సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాలు జూన్ 3 లేదా 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను బోర్డు ఈ నెల 27న వెల్లడించిన నేపథ్యంలో ఆ ఫలితాల డేటాను తీసుకొని ఎంసెట్ ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించింది. రీవెరిఫికేషన్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల డేటా, గతంలోనే పాసైనా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని కూడా తీసుకొని ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయాల్సి ఉంది. బోర్డు నుంచి డేటా వచ్చేందుకు ఒకట్రెండు రోజులు పట్టనున్న నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకులను జూన్ 3 లేదా 4న విడుదల చేయాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. బోర్డు డేటాను బుధవారం ఇస్తే ఈ నెల 31న ఫలితాలను వెల్లడించే అవకాశాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment