీలు, ఫీజుల వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్‌లను సంబంధిత సెట్ల కన్వీనర్లు త్వరలో విడుదల చేస్తారని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment