Telangana Intermediate Board
-
జూనియర్ కాలేజీల అనుమతుల్లో పొరపాట్లు నిజమే!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ కాలేజీలకు అనుమతుల జారీలో నిబంధనలు పక్కాగా పాటిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొన్ని కాలేజీలకు అనుమతుల జారీలో పొరపాట్లు జరిగింది నిజమేనని అంగీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ, వాణిజ్య భవనాల్లో నిర్వహిస్తున్న 207 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 180 కాలేజీలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన 27 కాలేజీల్లో జీరో ఎన్రోల్మెంట్ ఉందని వివరించారు. శనివారం ఇంటర్మిడియట్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు. 2025–26 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో వసతులపై మరింత లోతుగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే అనుమతులు జారీ చేస్తామన్నారు. 3,246 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3,246 జూనియర్ కాలేజీలకు అనుమతులు ఇచ్చామని కృష్ణ ఆదిత్య చెప్పారు. ఇందులో 424 ప్రభుత్వ కాలేజీలు, 1,346 ప్రభుత్వ రంగ కాలేజీలు, 1,476 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయని వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,88,336 మంది, రెండో సంవత్సరంలో 5,07,956 మంది విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించారని తెలిపారు. సోమవారం (3వ తేదీ) నుంచి 22వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ పరీక్షల కోసం 1,812 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. బైపీసీ నుంచి 98,952 మంది, ఎంపీసీ నుంచి 2,34,853 మంది కలిపి మొత్తం 3,33,805 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. వొకేషనల్ కేటగిరీకి సంబంధించి 463 కేంద్రాల్లో 95,247 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోర్డు కార్యాలయం నుంచి పరిశీలిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా ప్రతి జిల్లాకు ఒక డి్రస్టిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. సమస్యలు, సందేహాల నివృత్తి కోసం విద్యార్థులు 92402 05555 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. -
TS: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభమవుతాయని తెలిపింది. సెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.window.googletag = window.parent.googletag;window.__cmp = window.parent.__cmp; window.__tcfapi = window.parent.__tcfapi;!function(a9,a,p,s,t,A,g){if(a[a9])return; function q(c,r){a[a9]._Q.push([c,r])}a[a9]={init:function(){q("i",arguments)},fetchBids:function(){q("f",arguments)},setDisplayBids:function(){},targetingKeys:function(){return[]},_Q:[]}; A=p.createElement(s); A.async=!0; A.src=t; g=p.getElementsByTagName(s)[0]; g.parentNode.insertBefore(A,g)}("apstag",window,document,"script","//c.amazon-adsystem.com/aax2/apstag.js");apstag.init({"pubID":"842701b4-f689-4de3-9ff4-bc1999093771","adServer":"googletag","videoAdServer":"DFP","gdpr":{"cmpTimeout":200},"schain":{"ver":"1.0","complete":1,"nodes":[{"asi":"vuukle.com","sid":"b020f681-0903-4e67-8436-b0208a3b3423","hp":1}]}});window.parent['__vuukleCba6d4e1f3'](); -
ఇంటర్ అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్ వ్యవహారంలో వివాదాలకు తెరదించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఉపక్రమించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధిచిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డ్ సోమవారం విడుదల చేసింది. గతంలో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ సమీపిస్తున్నా.. అఫిలియేషన్ వ్యవహారం కొలిక్కిరాక గుర్తింపు రాని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయేది. దీంతో ఇలాంటి వివాదాలకు పుల్‌స్టాప్ పెడుతూ వచ్చే ఏడాది కాలేజీలు మొదలయ్యే నాటికే అఫిలియేషన్ల ప్రక్రియ ముగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యాసంవత్సరానికి కళాశాలల అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్‌ను బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ విడుదల చేశారు. అలాగే, ఏప్రిల్ 30లోపే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించాలని బోర్డు గడువుగా పెట్టుకుంది. ఆలస్యం లేకుండా ముందే... రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు బోర్డు అనుబంధ గుర్తింపును పొందిన తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, నడుస్తున్న కాలేజీలు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అయితే కొంతకాలంగా అనుమతుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇదంతా జూన్ కంటే ముందుగానే ముగియాల్సి ఉండగా, సెప్టెంబర్ వరకు కొనసాగుతోంది. అనుబంధ గుర్తింపు పొందకుండానే కాలేజీలు అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీంతో ఏటా గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సంవత్సరం మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా డిసెంబర్ వరకు అఫిలియేషన్ల జారీ కొనసాగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈసారి ముందుగానే అనుమతుల షెడ్యూల్ ప్రకటించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీ యాజమాన్యాలు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నవీన్‌మిత్తల్ వెల్లడించారు. ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అఫిలియేషన్‌కూ జీఎస్టీ ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపునకూ ఇకపై జీఎస్టీ చెల్లించాలి. తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన అఫిలియేషన్ నోటిఫికేషన్లో ఈ అంశాన్ని కొత్తగా చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే కళాశాలలకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూ. 21 వేల నుంచి రూ. 65 వేల వరకూ ఉంటాయి. ఈ మొత్తానికి 18 శాతం జీఎస్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అఫిలియేషన్ పొందే కాలేజీలు కూడా సేవల పరిధిలోకి వస్తాయని బోర్డు పేర్కొనడం గమనార్హం. -
ఇంగ్లిష్‌కూ ప్రాక్టికల్స్! 20 నుంచి 25 మార్కులు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో వచ్చే ఏడాది నుంచి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. జాతీయస్థాయిలో పోటీ పడేలా సరికొత్త విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా తాము వేసిన కమిటీ కసరత్తు ముమ్మరం చేసిందన్నారు. ‘సాక్షి’తో మంగళవారం నవీన్ మిత్తల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానంలో మార్పులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే తెలంగాణ కాలేజీ విద్యను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉన్నత విద్యకు కీలకమైన ఇంటర్మీడియెట్‌లో అత్యున్నత ప్రమాణాలు తెచ్చే ప్రయత్నం కీలక దశకు చేరుకుంది. ఉన్నత విద్యలో ఇప్పటివరకు కేవలం విద్యార్థి మెమరీని గుర్తించడానికి పరీక్ష పెట్టారు. ఇక నుంచి వారిలోని సృజనాత్మకత, ఆలోచన విధానం వెలికితీసేలా పరీక్ష తీరు ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. దీనికి అనుసరించాల్సిన విధానాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కమిటీ వేశాం. మరికొన్ని నెలల్లోనే ఇది తమ ప్రతిపాదనలను సమర్పిస్తుంది’ అని చెప్పారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణపై అవగాహన పెంపు ఇంటర్లో ఇప్పటివరకు సైన్స్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ఉండేవని, ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టుకూ దీన్ని విస్తరించాలని బోర్డ్ నిర్ణయించిందని నవీన్ మిత్తల్ చెప్పారు. ఇది ఏ విధంగా ఉండాలనేదానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు తీసుకున్నామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని ప్రాక్టికల్‌గా భావిస్తారని, దీనికి 20 నుంచి 25 మార్కులు ఉండే అవకాశముందన్నారు. ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ పెట్టడం వల్ల మొదట్నుంచీ ఇంగ్లిష్ ఉచ్ఛారణపై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ సిలబస్‌పై సిలబస్ కమిటీని నియమించామని, ఇటీవలే ఈ కమిటీతో భేటీ జరిగిందని చెప్పారు. రాష్ట్ర సిలబస్ చదివిన విద్యార్థి జాతీయస్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్, కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను తేలికగా రాసేలా సిలబస్ రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చరిత్ర విషయంలో రాష్ట్ర చరిత్రకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, సైన్స్ సబ్జెక్టుల్లోనే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను మేళవించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి అవకాశాలున్న అనేక కోర్సుల మేళవింపు, ఏయే సబ్జెక్టుల్లో ఎంత వరకు పాఠాలు అవసరం అన్నది పరిశీలించి మార్పు చేస్తామన్నారు. జనవరి 18 నుంచి అఫిలియేషన్లు ప్రైవేటు ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ విషయంలో గతంలో మాదిరి ఆలస్యం చేయకూడదని నిర్ణయించినట్లు నవీన్ మిత్తల్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను జనవరి 18 నుంచి మొదలుపెడతామని, మార్చి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి అనుబంధ గుర్తింపు జాబితాను ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు అంశాన్ని పరిగణనలోనికి తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీనివల్ల ఇంటర్ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు ఉండబోవని తెలిపారు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇంటర్లో మరికొన్ని మార్పులకు అవకాశం లేకుండా పోయిందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ విషయంలో జంబ్లింగ్ విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. -
Telangana: తప్పటడుగుల ఇంటర్ బోర్డుకు చికిత్స!
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. లోపాలను సరిచేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలో నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నవీన్ మిత్తల్‌కు కార్యాచరణ అప్పగించే అవకాశముందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. బోర్డులో అంతర్గతంగా ఉన్న సమస్యలు, నియంత్రణ వ్యవస్థ లోపించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగా కొన్నేళ్లుగా ఇంటర్ పరీక్షల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణాలను అన్వేషించి, తప్పులు జరగకుండా పకడ్బందీగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా తప్పిదాలే... 2019 మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులొచ్చినట్టు గుర్తించారు. వీటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2020 మార్చిలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, కరోనా రావడం, సప్లిమెంటరీ పెట్టలేకపోవడంతో ఫెయిలైన వారందరినీ పాస్ చేశారు. 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను నిర్ధారించారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరానికి అనుమతించారు. కానీ 2021 అక్టోబర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఫస్టియర్ పరీక్షలు పెట్టారు. ఇందులో 49% ఉత్తీర్ణత రావడం, ఆందోళనతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఒకచోట సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. జనగామలో సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు దొర్లాయి. పొలిటికల్ సైన్స్ హిందీ మీడియం ప్రశ్నపత్రం ముద్రించకుండా, చేతిరాతతో అప్పటికప్పుడు ఇవ్వడం విద్యార్థులను కలవరపెట్టింది. ఇలా ప్రతీ ఏటా పరీక్షల నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. సమూల మార్పులే శరణ్యమా? పరీక్ష నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బోర్డుపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని పరిశీలన కమిటీకి అప్పగించే వీలుంది. దీంతోపాటే పరీక్ష కేంద్రాలను, ఇన్విజిలేటర్లను పెంచడం, జిల్లాస్థాయి నుంచే బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించడం వంటి చర్యలూ తీసుకోవాలని భావిస్తున్నారు. (క్లిక్: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ) -
Telangana: ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్‌ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ఇంటర్ సిలబస్‌ను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ కళాశాలలను ఆదేశించింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది. (క్లిక్: రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ) -
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, రీ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! ఫస్టియర్ షెడ్యూల్ ► మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్ ► మే 9(సోమవారం) – ఇంగ్లీష్ ► మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్ ► మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ ► మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్ ► మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్ ► మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 ► మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి సెకండియర్ షెడ్యూల్ ► మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్ ► మే 10(మంగళవారం) – ఇంగ్లీష్ ► మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్ ► మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ ► మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్ ► మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్ ► మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 ► మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి -
తెలంగాణ: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి ►ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1 ►ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1 ►ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1 ►మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 21న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, ►ఏప్రిల్ 23 న ఇంగ్లిష్ పేపర్ 2 ►ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2, ►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2 ►ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2, ►మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2 -
తెలంగాణలో వివాదంగా మారిన జోనల్ విధానం రద్దు
-
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
Telangana Inter First Year Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 56 శాతం ఉండగా.. బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. చదవండి: (అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు ) ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
TS: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు: ఇప్పటికైతే హ్యాపీ..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు సులువుగా ఉండటం విద్యార్థుల్లో జోష్ నింపుతోంది. చాలా మంది మంచి మార్కులు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుంటున్నాయని చెబుతున్నారు. ఐచ్ఛిక ప్రశ్నలివ్వడం కూడా కలసివస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపైనా ఇదే మాదిరిగా ప్రశ్నలు ఉంటాయని బోర్డు అధికారులు భరోసా ఇస్తున్నారు. సాదాసీదాగా పరీక్షలు రాసేవారు కూడా పాస్ మార్కులు తెచ్చుకోవడం సులభమేనని అధ్యాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐచ్ఛిక ప్రశ్నల్లో సమాధానం ఇచ్చేందుకు వీలుగా బోర్డ్ విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌లో పోర్షన్ ఉంటోందని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన, కోవిడ్ వల్ల సిలబస్ పూర్తికాని పరిస్థితులను పరిగణలోనికి తీసుకునే ప్రశ్నపత్రాలు రూపొందించినట్టు అధ్యాపకవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు సైతం ఇప్పటి వరకూ తాము అందించిన స్టడీ మెటీరియల్‌కు బదులు ఇంటర్ బోర్డ్ మెటీరియల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కన్పిస్తోంది. సోమ, మంగళవారాల్లో జరిగిన లాంగ్వేజ్ పేపర్లలో ప్రశ్నలు తికమక పెట్టేలా లేవని నిపుణులు చెబుతున్నారు. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టుల్లో ఈ అవకాశాలుండే వీలుందని కొంత సందేహిస్తున్నారు. అయితే, ఇవి కూడా ఇంచుమించు విద్యార్థులను ఇబ్బంది పెట్టబోవని ఇంటర్ బోర్డ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐచ్ఛికాలతో నెట్టుకొచ్చారు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,30,563 (మొత్తం 4,59,240) హాజరయ్యారు. తాజా ఇంటర్ పరీక్షలను 70 శాతం సిలబస్ నుంచే ఇస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈమేరకే స్టడీ మెటీరియల్ ఇచ్చింది. అయితే, కొన్ని ప్రశ్నలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయని తెలుగు సబ్జెక్టు విద్యార్థులు తెలిపారు. చాయిస్ ఇవ్వడం వల్ల ఆ ప్రశ్నల వల్ల ఇబ్బంది కలగలేదని చెప్పారు. 30 శాతం ప్రశ్నలు ప్రిపేర్ కాని చాప్టర్ల నుంచి వచ్చాయని, వీటిని చాయస్‌గా వదిలేశామని మెజారిటీ విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. తొలిరోజు మాత్రం విద్యార్థులు కొంత ఆందోళనగా కన్పించారు. ఆలస్యంగా పరీక్షలు జరగడం ఒకటైతే, పదవ తరగతి పరీక్షలు రాయకుండా ఇంటర్లోకి రావడం మరో కారణంగా అధ్యాపకులు చెబుతున్నారు. పరీక్షలు రాసే అవకాశం చాలా కాలం తర్వాత రావడంతో విద్యార్థుల్లో మొదట ఆందోళన నెలకొందని విశ్లేషిస్తున్నారు. రెండో రోజు మాత్రం ఆ సమస్య కనిపించలేదని ఇన్విజిలేటర్స్ పలువురు తెలిపారు. ఆత్మవిశ్వాసం పెరిగింది.. చాలాకాలం తర్వాత పరీక్షలు రాయాల్సి రావడంతో కొంత ఆందోళన అనిపించింది. బోర్డు మెటీరియల్ ఫాలో అవ్వడం, ప్రశ్నపత్రాలు ఐచ్ఛికాలతో ఉండటం వల్ల మొదటి రెండు పరీక్షలు తేలికగా రాశాం. మిగతా పరీక్షలు తేలికగా రాయగలనన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. –శశాంక్ (విద్యార్థి, దిల్సుఖ్నగర్ పరీక్ష కేంద్రం వద్ద) పాసవడం తేలికే.. ఇప్పటివరకూ జరిగిన రెండు పేపర్లు గతంకన్నా భిన్నంగా ఉన్నాయి. ఎక్కువ భాగం బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ నుంచే ప్రశ్నలు వచ్చాయి. విద్యార్థులు ఏమాత్రం దృష్టి పెట్టినా తేలికగా పాసయ్యే వీలుంది. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే పద్ధతి ఉంటే బాగుంటుంది. – జీకే రావు (ప్రైవేటు కాలేజీ లెక్చరర్) -
Telangana: పరీక్షలంటే భయపడితే కాల్చేయండి!
సాక్షి, హైదరాబాద్: పరీక్షలంటేనే భయం. కరోనా ఆ భయాన్ని మరింత పెంచింది. ఆ భయాన్ని పోగొట్టేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ముందడుగు వేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ఫస్టియర్ నేపథ్యంలో... మానసిక ఒత్తిడి, పరీక్షల భయం ఉన్న విద్యార్థులకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని అందించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆందోళనకు గురయ్యే విద్యార్థులు సైకాలజిస్టులకు ఫోన్ చేసి సహాయం పొందాలని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చే సైకాలజిస్టుల ప్యానల్లో వైద్యులు అనిత ఆరే (9154951704,), మేజర్ అలీ (9154951977), రజనీ తెనాలి (91549 51695), పి జవహర్లాల్ నెహ్రూ (91549 51699), యస్ శ్రీలత (9154951703), శైలజ పిశాపాటి (9154951706), అనుపమ (9154951687) ఉన్నారు. (చదవండి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆపలేం.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్) పరీక్షలకు సహకరిస్తాం: టీపీజేఎంఏ ఈ నెల 25 నుంచి జరిగే ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు అన్ని విధా ల సహకరిస్తామని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షుడు గౌరీ సతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్‌తో చర్చల అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. పెండింగ్‌లో ఉన్న కాలేజీల ఉపకారవేతనాలకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారని సతీశ్ తెలిపారు. (చదవండి: చలో సర్కారు బడి.. అదే సమస్య మరి!) -
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చిచెప్పిన హైకోర్టు
-
తెలంగాణ: లైన్ క్లియర్, 25 నుంచి ఇంటర్ పరీక్షలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. చదవండి: TS Inter 1st Year Exams: ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్! ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందని హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు చేయాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: హైదరాబాద్‌లో దృశ్యమైన బాలుడు అనీష్ మృతి పేరేంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్ పరీక్షలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది ఇంటర్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. -
ఇంటర్ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 25 నుంచి నిర్వహించే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తేలికగానే ఉంటాయని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్ బోర్డ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటున్నారు. విద్యార్థులను తికమకపెట్టే డొంక తిరుగుడు ప్రశ్నలను సాధ్యమైనంత వరకూ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొద్దిపాటి శ్రద్ధ తీసుకునే విద్యార్థి కూడా గట్టెక్కే రీతిలో పరీక్షలు ఉండబోతున్నాయనే భరోసాను అధికారులు కలి్పస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే బోర్డు ప్రకటించింది. కరోనా కారణంగా ఫస్టియర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి అనుమతించిన విషయం తెలిసిందే. మునుపటికన్నా భిన్నంగా, రాయాల్సిన వాటికన్నా ప్రశ్నలు ఎక్కువ ఇవ్వనున్నారు. దీనివల్ల ఏదో ఒక ప్రశ్నకు విద్యార్థి సిద్ధమై ఉంటాడని, సులభంగా జవాబు రాసే వీలుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ప్రశ్నల తీరు ఇలా.... ►సబ్జెక్టుల్లో సగానికి సగం చాయిస్ ఇస్తున్నారు. ముఖ్యంగా గణితంలో ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు సాధ్యమైనంత వరకూ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. గణితంలో మూడు సెక్షన్లుంటాయి. ‘ఎ’సెక్షన్లో 2 మార్కులు, ‘బి’లో 4, ‘సీ’లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. ఏ సెక్షన్‌లోని 10 ప్రశ్నల కూ సమాధానం ఇవ్వాలి. ‘బీ’లో 10 ప్రశ్నలకుగాను 5, ‘సీ’లో 10 ప్రశ్నలకుగాను ఐదింటికి రాయాలి. ►భౌతికశాస్త్రంలో ఏ సెక్షన్లో 2, బీ సెక్షన్లో 4, సీ సెక్ష న్లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్ ఏలో ఉన్న మొ త్తం పది ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, ‘సీ’ లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలివ్వాలి. ►రసాయనశాస్త్రంలో సెక్షన్ ఏలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్ బీలో 4, సెక్షన్ సీలో 8 మార్కుల ప్రశ్నలివ్వనున్నారు. ‘ఏ’లో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకుగాను 6, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి సమాధానాలు రాయాలి. ►బోటనీ సెక్షన్–ఏలో 2 మార్కులు, సెక్షన్–బీలో 4 మార్కులు, సెక్షన్–సీలో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్–ఏలో ఉన్న మొత్తం 10 ప్రశ్నలకు, ‘బీ’లో 12 ప్రశ్నలకు గాను ఆరింటికి, ‘సీ’లో 4 ప్రశ్నలకుగాను రెండింటికి జవాబులు రాయాలి. ►అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో సెక్షన్–ఏలో 10, సెక్షన్–బీలో 5, సెక్షన్–సీలో 2 మార్కుల ప్రశ్నలిస్తారు. ఏ సెక్షన్లో 6 ప్రశ్నలకుగాను 3, ‘బీ’లో 16 ప్రశ్నలకుగాను ఎనిమిదింటికి, ‘సీ’లో 30 ప్రశ్నలకుగాను 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. వాళ్ల సంగతేంటి? ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గతంలో ఫీజు కట్టిన వాళ్లకే అవకాశం ఇస్తున్నారు. అయితే, అప్పట్లో 10 వేల మంది ఫీజులు చెల్లించలేదు. ఈ సమయంలో పరీక్షలు లేకుండా అందరినీ రెండో ఏడాదిలోకి ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఫీజు కట్టని వాళ్లకు ఇప్పుడు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. వీళ్లంతా ద్వితీయ సంవత్సరం కొనసాగిస్తూ ఆ ఏడాదితో పాటే, ఫస్టియర్ పరీక్షలూ రాయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కాబట్టి పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఆశ్రయించారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని, ఇంటర్ మొదటి ఏడాది మార్కులే ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయని విద్యార్థులు అంటున్నా రు. రెండో ఏడాది ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో చదివామని చెబుతున్నారు. పైగా పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇంటర్లో కనీసం 50% మార్కులు సాధించాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుంటే తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అంటున్నారు. కాగా తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చిన సంగతి తెలిసిందే. తాజా విన్నపాలతో నోటిఫికేషన్ జారీచేసి కోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలని యోచిస్తుంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిసింది. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. -
ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నా.. విద్యాసంస్థల మూసివేత కారణంగా ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని స్థితిలో ఇంటర్మీడియట్ బోర్డు ఉంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం నిలిపేసింది. ముంద స్తు షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసినందున ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో 3 ప్రత్యామ్నాయాలను రూపొందించి ప్రభుత్వానికి పంపింది. అందులో యథావిధిగా ప్రాక్టికల్స్ నిర్వహణకు అనుమతించడం, లేదంటే ఏప్రిల్ 10 వర కు వాయిదా వేయడం, అదీ కుదరకపోతే మేలో ఇం టర్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యా క ప్రాక్టికల్స్ నిర్వహించడం వంటి 3 ప్రత్యామ్నా యాలను పేర్కొన్నట్లు తెలిసింది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సిందేనని, ప్రాక్టికల్ పరీక్షలు లేకుండా మార్కులు వేయ డం సాధ్యం కాదన్న భావనను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాక్టికల్ పరీక్షల వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రాక్టికల్ ఏప్రిల్ 7 నుంచి నిర్వ హించినా, 10 నుంచి నిర్వహించినా పెద్ద తేడా ఏ మీ ఉండదు. అందుకే ప్రాక్టికల్స్‌ను మే నెలాఖరు కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్స్‌కు బదులు మరేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఇంటర్నల్ అసైన్మెంట్స్ ఇచ్చి వాటినే ప్రాక్టికల్ మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే కోణంలో యోచిస్తు్తన్నట్లు తెలిసింది. ఏదేమైనా రెండు మూడ్రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై స్పష్టత రానుంది. ఆందోళనలో 2,62,169 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాల్సిన సైన్స్ కోర్సులకు చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,62,169 మంది ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వొకేషనల్ ప్రథమ సంవత్సర విద్యార్థులు 48,026 మంది, వొకేషనల్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,287 మంది, జాగ్రఫీ విద్యార్థులు 557 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,58,814 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,73,523 మంది పరీక్ష ఫీజు చెల్లించినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
పరీక్షలు రాయకుండా పాస్ చేయలేం: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్మెంట్ రూపంలో నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. చదవండి: ఇంటర్లో 30% సిలబస్ కోత -
మార్పులు లేవు! తెలంగాణ విద్యామండలి కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు. ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు. సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయ మే ఫైనల్ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. 20 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ఎంసెట్–2021 నోటిఫికేషన్‌ను ఈనెల 18న జారీచేసేందుకు సెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20 నుంచి మే 18 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించనుంది. ఇక జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుంది. జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్‌ను నిర్వహించనుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 23 టెస్ట్ జోన్ల పరిధిలోని 58 పట్టణాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. -
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 100 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు, 1000 రూపాయల ఫైన్‌తో మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని పేర్కొంది. చదవండి: సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిదే. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. -
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం; వాళ్లందరూ పాస్!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్ విద్యార్ధులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు 27,251 ఉండగా, మాల్‌ప్రాక్టీసు స్క్రూటినీ కమిటీ బహిష్కరించిన వారు 338 మంది ఉన్నారు. కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.(చదవండి: ధరణి పోర్టల్ సేవలపై హైకోర్టు స్టే) -
తూచ్..అది ప్రతిపాదనే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ సిలబస్ తగ్గింపుపై ఇంటర్ బోర్డు వెనక్కి తగ్గింది. సిలబస్ కుదింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే దానిపై కాంపిటెంట్ అథారిటీ నిర్ణయం ఇంకా తీసుకోలేదని బుధవారం బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ పని దినాలు నష్టపోయినందున వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను కుదిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన ఇంటర్ బోర్డు.. తెల్లవారే అది ప్రతిపాదన మాత్రమేనని చెప్పడం కొంత గందరగోళానికి దారితీసింది. బోర్డు అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి ఆమోదం లేకుండానే పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) సంతకంతో సిలబస్ కుదింపు ప్రకటనతోపాటు, సబ్జెక్టుల వారీగా సిలబస్ విడుదల అయింది. బుధవారం మాత్రం కాంపిటెంట్ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదనిబోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. ప్రముఖుల పాఠాలు తొలగించం... నిబంధనల ప్రకారం.. ఇంటర్ బోర్డులో కాంపిటెంట్ అథారిటీ అంటే బోర్డు కార్యదర్శే. లేదంటే ప్రభుత్వం. అంటే బోర్డులో కీలకమైన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యదర్శి ఆమోదం లేకుండానే సిలబస్‌ను విడుదల చేశారా.. అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. కరోనా కారణంగా నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు సీబీఎస్ఈ కుదించిన 30 శాతం సిలబస్‌కు అనుగుణంగా.. రాష్ట్రంలోనూ సిలబస్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై వెంటనే సిలబస్ కమిటీలను ఏర్పాటు చేశామని.. వారు కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్ కుదింపునకు సిఫారసు చేశారన్నారు. అదీ ఈ ఒక్క సంవత్సరం కోసమేనని పేర్కొన్నారు. అయితే.. దీనిపై కాంపిటెంట్ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదన దశలోనే ఉందని, త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అలాగే హ్యుమానిటీస్ సిలబస్‌లో జాతి నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖుల పాఠాలను తొలగించే ప్రశ్నే లేదని చెప్పారు. -
ఇంటర్లో 30% సిలబస్ కోత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పోయిన పనిదినాలకు అనుగుణంగా సిల బస్‌ను సర్దుబాటు చేయను న్నారు. తద్వారా విద్యార్థులు, అధ్యాప కులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్ బోర్డు పంపించిన ప్రతిపాద నకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ కోత విధించిన సిల బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడి యట్లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్త కుండా సీబీఎస్ఈ తొలగించిన పాఠాలనే రాష్ట్ర సిలబస్‌లోనూ తొలగించనున్నారు. అలాగే హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. పనిదినాలు గతేడాది 222 ఉంటే ఈసారి 182కు పరిమితమయ్యాయి. 40 రోజులు తగ్గిపోయాయి. అందుకు అనుగుణంగా సిలబస్‌ను తగ్గించనున్నారు. తొలగించాల్సిన పాఠ్యాంశాలపై ఇప్పటికే బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే నియమించిన సబ్జెక్టు కమిటీలు కోత పెట్టాల్సిన సిలబస్‌ను ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నాయి. ఆ వెంటనే తొలగించే పాఠ్యాంశాల వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించనుంది. మరోవైపు గత మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి వివిధ కారణాలతో పరీక్షలు రాయని 27 వేల మంది విద్యార్థులను కూడా పాస్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే బోర్డు ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆన్లైన్లో ఇంటర్ ప్రవేశాలు.. రాష్ట్రంలో ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన ప్రభుత్వ కాలేజీలు, సంక్షేమ గురుకులాలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ కాలేజీలు, కేజీబీవీలు, ఫైర్ ఎన్వోసీ ఉన్న 77 ప్రైవేటు కాలేజీలు మొత్తంగా 1,136 కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 1,496 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. అయితే అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ కొనసాగుతోందని ఇంటర్ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (www.tsbie. cgg.gov.in)అందుబాటులో ఉన్న ఈ కాలేజీల్లో చేరవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఇతర కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని పేర్కొన్నారు. జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై శిక్షణ.. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు జలీల్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు దూరదర్శన్ యాదగిరి చానల్లో 16 వారాల పాటు కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. -
ప్రయివేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లోని కొన్ని మేనేజ్మెంట్ తమ కాలేజీల నుంచి ఇప్పటికే చాలా మంది సిబ్బందిని (టీచింగ్ & నాన్-టీచింగ్) తొలగించినట్లు తెలిసిందని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు నాంపల్లిలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యా భవన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి పరిస్థితిలో సిబ్బందికి జీతాలు చెల్లించలేక తొలగించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇది G.O.Ms.45, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ: 22-03-2020 రెగ్యులేషన్ 14కు వ్యతిరేకం అయినందున ఏదైనా ఉల్లంఘనకు పాల్పడితే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు తీసుకోంటామని తెలిపింది.(ఇంటర్ పనిదినాలు...182 రోజులే!) ఇంకా నిర్దేశించిన క్వాలిఫైడ్ టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేకపోతే కూడా ఈ విద్యా సంవత్సరం అంటే 2020-21 అఫిలియేషన్ దరఖాస్తులు తిరస్కరించనున్నట్లు తెలిపింది. రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును అందిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యలు, ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 కింద జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని, తప్పుగా వ్యవహరించిన యజమాన్యానికి ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయనున్నట్లు తెలిపింది. -
ఇంటర్ పనిదినాలు...182 రోజులే!
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా విద్యా సంవత్సర ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ ప్రభావం ఇంటర్మీడి యట్ తరగతులు, పరీక్షల నిర్వహణపైనా పడింది. సాధార ణంగా ఏటా మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించే ఇంటర్ బోర్డు ఈసారి కరోనాతో పనిదినాలు కోల్పోయిన నేపథ్యంలో 2021 మార్చిలో ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. 2021, మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్ తరగతులు (దూరదర్శన్, టీశాట్ ద్వారా వీడియో పాఠాలు) ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్ జారీ చేసింది. గత మార్చి 21 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాగా అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఆగస్టు 31 వరకు సెలవులు కొనసాగినట్లు పేర్కొంది. నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేస్తూ సెలవులను కూడా కుదించింది. సాధారణంగా 220 రోజులతో విద్యా సంవత్సరం ఉండనుండగా, ఈసారి 182 రోజుల పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది. మరోవైపు తాము ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన తరువాతే కాలేజీలు ఇంటర్ ప్రథమ సంవత్స రంలో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని వెల్లడించింది. ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. -
విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్‌హెచ్చార్సీ విచారణ
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) మంగళవారం ఢిల్లీలో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో 194 కాలేజీలను తనిఖీ చేశామని అందులో లోపాలు ఉన్నాయని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. ఆ మేరకు కోటి 80లక్షల రూపాయలకు పైగా జరిమానా విధించినట్లు నివేదికలో పేర్కొంది. అనధికారికంగా హాస్టల్ నడుపుతున్న కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, సెలవు రోజుల్లో క్లాసులో నిర్వహణపై కాలేజీలకు జరిమానా విధించినట్లు తెలిపింది. నివేదికను పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ.. విద్యార్థుల సమస్యలపై తల్లిదండ్రులతో కాలేజీ యాజమాన్యాలు ఓరియంటేషన్ జరపాలని ఇంటర్మీడియట్ బోర్డును ఆదేశించింది. కాగా తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. -
ఇంటర్ సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల 9 నుంచి 12వ తరగతి వరకు 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు చేపడుతోంది. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీబీఎస్ఈ సిలబస్ నే ప్రామాణికంగా తీసుకొని ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో గతంలోనే జాతీయ స్థాయికి అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్ సిలబస్‌ను మార్పు చేసింది. మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈలో ఉన్న సిలబస్ కంటే కొంత ఎక్కువే ఉండేలా చర్య లు చేపట్టింది. కరోనా నేపథ్యంలో జూన్‌లో ప్రారం భం కావాల్సిన జూని యర్ కాలేజీలు ఇంతవరకు మొదలు కా లేదు. ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలే ని పరిస్థితి.. ఈ నేపథ్యంలో జాతీ య స్థాయిలో 30% సి లబస్ కుదింపునకు సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుం ది. సీబీఎస్ఈ ఏయే పాఠ్యాంశాలను తొ లగిస్తుందో రాష్ట్రంలోనూ వాటినే తొలగించాలని నిర్ణయించింది. ముఖ్యంగా మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ ప్రకారమే తొలగింపును అమలు చేయనుంది. ఇక ఆర్ట్స్, భాషా సబ్జెక్టులు మాత్రం రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే చాలా వరకు ఉంటాయి కాబట్టి స్థానికంగానే నిర్ణయం తీసుకోనుంది. భాషా, ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలు ఉంటే వాటిని తొలగించడంతోపాటు స్థానిక అంశాలకు సంబంధించిన సిలబస్‌ను కుదించేందుకు చర్యలు చేపట్టింది. ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తొలగించబోయే కొన్ని పాఠ్యాంశాలు ఇవీ.. మ్యాథమెటిక్స్ ప్రతి పేపర్లో మొత్తం 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలను తొలగించబోతున్నారు. ► 1ఏలో చాప్టర్–1 ఫంక్షన్స్‌లో 2 మార్కులు, 8 పిరియడ్లు కలిగిన రియల్ వ్యాల్యూడ్ ఫంక్షన్స్ (డొమెయిన్, రేంజ్, ఇన్వర్స్) ► చాప్టర్–2లో 7 వెయిటేజీ మార్కులు, 8 పిరియడ్లు కలిగిన మ్యాథమెటికల్ ఇంట్రడక్షన్ మొత్తం. ► చాప్టర్–3 మ్యాట్రిసెస్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన డిటెర్మినాంట్స్, కాన్సిస్టెన్సీ అండ్ ఇన్కాన్సిటెన్సీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ సిమ్యులేషన్ ఈక్యూస్, సొల్యుషన్ ఆఫ్ సైమల్టెనియస్ లీనియర్ ఈక్యూఎస్. ► చాప్టర్–5 ప్రొడక్ట్ వెక్టార్స్‌లో 7 మార్కులు, 14 పిరియడ్లు కలిగిన స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ఈక్యూ ఆఫ్ ప్లేన్, డిఫరెంట్ ఫారమ్స్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ► చాప్టర్–7లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశాలు మొత్తం. ► చాప్టర్–8లో 4 మార్కులు, 5 పిరియడ్లు కలిగిన పాఠ్యాంశం మొత్తం తొలగించనున్నారు. అలాగే మ్యాథమెటిక్స్ 1బీలోనూ 31 వెయిటేజీ మార్కులు, 45 పిరియడ్లు కలిగిన ఆరు ఛాప్టర్లలోని 10 పాఠ్యాంశాలు, 2ఏలోనూ ఆరు చాఫ్టర్లలో 30 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలు, 2బీలోనూ ఆరు చాఫ్ట్రర్లలోని 31 మార్కులు, 45 పిరియడ్లు కలిగిన 10 పాఠ్యాంశాలను తొలగించనున్నారు. ప్రథమ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు.. ► చాప్టర్–1లో స్కోప్ అండ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఫిజిక్స్,– టెక్నాలజీ అండ్ సొసైటీ, నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. ► చాప్టర్–5లో ది లా ఆఫ్ ఇనెర్టియా, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ► చాప్టర్–7లో థియరిమ్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ప్యారలాల్ ఆక్సిస్. ► చాప్టర్–9లో కెప్లర్స్ లాస్, యాక్సిలరేషన్ డ్యూటు గ్రావిటీ ఆఫ్ ది ఎర్త్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ బిలో అండ్ ఏబోవ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ► చాప్టర్ 10లో ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, ఎలాస్టిక్ మాడ్యులీ ► చాప్టర్––12లో టెంపరేచర్ అండ్ హీట్, హీట్ ట్రాన్స్ఫర్ ► చాప్టర్– 13లో హీట్ ఇంజన్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ హీట్ పంప్స్. ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌లో తొలగించబోయే పాఠ్యాంశాలు ► చాప్టర్–1లో ది ప్రిన్సిపుల్ ఆఫ్ సూపర్‌పొజిషన్ ఆఫ్ వేవ్స్, డాప్లర్ ఎఫెక్ట్. ► చాప్టర్–2లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్, సమ్ నేచురల్ ఫినామినా డ్యూ టూ సన్‌లైట్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ► చాప్టర్–3లో ఆప్లికేషన్ ఆఫ్ గాయ్స్ లా ► చాప్టర్–6లో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ – సిరీస్ అండ్ ప్యారలాల్. ► చాప్టర్–7లో టారక్య్ ఆన్ కరెంట్ లూప్, మ్యాగ్నటిక్ డిపోల్. ► చాప్టర్–8లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ► చాప్టర్–10లో పవర్ ఇన్ ఏసీ సర్క్యూట్: ది పవర్ ఫ్యాక్టర్. ► చాప్టర్–11లో డిస్ప్లేస్మెంట్ కరెంట్. ► చాప్టర్–12లో డావిస్సన్ అండ్ గార్మర్ ఎక్స్పెరిమెంట్ ► చాప్టర్–13లో మాస్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీ, రేడియో యాక్టివిటీ ► చాప్టర్–15లో స్పెషల్ పర్పస్ పీ–ఎన్ జంక్షన్ డియోడ్స్ -
ఇంటర్లో గ్రేస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను (గ్రేస్ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 10 నుంచి 20 వరకు గ్రేస్ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. మ్యాథమెటిక్స్‌లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా? జూన్/జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కింద పాస్ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. -
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేదిని బోర్డు ప్రకటించింది. ఈ నెల 18న ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించింది. పరీక్షల ప్రక్రియను ఇప్పటికే బోర్డు పూర్తి చేసింది. పరీక్షల ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెబ్ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. -
రెండ్రోజుల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశంపై సోమవారం స్పష్టత రానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నేడు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సమావేశమై తేదీని ఖరారు చేయనున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలితాల ప్రాసెస్ పూర్తయింది. ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్లైన్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ ఓకే అనుకుంటే, మంగళవారం విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అది సాధ్యం కాకపోతే బుధవారం (17వ తేదీన) విడుదల చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. -
15 లేదా 17న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారంలో వెలువడనున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధ్యమైనంత వరకు ఈనెల 15న ఫలితాలను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 15న ఫలితాల విడుదల వీలుకాకపోతే 17న వెల్లడించాలని భావిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెబ్ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. దీంతో ఈనెల 20–23 తేదీల మధ్య డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తానికి వచ్చే నెలలో మొదటి దశ సీట్ల కేటాయింపును దోస్త్ ప్రకటించనుంది. -
జూనియర్ కాలేజీల ప్రారంభం వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీ ల ప్రారంభాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఇంటర్మీడియట్ అకడమిక్ కేలండర్ ప్రకారం వేసవి సెలవులు ముగిశాక జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ తేదీన జూనియర్ కాలేజీలను ప్రారంభించడం లేదని, తరగతుల నిర్వహ ణను చేపట్టడం లేదని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత తెలియజేస్తామన్నారు. ‘అడ్వాన్స్డ్’లో రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపరు–2, మోడర్న్ లాంగ్వేజ్ పేపరు–2 పరీక్షలను జూన్ 3న నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉం టాయన్నారు. విద్యార్థులు జ్టి్టpట://్టటbజ్ఛీ. ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవాలని సూచించారు. ఇక ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై మూడో వారంలో నిర్వహిస్తామని తెలిపారు. రవాణా సదుపాయం, ఇతరత్రా కారణాలతో 3న పరీక్షల కు హాజరు కాలేని విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ సబ్జెక్టులను రాసుకోవచ్చని, అపుడు పరీక్షలు రాసినా రెగ్యులర్ విద్యార్థులుగా నే పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. -
జూన్ 15న ఇంటర్ ‘ద్వితీయ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను జూన్ 15వ తేదీన విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో పూర్తయింది. ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తరువాత ఫలితాల ప్రాసెస్ చేయాల్సి ఉంది. అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని ఇదివరకే భావించినా అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ద్వితీయ సంవత్సరంతోపాటే ప్రథమ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యం కాకపోతే జూన్ 15న ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించి ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఫస్టియర్ ఫలితాలు విడుదల చేయనుంది. మొత్తానికి జూన్ 20వ తేదీలోగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు. టెన్త్ ఫలితాలు వచ్చాక ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించింది. ఇక ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 తరువాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్, నీట్, జేఈఈ ఆన్లైన్ మాక్ టెస్టులు.. ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మాక్ టెస్టులను అందుబాటులోకి తెచ్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు www.rankersl-earning.comలో పొందవచ్చని తెలిపారు. -
ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఈ నెల 30నాటి కి ప్రథమ సంవత్సర జవాబు పత్రాల మూల్యాం కనం పూర్తి కానుంది. ఆ తరువాత జూన్ మొదటి వారంలో ఫలితాల ప్రక్రియను చేపట్టి, రెండో వారంలో ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. కాగా, ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఎలా ఉండాలన్న దానిపై నియమించిన సీనియర్ అధికారుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక ఆధారంగా విద్యా కార్యక్రమాల కొనసాగింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. -
జూన్ 3న ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో వాయిదా పడిన ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 3వ తేదీన ఇంటర్ ద్వితీయ సంవత్సర జియాగ్రఫీ పేపర్–2, మోడర్న్ లాంగ్వేజ్ పేపర్–2 పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, పాత పరీక్ష కేంద్రాల్లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు పాత హాల్ టికెట్లతోనే హాజరు కావచ్చని వెల్లడించారు. -
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షా పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి సబితా గురువారమిక్కడ మాట్లాడుతూ గతంలో 12 వాల్యుయేషన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 కేంద్రాలకు పెంచామన్నారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ప్రయివేట్ స్కూల్స్ గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. (జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!) -
ఆన్లైన్లో ఎంసెట్, జేఈఈ, నీట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్లైన్లో జేఈఈ, నీట్, ఎంసెట్ పాఠాలను బోధించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యా ర్థులకు గ్రాండ్ టెస్టులను ఈనెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవీ వీడియో పాఠాల లింక్స్.. http://www.tdisk. in http://tsat.tv http://www.softnet. telangana. gov. in -
ఇంటర్ విద్యార్థుల కోసం యూట్యూబ్ చానెల్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం యూట్యూబ్ చానెల్ ను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పేరుతో ఇప్పటికే రూపొందించిన ఈ చానెల్లో వీడియో పాఠాలు పొందుపరుస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల పాఠాలు అందులో పొందుపరిచినట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని పాఠాలను, ప్రథమ సంవత్సర పాఠాలను ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నామని త్వరలోనే వాటిని అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. టీశాట్, ఇతర వెబ్సైట్లకు సంబంధించిన పాఠాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టుల పాఠాలను రూపొందించాక వాటిని నిఫుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపి అప్రూవల్ తీసుకుంటామన్నారు. ఆయా వీడియో పాఠాలను విద్యార్థులకు వచ్చే జూన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులు వాటిని ప్రారంభం నుంచే వీక్షించేలా చర్యలు చేపడతామని తెలిపారు. సైన్స్ ప్రాక్టికల్స్ ఎలా చేయాలన్న దానిపైనా పాఠాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాఠాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా చూసుకునేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు జేఈఈ, నీట్‌కు సంబంధించిన పాఠాలను కూడా రూపొందించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అమలు చేస్తున్నట్లు జలీల్ వెల్లడించారు. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) బార్ కోడ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ను (ఓసీఆర్) ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఓఎంఆర్‌లో బార్ కోడ్ విధానం ఉండనుం డగా, ఓసీఆర్‌లో విద్యార్థుల ఫొటోలు స్కాన్ చేస్తారని, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకా రంతో పరీక్షలకు వచ్చింది ఆ విద్యార్థు లేనా? ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు వచ్చారా? అన్నది సులభంగా గుర్తించే వీలుంటుందని వెల్లడించారు. ఓఎంఆర్ బబ్లింగ్‌ను మాత్రమే చూడనుంది. ఓసీఆర్ మాత్రం పదాల్లో రాసిన వివరాలను, నంబర్లను, బబ్లింగ్ నంబ ర్లను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. దాంతో జవాబులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లో ఏమైనా తేడా లొస్తే వాటిని సులభంగా గుర్తించొచ్చని వివరించారు. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో 90% మార్కులు వచ్చి, మరొక సబ్జెక్టులో 9 మార్కు లే వస్తే ఆ అబ్నార్మల్ డిఫరెన్స్‌ను ఏఐతో గుర్తించొచ్చని వివరించారు. మార్చి 4 నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,339 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
తప్పుల సవరణకు అవకాశం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ విషయంలోను ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాల్టికెట్లలో జరిగే లోపాల సవరణకు ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సైట్లోకి వెళ్లి తమ హాల్‌టికెట్‌లో తప్పులు ఏవైనా ఉంటే.. వాటిని సరి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లోపాల సవరణకు ఆదివారం వరకు మాత్రమే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తప్పులు మరో సారి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తప్పొప్పుల సవరణ ఇలా.. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు బోర్డు సూచించిన వెబ్‌సైట్‌లోని వెళ్లి పదో తరగతి హాల్‌టికెట్ నంబర్‌తో ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ సరిచూసుకోవచ్చు. ఇక రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్‌తో హాల్‌టికెట్‌ను సరిచూసుకునేందుకు బోర్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఆన్లైన్లో వచ్చిన హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి, తల్లిపేరు, గ్రూప్, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, పీహెచ్ కేటగిరి, సబ్జెక్టులు కట్టిన పరీక్ష ఫీజు వంటి తçప్పులు ఏవైనా ఉంటే వెంటనే విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి. ప్రిన్సిపాల్ కళాశాల లాగిన్లోకి వెళ్లి తప్పుల వివరాలను ఉన్నతాధికారులకు వివేదిస్తారు. ఈనెల 15వరకు బోర్డు అధికారులు తప్పుల వివరాలను సేకరించి, తర్వాత వాటిని సరిచేస్తారు. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల హాల్‌టికెట్‌ల్లో తప్పులు ఉంటే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవకాశం ఉంది. దృష్టి సారించని విద్యార్థులు ఇదిలాఉండగా, ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు ముందే హాల్‌టికెట్లు, వాటిపై వివరాలను సరిచూసుకునేందుకు, తప్పొప్పులను సరిచేసేందుకు ఈ అవకాశం ఇవ్వగా.. విద్యార్థులు మాత్రం అంతగా ఆసక్తి చూపడంలేదు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోని యెడల పరీక్షల అనంతరం సర్టిఫికెట్‌పై సైతం అవే తప్పులు అచ్చయ్యే అవకాశం ఉంది. గతంలో ఇలా జరగగా.. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు తప్పుల సవరణ కోసం ఇంటర్ బోర్డు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. విద్యార్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సరిచూసుకోవాలి జిల్లాలోని వివిధ ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తప్పకుండా తమ హాల్‌టికెట్, వివరాలు సరిచూసుకుని తప్పులు ఏవైనా ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలి. వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ తర్వాత తప్పులు వస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. – వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి,మహబూబ్‌నగర్ -
‘ఇంటర్’లో ఈసారి తప్పులు దొర్లనివ్వం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించిన సాంకేతిక (ఆన్లైన్) పనుల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకకుండా పకడ్బందీ చర్య లు చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇటీవల బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పొరపాట్లు ఎక్కడ దొర్లాయో పరిశీలిస్తున్నామని, త్రీమెన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్నామన్నారు. వాట న్నింటిని పరిగణనలోకి తీసుకొని అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం బోర్డులోని ఐటీ నిఫుణులతో పాటు ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఐటీ నిఫుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ వరకే ఫీజుల చెల్లింపు.. ఫిబ్రవరి వరకు పరీక్ష ఫీజులు చెల్లించే విధానం వల్ల కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి డిసెంబర్ వరకే పరీక్ష ఫీజుల చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. బోర్డుకు సంబంధించిన అంశాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై సమీక్షించేందుకు, తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు ఈనెల 27న జిల్లా ఇంటర్ విద్యాధికారులతో (డీఐఈవో) సమావేశం నిర్వహించనున్న ట్లు తెలిపారు. జిల్లాల వారీగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను జిల్లాల్లోని డీఐఈవో కార్యాలయంలో ప్రదర్శిస్తామన్నారు. కమిటీ సిఫారసులు అమలు.. గత వార్షిక పరీక్షల్లో పరీక్షల మూల్యాంకనం, ఆ తర్వాత కంప్యూటరీకరణ, ఆన్లైన్ ప్రాసెస్ వంటి వాటిపై త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు ఇక జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులుగా ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. కాలేజీలు తిరిగి వచ్చే నెల 10న ప్రారం భం అవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కాలేజీలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇంటర్ బోర్డు నిర్వాకానికి అనామిక బలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల విడుదలలో తీవ్ర తప్పిదాలు జరిగాయని రీవెరిఫికేషన్ ఫలితాలు వెలువడిన అనంతరం స్పష్టమవుతోంది. ఫలితాల్లో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్ 18న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు బాగానే రాసినా.. ఫెయిల్ అయినామన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. మొదట విడుదలైన ఫలితాల్లో అనామిక అనే విద్యార్థిని ఫెయిల్ అయినట్లు రావడంతో క్షణీకావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా విడుదలైన రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఆమె పాస్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. మొదటి ఫలితాల్లో 20 మార్కులని చెప్పగా.. రీవెరిఫికేషన్లో 48 మార్కులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ తప్పిదం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోర్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం మక్దుంభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావు మాట్లాడుతూ.. విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి ఐపీసీ సెక్షన్ 304 (ఏ) ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను కోర్డు చెప్పక మందే అరెస్ట్ చేయాలని అన్నారు. -
జూన్ 3 లేదా 4న ఎంసెట్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాలు జూన్ 3 లేదా 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను బోర్డు ఈ నెల 27న వెల్లడించిన నేపథ్యంలో ఆ ఫలితాల డేటాను తీసుకొని ఎంసెట్ ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించింది. రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల డేటా, గతంలోనే పాసైనా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని కూడా తీసుకొని ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయాల్సి ఉంది. బోర్డు నుంచి డేటా వచ్చేందుకు ఒకట్రెండు రోజులు పట్టనున్న నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకులను జూన్ 3 లేదా 4న విడుదల చేయాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. బోర్డు డేటాను బుధవారం ఇస్తే ఈ నెల 31న ఫలితాలను వెల్లడించే అవకాశాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
రేపు ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, ఇతరత్రా కారణాలతో ఫెయిలైన 3.28 లక్షల విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు, జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను ఈ నెల 27న బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 27వ తేదీలోగా విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్ ప్రతులను వెబ్సైట్లో పొందుపరుచాల్సివుంది. అందుకనుగుణంగా చర్యలు చేపట్టిన ఇంటర్‌బోర్డు ఈ నెల 27న అదే విషయాన్ని కోర్టు తెలియజేయాలని నిర్ణయించింది. కోర్టు అంగీకరిస్తే వాటిని అదే రోజు విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. -
ఏపీ ఎంసెట్ ఫలితాల వెల్లడి వాయిదా
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్ ఫలితాల వెల్లడి తేదీని వాయిదా వేస్తున్నట్లు ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ఎస్. విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్ పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల విడుదల జాప్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీ వాల్యువేషన్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తుది ఫలితాలు మే 27న విడుదల కానున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. అయితే ఏపీ ఎంసెట్‌కు కూడా తెలంగాణ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. మే 18న వెల్లడి కావాల్సిన ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేశారు. -
ఇంటర్ ఫెయిలైన వారికి ‘ఆన్ డిమాండ్ పరీక్ష’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ‘ప్రత్యేక ఆన్ డిమాండ్ పరీక్ష’ను నిర్వహించనున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ బోర్డు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అదనంగా ఈ పరీక్షలను రాసే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన వారిలో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని, అందులో 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ దృష్ట్యా తాము మొదటిసారి తెలంగాణ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామని ఎన్ఐవోఎస్ ప్రాంతీయ కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందులో విద్యార్థులు తాము ఉత్తీర్ణులైన 2 సబ్జెక్టుల మార్కులను బదిలీ చేసుకొని (ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్), 3 సబ్జెక్టుల పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ పరీక్షల ఫలితాలను నెల రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు పరీక్షలు రాసిన 3 సబ్జెక్టులు పాస్ అయ్యాక మొత్తం 5 సబ్జెక్టుల మార్కులతో మార్కుల షీట్ ఇస్తామని వివరించింది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తమ www.nios.ac.in, https://sdmis.nios.ac.in వెబ్సైట్లలో సందర్శించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్‌లో విద్యార్థులు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటే హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయం 040–24752859, 24750712 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వివరించింది. -
ఇంటర్ బోర్డు వివాదం.. ఈ నెల 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు. దాంతో ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గ్లోబరీనాను ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్
-
ఇంటర్ విద్య విలీనంతో ఇక్కట్లే అధికం
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల ప్రకటనలో జరిగిన లోపాలను సాకుగా తీసుకుని, ఇంటర్ బోర్డునే రద్దుపర్చి, పాఠశాల విద్యలో విలీనం చేయాలని చర్చలు జరగడం విచారకరం. యాభై ఏళ్ల క్రితం నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు అంకురార్పణ చేసిన ఇంటర్మీడియట్.. పాఠశాల, కళాశాల విద్యకు వారధిగా ఉంటూ విద్యార్థి జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలకు రహదారిలా మారింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో ఎన్ని మార్పులు వచ్చినా రాష్ట్ర విద్యార్థుల జయకేతనాన్ని ఆపలేకపోయాయి అంటే దానికి ఇంటర్ విద్యామండలి పాఠ్యప్రణాళికలే కారణం. ఇంటర్ విద్యను మరింత బలోపేతం చేయాలి. ఇంటర్ విద్యను రద్దు చేస్తే విద్యా వ్యవస్థను 50 యేళ్లు వెనక్కి నెట్టినట్లే అవుతుంది. 30 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా సంస్థలని, ప్రభుత్వం భుజానికి ఎత్తుకోవాలి. మార్చి 2019 ఇంటర్ ఫలితాల ప్రకటన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్ బోర్డు ప్రతిష్ట దిగజారడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమస్య పరిష్కారం ఒక జటిల సమస్యగా మారింది. ఇది 50 ఏళ్ళ ఇంటర్ విద్యా మండలి ప్రయాణంలో జరిగిన అతి భారీ ప్రమాదం. అయితే ఇది ప్రమాదమే గాని సంక్షోభం కాదు. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంటర్ విద్యావ్యవస్థను రద్దు పరచి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే చర్చలు మొదలయ్యాయి. కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యామంత్రి పి.వి.నర్సింహారావు, ఇంటర్ విద్యకు 1969–70 విద్యా సంవత్సరంలో అంకురార్పణ చేశారు. పాఠశాల, కళాశాల విద్యకు వారధిగా ఉంటూ విద్యార్ధి జీవితంలో భవిష్యత్తు ప్రణాళికలకు ఇది ఒక రహదారి (గేట్‌వే) అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంట ర్మీడియట్ విద్యాచట్టం 1971 ద్వారా ఏర్పడిన ఇంటర్ విద్యామండలి ఒక స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించడం, ఎప్పటికప్పుడు పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం సాగిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో ఎన్ని మార్పులు వచ్చినా రాష్ట్ర విద్యార్థుల జయకేతనాన్ని ఆపలేకపోయాయి అంటే దానికి ఇంటర్ విద్యామండలి పాఠ్యప్రణాళికలే కారణం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంటర్ విద్యావ్యవస్థ ప్రారంభంలో ప్రభుత్వ రంగంలో దినదినాభివృద్ధి చెందింది. అదే సమయంలో గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్జేసీ)తోపాటు ప్రతిష్టాత్మక ఎయిడెడ్ విద్యాసంస్ధలను ప్రారంభించడంతో అనేక మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడ్డారు. 1983 వరకు ఇంటర్ విద్య ప్రభుత్వ అధీనంలోనే కొనసాగింది. 1983లో ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల ప్రవేశాలు, క్యాపిటేషన్ ఫీజు రద్దు చట్టం (యాక్టు 5/1983) ద్వారా నాటి సీఎం ఎన్.టి.రామారావు, ఎంసెట్ ప్రవేశ పరీక్షలకు తెరలేపారు. దీనితో గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మొదలైన ప్రాంతాల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి రూపాంతరం చెందుతూ జూనియర్ కళాశాలలుగా, రెసిడెన్షియల్ కళాశాలలుగా, కార్పొరేట్ కళాశాలలుగా మారాయి. ఇప్పుడు శ్రీచైతన్య, నారాయణ అనే అనకొండలు రెండు తెలుగు రాష్ట్రాల ఇంటర్ విద్యను శాసిస్తున్నాయి. ఈ క్రమంలో కలిసి వచ్చిన ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ పరీక్షలు ఈ రెండు విద్యా సంస్థలు అడ్డంగా బలవడానికి ఉన్న బలమైన కారణాలు. 1969లో ప్రారంభమైన ఇంటర్ విద్యకు పట్టని ఈ కార్పొరేట్ చీడ 1983లో ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష, ఆ తరువాత మొదలైన జాతీయ, జాతీయ సంస్ధల ప్రవేశ పరీక్షలతో ఉనికిలోకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా ఏపీఆర్జేసీలను, పేరు పొందిన ఎయిడెడ్ విద్యా సంస్థలతో సహా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల పల్లకీలను మోసింది ప్రభుత్వ విధానాలే అని మరువరాదు. రాష్ట్రంలో ఇంటర్ విద్య ఉన్నత ప్రమాణాలతో కొనసాగడం వల్లే జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఏవైనా (ఐఐటీ, నీట్, జిప్మెర్, ఎయిమ్స్, బిట్స్) రాష్ట్ర విద్యార్థుల విజయ దుందుభి కొనసాగుతుంది. దేశంలోని ఏ ఐఐటీలలో చూసినా సగంమంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారంటే అతిశయోక్తి కాదు, ఈ ఐఐటీలు, నీట్లో రాశి, వాసితో పాటు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల వాటాను కూడా ప్రత్యేకంగా చర్చించాలి. అనేక శతాబ్దాలుగా చదువుకు దూరమైన బడుగు, బలహీన వర్గాలు ఇప్పుడు ఐఐటీలలో ప్రవేశిస్తున్నారంటే దానికి ఇంటర్ విద్యే కారణం. దేశవ్యాప్తంగా లేని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు అమలు చేస్తున్నారు అని ప్రశ్న. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, బిహార్, హరియాణా వంటి రాష్ట్రాలలో మినహాయిస్తే దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యలోనే +2 విద్య కొనసాగుతున్న మాట వాస్తవం. మన రాష్ట్రంలోనూ +2 విద్యనందిస్తున్న విద్యాసంస్థలు అనేకం. అయితే భారతీయ విద్యాభవన్, హెచ్‌పీఎస్, డీపీఎస్, నవోదయ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పాటు ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు నుంచి 10వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం 70 వేలకు పైగా విద్యార్థులు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇంటర్ విద్యలో చేరుతున్నారంటే ఇంటర్ విద్య ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు. 1969లో తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ రాష్ట్రంలో కూడా ప్రత్యేక ఇంటర్ విద్యకు అంకురార్పణ జరిగింది. కానీ అధ్యాపకుల కోరిక మేరకు అక్కడ +2 విద్యావ్యవస్థను రద్దు పరచారు. అది కేరళ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2017–18 ఐఐటీ ఫలితాలలో కేరళ రాష్ట్రం సాధించిన సీట్ల సంఖ్య అక్షరాలా 181, కాని తెలంగాణ రాష్ట్రం సాధించినది 833 సీట్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించినవి 882 సీట్లు. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా తెలుగు రాష్ట్రాల రికార్డును బద్దలు కొట్టలేకపోయింది. పాఠశాలల్లోనే ఇంటర్ విద్య కొనసాగాలన్న చర్చకు తెరలేపిన విద్యావేత్తలకు ఒక సంఘటనను గుర్తు చేస్తున్నాను. సుప్రీం కోర్టు ఆదేశాలతో భారత ప్రభుత్వం 2017 నుండి వైద్యవిద్య ప్రవేశాలకు జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్)ను తప్పనిసరి చేసింది. నీట్‌ను వ్యతిరేకించిన రాష్ట్రాలలో తమిళనాడే మొదటిది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఒక దళిత విద్యార్థిని ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షణ్ముగం అనిత అనే ఈ దళిత విద్యార్థిని రోజువారీ కూలి చేసుకునే కుటుంబానికి చెందినది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సరైన సంరక్షణ లేకున్నా 2017లో, 12వ తరగతి మార్చి పరీక్షలలో 1200కు గాను 1176 మార్కులు సాధించింది. ఈ విద్యార్థిని ప్రతిభను గుర్తించి, మద్రాసు సాంకేతిక సంస్థ (ఎమ్ఐటీ) ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటును కేటాయించింది. కానీ తన తల్లి మరణంతో డాక్టర్ కావాలనే ఆకాంక్షను తన జీవితాశయంగా పెట్టుకుంది. 2017 నీట్ పరీ క్షలో ఎలాంటి శిక్షణ లేకపోవడంతో అనిత 720 మార్కులకు గాను 86 మార్కులు సాధించి కనీస అర్హత (288) కూడా పొందలేక పోయింది. దీనితో ఆవేదనతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతిభాపాటవాలు ఉన్నా నీట్ శిక్షణ లేకపోవడం తనకు శాపంగా మారింది. తమిళనాడులో ప్రస్తుతం 6362 ప్రభుత్వ అధీనంలో నడిచే +2 విద్యాసంస్థలు ఉంటే కేవలం 179 మాత్రమే ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ కోరల్లో తమిళనాడు విద్యావ్యవస్థ చిక్కుకోకపోవడానికి ప్రధాన కారణం అక్కడ ప్రవేశ పరీక్షలు లేకపోవడం. అంతే కానీ +2 విద్య కారణం కాదు. నీట్ పరీక్ష ప్రారంభమైన తర్వాత తమిళనాడు అనేక జాతీయస్థాయి కోచింగ్ సెంటర్లకు కేంద్రంగా మారింది ఎప్ఐటీజేఈఈ, కెరీర్ పాయింట్, ఎలెన్, రిసోనెన్స్ లాంటి సంస్థలు కొలువుతీరాయి. ఇది సరిగ్గా 1983 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, ఒంగోలు, నెల్లూరు లాంటి ప్రాంతాలలో ఏర్పడిన కోచింగ్ సెంటర్ల ప్రారంభరూపం. త్వరలోనే జాతీయ విద్యాసంస్థలతోపాటు మన కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా తమిళనాడు తీరాన్ని తాకనున్నాయి. దీంతో తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యా వ్యవస్థ ధ్వంసం ఖాయం. ఇంటర్ విద్య ఆవిష్కరణ తర్వాత ఇంటర్ విద్యామండలి చట్టంతో పాటు 1982 విద్యాచట్టం, 1998 రాష్ట్ర ఉన్నత విద్యామండలి చట్టం, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ విద్య, ఉన్నత విద్యలో ఒక ప్రత్యేక విభాగం. కాని 1994లో, 2009లో వేర్వేరు జీవోల ద్వారా ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో భాగం చేయడానికి ప్రయత్నించినా విద్యావేత్తలు, శాసనమండలి సభ్యులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాలను విరమించుకున్నది. కానీ ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న పాఠశాల విద్యలో ప్రస్తుతం ఇంటర్ విద్యను చేర్చి మరో సర్వీసు వివాదానికి తెరలేపడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరివితో తలగోక్కున్నట్లే. కొంతమంది విద్యావేత్తలు సూచించినట్లుగా తెలంగాణలో ఇంటర్ విద్యను రద్దు పరిచి, పాఠశాల విద్యలో విలీనం చేస్తే ప్రతి ఏటా లక్ష మంది విద్యార్థులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లడం ఖాయం. గతంలో రాష్ట్ర విభజన కంటే ముందు నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం, సింగరేణి ప్రాంతాల నుండి వేల సంఖ్యలో విద్యార్థులు విజయవాడ కేంద్రంగా విద్యనభ్యసించడం మరిచిపోరాదు. అందుకే ఇంటర్ విద్యను తెలంగాణ ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలి. ఇంటర్ విద్యను రద్దు చేస్తే విద్యా వ్యవస్థను 50 ఏళ్లు వెనక్కి నెట్టినట్లే అవుతుంది. ఇలాంటి హానికరమైన ఆలోచనల్ని మానుకుని 30 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ విద్యా సంస్థలను, ప్రభుత్వం భుజానికి ఎత్తుకోవాలి. ప్రతి జిల్లాలో కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని స్థాపించి, సామర్థ్యం, అభిరుచి, ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర, జాతీ యస్థాయి పోటీ పరీక్షలను సిద్ధం చేయాలి. అదే సమయంలో కార్పొరేట్ విద్యాసంస్థల కఠినమైన నియంత్రణ నిబంధనలను అమలు చేయాలి. తద్వారా ఇంటర్ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలి. అన్ని కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలి. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలనే సూచనను తిరస్కరించాలి. ఆ విధంగా ఇంటర్ విద్య ఔన్నత్యాన్ని కాపాడాలి. పి. మధుసూదన్‌రెడ్డి వ్యాసకర్త అధ్యక్షులు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం తెలంగాణ రాష్ట్రం ‘ మొబైల్ : 98495 39252 -
కేసీఆర్‌కు కోమటిరెడ్డి చురకలు..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇరవై అయిదు మంది విద్యార్థులు చనిపోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతోందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి .. ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు కోమటిరెడ్డి శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో తెలంగాణ పూర్తిగా భ్రష్టు పట్టిందని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను పరామర్శించడానికి సైతం ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి రాష్ట్ర పాలన మీద లేదన్నారు. గ్లోబరీనా సంస్థపై మర్డర్ కేస్ పెట్టాలని, అవినీతి అధికారి అశోక్‌ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసమర్థుడు విద్యాశాఖ మంత్రి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మాట్లాడుతూ, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో విద్యార్థులు బలౌతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత టి.పురుషోత్తంరావు, మధుయాష్కీ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లచే దీక్ష విరమింపజేశారు. -
ఎక్కువ పేపర్లు దిద్దాలంటూ ఒత్తిడి..అందుకే ఫెయిల్..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక తప్పులే కాకుండా ఎక్కువపేపర్లు దిద్దాలన్న ఒత్తిడితో చేసిన వ్యాల్యుయేషన్లోనూ పొరపాట్లు దొర్లాయి. దీంతో చాలామంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న రీవెరిఫికేషన్లో ఈ లోపాలు బయటపడుతున్నా యి. ఈ నేపథ్యంలో వాటిని సవరించేపనిలో ఇంటర్ బోర్డు పడింది. జవాబుపత్రాల మూల్యాంకన సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వ్యాల్యుయేషన్ చేసే లెక్చరర్లకు పరిమితికి మించి జవాబుపత్రాలను పంపిం చారు. దీంతో అక్కడి అధికారులు వ్యాల్యుయే షన్ చేయలేమంటూ చేతులెత్తేశారు. మిగిలిన వాటిని తిరిగి హైదరాబాద్‌కు తెప్పించి వ్యాల్యు యేషన్ చేయించారు. ఈ క్రమంలో ఒక్కో లెక్చరర్ చేత రోజూ దిద్దాల్సిన పేపర్ల సంఖ్య కంటే ఎక్కువ పేపర్లను దిద్దించారు. దీంతో పలువురు విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు రీవెరిఫికేషన్లో బయటపడింది. దీంతో వాటిని సవరించి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 3 శాతం మంది పాస్ అయ్యే చాన్స్... ఇంటర్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో ఫెయిల్ అయిన, సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన దాదాపు 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పలువురు విద్యార్థులు పాస్ అవుతున్నారు. మొత్తంగా ఫెయిల్ విద్యార్థుల్లో 3 శాతం మంది వరకు రీ వెరిఫికేషన్‌లో పాస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు మొదట్లో తక్కువ మార్కులు రాగా, మరికొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో 10,576 వేల మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారి జవాబు పత్రాలతోపాటు సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన 3.28 లక్షల మందికి చెందిన 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక విద్యార్థికి రీ వెరిఫికేషన్‌కు ముందు సంస్కృతంలో కేవలం 5 మార్కులే రాగా రీ వెరిఫికేషన్ తర్వాత 50 మార్కులు వచ్చినట్లు తెలిసింది. అలాగే మరో విద్యార్థి సివిక్స్‌లో 18 మార్కులతో ఫెయిల్ అవగా రీ వెరిఫికేషన్‌లో అతనికి 39 మార్కులు వచ్చి పాస్ అయినట్లు సమాచారం. ఇంకో విద్యార్థికి కూడా మ్యాథ్స్‌లో మొదట 18 మార్కులే రాగా రీ వెరిఫికేషన్‌లో 29 మార్కులు వచ్చి పాస్ అయినట్లు తెలిసింది. -
నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్..!
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు. (చదవండి : అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్ రావు) కేంద్రమంత్రి హన్సరాజ్ మాట్లాడుతూ.. 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమింపజేశాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం. విద్యార్థుల కుంటుంబాలకు మా సానుభూతి ఉంటుంది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విద్యార్థులకు నా విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా. ఉద్యమం ఉధృతం.. 9 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఒక జాతీయ పార్టీగా బాధితుల పక్షాన నిలబడ్డాం. వారి నిరసనలకు మద్దతు తెలుసుతున్నాం. లక్ష్మణ్‌తో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. ఆయన దీక్షను హన్సరాజ్‌తో విరమింపజేయాలని వర్తమానం పంపారు. విద్యార్థుల పోరాటాలపై భరోసానివ్వడంతో లక్ష్మణ్ దీక్ష విరమించారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదు. ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తాం. 119 అసెంబ్లీ కేంద్రాల్లో దీక్షలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఢిల్లీకి వెళ్లి, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలుస్తాం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు -
‘టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ), యువజన కాం గ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు. విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్ ఇంటర్‌బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్ మాదిగ సంఘీభావం తెలిపారు. దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. -
పర్యవేక్షణ లోపమే ‘ఇంటర్’ వైఫల్యం
పరీక్షా ఫలితాల వెల్లడి కోసం ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత, దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్ బోర్డుపై ఉన్నాయి. ఈ బాధ్యతలను తెలంగాణ ఇంటర్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది నిజం. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు.. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. అలాంటి పర్యవేక్షణ, నిర్ధారణ లోపమే పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యానికి కారణం. భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయమవుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరొక విభాగానికి మారే అవకాశం లేని మన విద్యా విధానంలో ఇంటర్మీడియట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్లయ్యేది, ఇంజనీర్లయ్యేది, ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలతోపాటు తామూ శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష. ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ, జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారంగా రాజీనామాలు చేయడానికి సమాయత్తపడటం సీఎంలు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ నేడు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు. ఇలాగే 1997లో ఒకసారి ఇంటర్ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్ బోర్డు తీవ్రమైన తప్పులు చేసింది. నాటి సీఎం ఇంటర్ బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని భావించినా, నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు. అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్మాల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు నేడు మళ్లీ తన పరిమితులను చాటుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. తమ ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ.. మరొకరి అసమర్థతకూ, నిర్లక్ష్యానికీ పిల్లలు బలైపోయారు. తెలం గాణలో ఇటీవలి ఎన్నికలలో పూర్తిగా నైతిక స్థైర్యం దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధంగా పనికి వచ్చింది. ప్రభుత్వం పక్షం నుంచి వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న విధి విధానాలే నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ విద్యాపరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగానీ అధ్యక్షులుగా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో లాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్ బోర్డుకు రీజనల్ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలను రాష్ట్రమంతటికీ కేంద్రీకృత విధానంలో ఇంటర్ బోర్డు ద్వారా వెల్లడిస్తున్నారు. గతంలో సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి ఫలితాలను క్రోడీకరించి ఎలక్ట్రానిక్ విధానంలో వెల్లడించసాగారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఏపీలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్ బోర్డుకు అందజేయడం జరిగేది. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించే జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సీసీఎల్‌గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్ షీట్ పరీక్ష ద్వారా విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచినప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జేఎన్టీయూ నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. అటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయ సహకారాలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయంగా జేఎన్టీయూ వారి సేవలను వినియోగించుకోకుండా, అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని తెలం గాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంలో తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్నప్పటికీ, వాటిని బోర్డు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితికి దారితీసింది. నేడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన గ్లోబరీనా సంస్థపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఇంటర్మీడియట్ బోర్డును అధికారులను తప్పుపట్టారు. ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశి తంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుపై ఉంది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహిం చారు. అక్కడ నేడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించగలిగారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలోను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలోనూ, దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్నా, విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నా, ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో, ఫలితాలు వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తే బాగుంటుంది. కొసమెరుపు: మొదట్లోనే చెప్పినట్లు, లోపాలకు నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రహసనప్రాయంగా మారిపోవడానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా చేరక ముందు జరిగిన సంఘటన. 1986లో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమాతో లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ‘ఆమోదించండి’ అని తన ఆమోదముద్రను తెలియజేశారు. సీఎం ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీ నామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించినప్పటికీ.. అంతర్గతంగా ఖిన్నుడైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యులతో మీరు ఆ రోజు సరైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయిఉండేది కాదని వాపోయారట. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఇంటర్ రద్దే ‘కార్పొరేట్’ జబ్బుకు మందు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల చీడను మూలం వరకు పెకిలించాలంటే ప్రభుత్వాలు తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. రాజకీయ పార్టీలన్నింటిపై ప్రభావం చూపగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల లాబీలు నెలకొల్పుకున్నాయి. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్నీ, ఇంటర్ విద్యను రద్దు చేయడాన్నీ సుతరామూ అనుమతించవు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కఠిన వైఖరి అవలంబించి హైస్కూల్స్‌లోనే విద్యార్థులు 12వ తరగతిని పూర్తిచేసుకునేలా చేయగలిగితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు్డ భారీ సంక్షోభాన్ని సృష్టించింది. దీని బారినపడి ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పలువురు విద్యార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. ఈ పెనుసమస్యకు పరిష్కారం.. పరీక్షాపత్రాల్లోని మార్కులను తిరిగి లెక్కించడంతో కానీ, పరీక్షా పత్రాల పునర్మూల్యాంకనం చేయడంతో కానీ లభించదు. ప్రస్తుత సమస్య మరింత విస్తృతస్థాయిలో ఉంది. విద్యాపాలనా వ్యవస్థలపై అజమాయిషీ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ నెట్‌వర్క్‌లో ఈ సమస్యకు మూలం దాగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన గుత్తాధికార స్వభావం కలిగిన రెండు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అత్యంత కీలకమైన మన విద్యావ్యవస్థను ధ్వంసం చేసిపడేశాయి. పైగా అవి ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ పేరిట పాఠశాల విద్యా వ్యవస్థలోకి జొరబడ్డాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రధానంగా నాలుగు అంశాలను చేపట్టాయి. 1) ఇవి రెండు రాష్ట్రాల్లో జూనియర్ కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లను నెలకొల్పాయి. 2) భారీ పెట్టుబడులతో ప్రకటనలు గుప్పించడం ద్వారా ఇవి రెండు రాష్ట్రాల కుటుంబ వ్యవస్థను (గిరిజన ప్రాంతాల వరకు కూడా) ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చక్కటి విద్య లభ్యమవుతుందని నమ్మేలా చేశాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి లక్షలాదిమంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కొన్ని డజన్లమంది విద్యార్థులకు పెయిడ్ ర్యాంకులను ప్రకటించడమే కాకుండా పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే మీడియా నెట్‌వర్క్‌లలో భారీ స్థాయి ప్రకటనలు గుప్పిస్తూ తల్లిదండ్రులు, పిల్లల మనస్సులపై భారీ యుద్ధానికి తలపెడుతున్నాయి. 3) దీనివల్ల రెసిడెన్షియల్, డే స్కాలర్ ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సెంటర్లలో భారీ ఎత్తున విద్యార్థులు చేరిపోతున్నారు. పైగా కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృత స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. అధ్యయనానికి బదులుగా నిద్రపోనీయకుండా వల్లెవేయించడం, తరుణ వయస్సులో ఎలాంటి వినోదాల్లో పాలుపంచుకోనీయకుండా చేస్తూ ఈ విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక స్థితిని ధ్వంసం చేస్తున్నాయి. సృజనాత్మకతలేని ఈ హింసాత్మక విద్యావంచన కోసం ఇవి కుటుంబాల ఆర్థిక వ్యవస్థనే కూల్చివేస్తున్నాయి. 4) ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు భారీస్థాయిలో రాష్ట్రాల ప్రభుత్వాలపై అజమాయిషీ చలాయించడానికి వచ్చాయి. నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ట సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పుడీయన రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్ద ఇంటర్మీడియట్ విద్యా కుంభకోణాల కర్తల్లో అగ్రగణ్యుడిగా ఉంటున్నారు. నారాయణ కొల్లగొట్టిన ధనసంపదను చూసి చంద్రబాబు ఆయనకు మంత్రిపదవినిచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ఉండే ప్రముఖ విద్యాసంస్థల అధిపతిని కూడా చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీని చేశారు. ఇప్పుడీయన కేసీఆర్ పార్టీలో చేరిపోవడమే కాకుండా మంత్రిపదవి కూడా కొట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీకాలేజీ యాజమాన్యాలు వాస్తవానికి అక్రమంగా ఆర్జించిన సంపదతో రాష్ట్రాలను నడుపుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం, ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఎడ్యుకేషన్ నుంచి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వరకు అన్నీ అనైతికమైన, అవినీతికరమైన, నాసిరకం విద్యా కుంభకోణాలకు పాల్పడుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ద్వారానే అతిపెద్ద నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ చీడ మూలాన్ని పెకిలించాలంటే తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేసి పడేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. పదవ తరగతిలో కఠినమైన ఇంటర్నల్ పరీక్షను నిర్వహిస్తూ 12వ తరగతిలో మాత్రమే టెర్మినల్ బోర్డు పరీక్షను నిర్వహించాలి. ఈ నూతన వ్యవస్థలో 12వ తరగతి వరకు తెలుగు భాషా సబ్జెక్టును కలిగి ఉంటూనే చక్కటి ఇంగ్లిష్ మీడియంని బలోపేతం చేసినట్లయితే గ్రామీణ స్థాయి పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనివల్ల ప్లస్ 2 లెవల్ విద్యపై తల్లితండ్రులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో అంశం ఏదంటే, తమ పిల్లలను గ్రామాల నుంచి సుదూరంలో ఉండే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలకు పంపించడాన్ని పరిత్యజించాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని రెండో సబ్జెక్టుగా అనుమతించడం అనేది మార్కుల నిర్వహణా యంత్రాంగంగా మారిపోయింది. ఈ విధానంలో ఏ విద్యార్థి కూడా నిజమైన సంస్కృతాన్ని నేర్చుకోవడం లేదు. అందుకే సంస్కృతాన్ని తొలగించి తెలుగును తప్పనిసరి సబ్జెక్టును చేయాలి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల సంక్షోభం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న 10+2 విద్యా విధానాన్ని ఎస్బీఎస్ఈ నమూనాలో ఉండే 1 నుంచి 12వ స్కూల్ లెవల్ లోకి మార్చాలని తలుస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా అందరూ ఆహ్వానించదగిన అంశం. కానీ ఈ మార్పును కూడా ఇంటర్మీడియట్, ప్రైవేట్ స్కూల్ లాబీలు ప్రతిఘటించే ప్రమాదం ఉంది. అందుకే ప్రైవేట్ విద్యా లాబీల ఒత్తిడికి తలొగ్గకుండా దీనిని చేపట్టాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. అయితే రాజకీయ పార్టీలన్నింటిపైనా అజమాయిషీ చేయగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సంస్థల లాబీలు నెలకొల్పుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఆశ లేశమాత్రంగా లేని కమ్యూనిస్టుపార్టీలతో సహా ఏ రాజకీయపార్టీనీ ప్రైవేట్ విద్యా సంస్థల లాబీలు వదిలిపెట్టడం లేదు. అన్నిరకాల రాజకీయ భావజాలాలకు చెందిన జూనియర్, స్కూల్ టీచర్ నాయకులు సైతం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, భారీస్థాయిలో డబ్బు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లను నెలకొల్పడంలో మునిగి తేలుతున్నారు. ఇక నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో, కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెబుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ టీచర్లు, ఇతర టీచర్లు కూడా తమ డబ్బును, తమ ఆర్థిక, సంస్థాగత శక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేవారు కూడా తప్పకుండా జరగాల్సిన ఈ మార్పునుంచి తప్పించుకోలేరని వీరికి తెలుసు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎన్నికల వ్యవస్థలోకి చొప్పిస్తున్న భారీ మొత్తంలోని డబ్బును అది తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తున్నాయి. ఇదంతా అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లూటీ చేసిన డబ్బే. అందుకే రాజకీయ పార్టీలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని బద్దలు చేయాల్సి ఉంది. అయితే విద్యా విధానంలో మార్పును ఇవి అంత సులభంగా అనుమతించవు. విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు తప్ప కుండా వీరిపై ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణలో దీనికి సంబంధించిన ఉద్యమం ప్రారంభమైతే అది ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేగం పుంజు కుంటుంది. అధికారంతో ముడిపడి ఉన్న ఈ పవర్ బ్రోకర్లు ఇంతకుముందు కేసీఆర్‌నే లొంగదీసుకున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ ప్రవేశపెడతామని కేసీఆర్ గతంలో పదే పదే మాట్లాడారు. ఆ తర్వాత అందరికీ ఉచిత విద్యను అందించే ఈ కేజీ టు పీజీ గురించి మాట్లాడటమే ఆయన మానేశారు. ఈ ప్రైవేట్ శక్తులే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. పాఠశాల, జూని యర్ కళాశాల టీచర్ల నాయకులు పలువురు ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయడాన్ని, దాన్ని ప్రభుత్వ స్కూల్ వ్యవస్థలో విలీనం చేయడాన్ని జూనియర్ లెక్చరర్ సంఘాలు వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే హైస్కూల్లో పాఠాలు చెప్పడం తమ పని కాదని ఇవి వాదించవచ్చు. జూనియర్ కాలేజీల్లాగా కాకుండా పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించాయి. లోతట్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాఠాలు బోధించకపోవచ్చని ఈ సంఘాలు వాదించవచ్చు. ఇలాంటి వాదనలు చేసేవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. జూనియర్ కాలేజీ గ్రేడ్ టీచర్లు ఆన్ రోల్స్‌లో ఉన్నంతవరకు పాఠశాలల్లోని 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. కానీ వీరిని ఎక్కడైనా నియమించవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తాము తెలుగు మీడియంలో బోధించడానికే నియమితులమయ్యామని పాఠశాల ఉపాధ్యాయులు వాదించారు. కానీ ఇలాంటి బోధనా వ్యతిరేక శక్తులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరగా... ఇంటర్మీడియట్ రద్దు అనేది మన విద్యావ్యవస్థలో కొత్త మలుపును తీసుకొస్తుంది. భారతదేశంలోని పాఠశాల విద్యావ్యవస్థ మొత్తాన్ని ఈ చట్రం కిందికి తీసుకురావాలి. ఇంతవరకు సీబీఎస్ఈ మోడల్ ఉత్తమమైనదిగా ఉంటోంది. ప్రతి గ్రామీణ విద్యార్థి గ్రామీణ పాఠశాలలోనే 12వ తరగతిని పూర్తి చేసుకున్నట్లయితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త, రచయిత ‘ ఈ–మెయిల్ : kanchailaiah1952@gmail.com -
ఇంటర్ బోర్డు ముట్టడి
-
ఇంటర్ బోర్డు ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యులైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ సోమవారం అఖిలపక్షం చేపట్టిన ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఫలితాల్లో తప్పులు చోటుచేసుకొని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా.. ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ విపక్షాలన్నీ సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ ముట్టడికి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఉదయం 10గంటల కల్లా అన్ని పార్టీల నాయకులు అక్కడకు చేరుకుని ఆందోళనలో పాల్గొనేందుకు సిద్దమవుతుండగా.. పోలీసులు శాఖ ముందుస్తు చర్యల్లో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. వందల సంఖ్యల్లో పోలీసులను మోహరించి ఆందోళనకారులను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, ముందస్తు అరెస్టులతో ముఖ్య నాయకులెవరూ ఇంటర్ బోర్డువద్దకు రానప్పటికీ, విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మూకుమ్మడి అరెస్టులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడి కావడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా విడతల వారీగా విద్యార్థి సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకోవంతో ఆందోళనకారుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముట్టడికి వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. తద్వారా ఆందోళన తీవ్రం కాకుండా సద్దుమణుగుతుందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల వ్యూహాలను వమ్ముచేస్తూ.. విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా ఇంటర్‌బోర్డు వైపు దూసుకొచ్చాయి. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు దూసుకురావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనకారులు బారీకేడ్లు దాటుకుని ఇంటర్‌బోర్డు కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు. బాధ్యులపై చర్యలేవి? ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులెవరో తేలినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని అఖిలపక్ష పార్టీలు తప్పుబట్టాయి. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా కోరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థిసంఘాలు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినాదాలు చేయడంతో ఇంటర్‌బోర్డు కార్యాలయం దద్దరిల్లింది. ఇంటర్‌బోర్డు అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని మాజీమంత్రి జే.గీతారెడ్డి డిమాండ్ చేశారు. అవకతవకలపై ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. గాంధీభవన్ నుంచి బోర్డు వద్దకు చేరుకుంటున్న ఆమెను పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని, ఇంతమంది మృతి చెందినా కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. గ్లోబరీనాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సిట్టింగ్ జడ్జితో ఈ వివాదం మొత్తాన్ని న్యాయవిచారణ చేయాలన్నారు. అరెస్టులతో నిజాన్ని కప్పిపుచ్చలేరన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జనసేన రాష్ట్ర నాయకులు శంకర్‌గౌడ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి రాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్‌కుమార్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, ఏఐడీఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌ల తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ వద్ద ఏబీవీపీ అలజడి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై చర్యలకు డిమాండ్ చేస్తూ.. సోమవారం ప్రగతిభవన్ వద్ద ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ప్రగతిభవన్‌వైపు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా.. విద్యార్థులు బారీకేడు దాటేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతిభవన్ గేటు వద్దే విద్యార్థినాయకులు బైఠాయించారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని ప్రభుత్వమే వెనకేసుకోస్తోందని, వారిపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కొందరు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తమ ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోమని ఏబీవీపీ నాయకులన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వారిని సముదాయించేందుకు యత్నించినా వెనక్కుతగ్గలేదు. దాదాపు గంటన్నరపాటు ఉద్రిక్తత అనంతరం వారిని బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించారు. సోమవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలువురు పోలీసులు, ఏబీవీపీ నాయకులకు వడదెబ్బ తగిలింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా అందించారు. ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు అఖిలపక్షం నిర్వహించ తలపెట్టిన ‘చలో ఇంటర్‌బోర్డు’కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న అన్ని విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీపీఐ, టీడీపీకి చెందిన పలువురు నేతలను సాయంత్రం వరకు గృహ నిర్బంధం చేసిన పోలీసులు మరికొందరిని అదుపులోనికి తీసుకుని స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లోకి వెళ్లి మరీ అదుపులోనికి తీసుకుని ఆయన్ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లను పాతబస్తీలోని వారి నివాసం వద్దే అదుపులోనికి తీసుకుని కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలను వారి ఇళ్లలోనే అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయగానే (పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా) ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. టీపీసీసీ నేత మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌లను కూడా గృహ నిర్బంధం చేసి అదుపులోనికి తీసుకున్నారు. కొంతమంది మహిళా నేతలతో కలిసి ఇంటర్‌బోర్డు ముట్టడికి వచ్చిన మాజీ మంత్రి గీతారెడ్డిని అడ్డుకుని సైఫాబాద్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గాంధీభవన్ నుంచి ఇంటర్‌బోర్డుకు ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్తోపాటుగా పలువురు పార్టీ నేతలను ఇంటర్‌బోర్డు సమీపంలో అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. -
లక్ష్మణ్ అరెస్ట్.. నిమ్స్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ని అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ముట్టడితో సహా రేపటి అన్ని కార్యక్రమాలు యధాతథంగా కొనసాగుతాయని మురళీధర్ రావు స్పష్టం చేశారు. -
ప్రజల గొంతు నొక్కేస్తున్నారు..
భద్రాచలంటౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ప్రజాగొంతుకను నొక్కేస్తోందని కాంగ్రెస్ శాససనభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో ఆయన పర్యటించారు. అంతకుముందు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో, ఆ తర్వాత ఆయా మండలాల్లో జరిగిన సభల్లో భట్టి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అపహాస్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం రీ డిజైన్ చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఈ దోపిడీపై అసెంబ్లీలో నిలదీస్తున్నందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. వేలాది మంది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎమ్మెల్యేలు చెపుతున్నా.. అది నిజం కాదని, వారి సొంత ప్రయోజనాల కోసమే ఆ పని చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు కళ్ల లాంటివని చెప్పారు. కేసీఆర్‌కు పాలన మీద దృష్టి లేదని, ఫాంహౌస్‌లో కూర్చుని అధికారం చెలాయిస్తున్నాడని విమర్శించారు. ఇంటర్ బోర్డు లో అవకతవకలతో ఫెయిలైన విద్యార్థుల్లో 23 మంది ఆత్మహత్య చేసుకున్నా ఫాంహౌస్ నుంచి బయటకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోయి వారి తల్లిదండ్రులు ఏడుస్తుంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకే ప్రజా పరిరక్షణ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలన్నారు. బూర్గంపాడు జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి బాదం సావిత్రిని గెలిపించాలని కోరారు. అంతకు ముందు బూర్గంపాడు ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్, కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి రంగారావు, డీసీసీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, బూర్గంపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బాదం సావిత్రి, సర్పంచ్‌లు సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, మందా నాగరాజు, భజన సతీష్, తాళ్లూరి జగదీశ్వరరావు, పోటు రంగారావు, లక్కోజు విష్ణువర్ధన్, దుద్దుకూరి ఠాగూర్, బాదం నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. రాక్షస పాలనను అంతం చేయాలి కొత్తగూడెంరూరల్: ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని, దీన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అవినితీకి పాల్పడుతూ రాజ్యంగాన్ని లెక్కచేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కారని అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఏనుగుల అర్జున్‌రావు, మోతుకూరి ధర్మారావు, రాందాస్, నాగ సీతారాములు, శౌరి తదితరులు ఉన్నారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్ 1తోఅడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదీ... ఫలితాల విడుదల ఆలస్యం... ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై బోర్డులో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్ ప్రాసెస్ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరవుతారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. -
‘ఇంటర్’వివాదానికి కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను సమర్పించింది. కమిటీకి చైర్మన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ డొంగరి, బిట్స్ ప్రొఫెసర్ ఏ.వాసన్ బృందం దాదాపు 5రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన చేపట్టిన కమిటీ పది పేజీల నివేదికను రూపొందించింది. పరిశీలన ప్రక్రియంతా నాలుగు ప్రధాన అంశాలుగా విభజించింది. కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన విధులు, ఉపయోగించిన మానవ వనరులు, తప్పిదాలు జరిగిన ప్రక్రియ–తీసుకున్న చర్యలు, సాంకేతికత అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. వీటిని లోతుగా సమీక్షించిన కమిటీ పలు అంశాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. దీంతోపాటుగా పొరపాట్ల సవరణ, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అంశాలపైనా లోతైన విశ్లేషణ చేసి ఐదు అంశాలతో కూడిన సూచనలను నివేదికతో జతచేసి ప్రభుత్వానికి అందించింది. కాగా, త్రిసభ్య కమిటీ నివేదికపై ఇంటర్ విద్యా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, కళింగ కృష్ణకుమార్ హర్షంవ్యక్తం చేశారు. కమిటీ ప్రభుత్వానికి నివేదించిన నివేదికలోని పలు ముఖ్యాంశాలు.. అసౌకర్యం.. ఆగమాగం! ఇంటర్మీడియట్ బోర్డుతో కాంట్రాక్టు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. డేటా మైగ్రేషన్, మొబైల్ యాప్‌కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్లైన్ సర్వీసు, అడ్మిషన్ మాడ్యూల్, పరీక్షా కేంద్రాల నిర్వహణ (థియరీ, ప్రాక్టికల్), ప్రీ ఎగ్జామినేషన్ (జంబ్లింగ్, హాల్టిక్కెట్ల జనరేషన్), పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ చేయాలి. కానీ నిర్దేశించిన పనులను కాంట్రాక్టు సంస్థ సకాలంలో పూర్తి చేయలేదు. నిర్దేశిత గడువుదాటి పూర్తిచేసినా అందులోనూ చాలా లోపాలున్నాయి. దీంతో కలిగిన అసౌకర్యమే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీనికి కాంట్రాక్టు సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డుదీ బాధ్యతే. బాధ్యతల నిర్వహణలో వైఫల్యం ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతల్లో కీలక ఘట్టాలను సైతం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేసింది. హాల్‌టికెట్ల జారీ, ఫలితాల విడుదల తదితర కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల కంటే ముందుగా మాక్‌టెస్ట్ నిర్వహించాలి. ఓకే అనుకన్న తర్వాతే ఫలితాలు వెల్లడి చేయాలి. కానీ ఇందుకు తగిన ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఎక్కడా వినియోగించలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రాజెక్టులో చోటుచేసుకున్న పొరపాట్లు, తప్పిదాలను గుర్తించి పూర్తిస్థాయి నివేదికను గ్లోబరీనాకు అందించారు. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలలో ఈ తంతు జరిగింది. బోర్డు చేసిన సూచనలను గ్లోబరీనా విస్మరించింది. వీటిని పరిష్కరించకుండానే మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. బోర్డు ఆమోదించలేదు. మొత్తంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది. ఫలితాల వెల్లడిలో తప్పులు 531 మంది జాగ్రఫీ విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు వారి మెమోల్లో కనిపించలేదు. 496 మంది విద్యార్థుల మెమోల్లో వారి మార్కులకు బదులుగా ఏపీ అని వచ్చింది. కొంతమంది విద్యార్థుల మెమోలో ఏఎఫ్ అని వచ్చింది. 4,288 మంది ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమేటిక్స్ సబ్జెక్టులో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్‌లో చోటుచేసుకున్న తప్పిదాలతో, కొందరికి సరైన మార్కులు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలాంటి తప్పులు జరిగాయి. విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన మాడ్యూల్‌ను గ్లోబరీనా సంస్థ సకాలంలో అభివృద్ధి చేయలేదు. గతంలో ఈ ప్రక్రియంతా సీజీజీ చూసుకుంది. కానీ తాజాగా ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న గ్లోబరీనా అన్ని అంశాల్లోనూ దారుణంగా వెనుకబడింది. కనీసం గతేడాది డిసెంబర్ నాటికి కూడా వీటిని పూర్తి చేయలేదు. ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్‌లో అసమానతలు, ఆన్లైన్ ప్రశ్నాపత్రాలు, ప్రాక్టికల్ పరీక్షల మార్కుల స్వీకరణ, హాల్‌టిక్కెట్లలో తప్పిదాలు, పరీక్షా కేంద్రాల్లో సరిపోలని విధానంతో భారీగా తప్పిదాలు జరిగాయి. అతి పెద్ద తప్పిదమేమిటంటే ఫలితాల విడుదలకు ముందే.. వచ్చిన రిజల్ట్స్‌ను మరో సంస్థతో ప్రాసెస్ చేసి ఉండాల్సింది. రెండు రికార్డులు సరిపోలిన తర్వాత స్పష్టత వచ్చినప్పుడు ఫలితాలను విడుదల చేసుంటే బాగుండేది. గతేడాది అదే తరహాలో చేసినా.. ఇప్పుడు ఇలాంటి పరిశీలనలేమీ లేకుండానే ఫలితాలు విడుదల చేశారు. దీంతోనే గందరగోళం తలెత్తింది. తక్షణ సూచనలు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా.. పొరపాట్లను తక్షణమే సవరించాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సూచించింది. వీటితోపాటు భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితాలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించింది. ఒక విద్యార్థి మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో 80% మార్కులు సాధించి.. రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినట్లు తేలితే బోర్డు యంత్రాంగం వెంటనే సదరు సబ్జెక్టు జవాబుపత్రాన్ని రీ–వెరిఫికేషన్ చేయాలి. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ఇవ్వాలి. ఐవీఆర్ ఆధారిత హెల్ప్‌లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తితే వాటిని సంక్షిప్త సమాచారం, ఈమెయిల్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. హాల్‌టిక్కెట్ నంబర్‌ను కూడా ఐవీఆర్తో క్యాప్చర్ చేసేలా ఉండాలి. అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్ పంపించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బోర్డు నిర్దేశించిన ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థతోనే కాకుండా మరో స్వతంత్ర సంస్థతో ప్రాసెసింగ్ చేయించి రెండింటి ఔట్‌కమ్ సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలి. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రక్రియలను మాక్‌టెస్ట్ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. మాక్‌టెస్ట్‌ల్లో ప్రధాన తప్పిదాలు గుర్తిస్తే సవరించేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఏం చేయాలంటే! భవిష్యత్తులో నిర్దేశిత ప్రాజెక్టును చేపట్టే కంపెనీ ఎంపిక పక్కాగా ఉండాలి. పరీక్షల నిర్వహణ, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగం లో అనుసరిస్తున్న విధానాలు కవర్ చేస్తూ ఆదర్శవంతమైన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలి. అడ్మిషన్ల నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు బోర్డులో సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు తీరును పరిశీలిస్తుండాలి. మాక్టెస్ట్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి. అన్నీ సర్వీసుల మాడ్యూల్స్‌కు సంబంధించిన ఔట్పుట్ అందుబాటులోకి వచ్చే కంటే 4 వారాల ముందే టెస్ట్‌డ్రైవ్ జరపాలి. నిర్వహణాపరమైన అంశాలను సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. సర్వీసు ప్రొవైడర్ అనుసరిస్తున్న పద్దతులన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయాలి. అన్ని మాడ్యుల్ సర్వీసులకు సంబంధించి ముందుగా మాక్ టెస్ట్, బీటా టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలి. అలా చేసిన టెస్ట్‌ల తాలూకు ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఇంటర్‌బోర్డు ప్రత్యేక కమిటీ, ఈడీపీ బృందం విశ్లేషించి ఫలితాలు ప్రకటించాలి. కనీసం రెండు వారాలకు ముందు ఫీడ్‌బ్యాక్‌ను సర్వీస్ ప్రొవైడర్‌కు అందజేయాలి. సమాచార సమన్వయలోపం లేకుండా చూసుకునేందుకు.. ప్రత్యేకంగా టెక్నికల్ సెల్ ఏర్పాటు చేయాలి. అనుభవం, సరైన పరిజ్ఞానం ఉన్న అధికారులను ఇందులో నియమించాలి. ప్రత్యేక కమిటీల్లో ఉండే వారికి శిక్షణ తరగతులు నిర్వహించి అప్డేట్ చేయాలి. పనితీరు అధ్వానం ప్రాజెక్టులో భాగంగా బోర్డు నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన సాంకేతికత, మానవ వనరులను గ్లోబరీనా సంస్థ సమకూర్చింది. ఇంటర్మీడియట్ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి. కానీ.. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు సంస్థ బాగా వెనకబడింది. సరైన వనరులను సమకూర్చితేనే నాణ్యతతో కూడిన ఫలితం వచ్చేది. గ్లోబరీనా సంప్థ పనితీరు అసంతృప్తికరంగా, అధ్వానంగా ఉంది. -
ఇంటర్ ఫలితాలపై నివేదిక సమర్పించిన కమిటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డికి నివేదిక అందజేసింది. ఐదు రోజులుగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ శనివారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డికి అధ్యయన రిపోర్ట్‌ను ఇచ్చింది. త్రిసభ్య కమిటీతో భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవకతవకలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు 50వేల దరఖాస్తులు అందాయని.. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు. చదవండి : ‘గ్లోబరీనా’దే గోల్మాల్! -
లక్షలాది విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేశారు : లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఆగం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. 23 మంది ఇంటర్మిడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై కానీ, పరీక్షల మీదకానీ విద్యాశాఖ మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం దారుణమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 28ప అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్క రోజు నిరసన దీక్ష చేపడతామని, 29న హైదరాబాద్‌లో తల్లిదండ్రులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 30న ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని, డిమాండ్లను నెరవేర్చక పోతే మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో జరగబోయే పరిణామాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ 12 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహణ నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శిని తప్పించి.. ఆ బాధ్యతలను జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. కాగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు పేర్కొంది. మరోవైపు ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మరికాసేపట్లో తమ నివేదికను సమర్పించనుంది. ఇంటర్మీడియట్ ఫలితాల వైఫల్యాలపై పూర్తి స్థాయిలో పరిశీలించిన కమిటీ సుదీర్ఘ నివేదికను రూపొందిచినట్టుగా తెలుస్తోంది. -
చదువుకుంటే చనిపోవాల్సి వస్తోంది..
హైదరాబాద్(పంజగుట్ట): ఈ నెల 29న ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమే ఈ ధర్నాకు పిలుపునిచ్చిందని భావించి విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు. ఇంటర్ పరీక్షాఫలితాల్లో 61 వేల తప్పిదాలు వచ్చాయని, దీనికి అనుభవంలేని గ్లోబరీనా సంస్థే కారణమని అన్నారు. ‘చదువుకుంటే బాగుపడతారని అనుకుంటాం, కానీ చదువుకుంటే చనిపోతాం’అని ఇప్పుడే తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి జనసమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటర్ ఫలితాలు... దోషులు ఎవరు? పరిష్కారం ఏది?’అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. అన్ని సంఘాలను, పార్టీలను ఏకం చేసి ఉద్యమించే బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని, ఇంటర్ ఫలితాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. కోదండరాం మాట్లాడుతూ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంతో బాధ్యతగా పనిచేసిందని, దాన్ని కాదని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించినప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలోనూ తీవ్ర గందరగోళం జరిగిందని, అప్పుడే ఇంటర్ బోర్డు మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సంస్థ వెనక ఎవరో ఉన్నారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, లక్షలాదిమంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ చేస్తున్న తప్పుల గురించి ముందే తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు ఏదైనా తప్పులు జరిగితే తమకు సంబంధంలేదని, వారి సంఘం తరపున తీర్మానం చేసి బోర్డు సెక్రటరీకి ఇచ్చారని, అయినా ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదని దుయ్యబట్టారు. సమాజానికి పిల్లర్ల వంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆవేదనగా ఉందన్నారు. గ్లోబరీనాకు పర్చేస్ ఆర్డరే ఉంది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ‘గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. కానీ మనమే సంఘాలుగా విడిపోయి నిరసనలు చేస్తున్నాం, ఇప్పటికైనా అందరం ఐక్యమై ఉద్యమించాలి’అని అన్నారు. ‘ఇంత జరుగుతున్నా ఏం జరగలేదు, అన్ని అపోహలు, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు, ఏం జరగకపోతే ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి’అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థకు కేవలం పర్చేస్ ఆర్డర్ మాత్రమే ఉందని, అగ్రిమెంట్ లేదని, అగ్రిమెంట్ లేకుండా ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విద్యార్థుల మార్కుల జాబితా వ్యవహారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఎంసెట్ లీకేజీ, నయీం కేసు మాదిరిగా ఈ కేసు కూడా నీరుగారిపోకుండా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షుడు డీపీ రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నాయకులు బైరి రమేశ్, వెంకట్, భవాని, మమత, సత్యనారాయణ, అరుణ్ కుమార్, వెంకట్ స్వామి, గోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. నియంత పాలన నడుస్తోంది... మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది. క్యాబినెట్ లేదు, ఎవ్వరూలేరు. అన్ని నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రే అని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైందని, అలాంటి దానికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని అందరూ అంటున్నారు, కాని నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రే చేస్తున్నారు. తెలంగాణలో వ్యవస్థ నడవడంలేదు, కేవలం నేను, నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని అన్నారు. -
‘గ్లోబరీనా’దే గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో భారీగా చోటు చేసుకున్న పొరపాట్లకు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌దే తప్పని స్పష్టమవుతోంది. ఫలితాలపై నెలకొన్న పరిస్థితి ని క్షుణ్నంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వ్యవ హారంలో జరిగిన పొరపాట్లను గుర్తించి నివేది కలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్టు సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. పరీక్ష ఫీజుల చెల్లింపు వెబ్సైట్ సరిగ్గా పని చేయకపోవడం మొదలు డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు, ఫలి తాల ప్రాసెసింగ్ వరకు గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలాగే గ్లోబరీ నాకు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని, నిబంధనలను పట్టించు కోకుండా బోర్డు ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టినట్లు కమిటీ గుర్తించింది. కాంట్రాక్టు ప్రారంభమైన నాటి నుంచి గ్లోబరీనా పలు సాంకే తిక పొరపాట్లు చేసినా బోర్డు కనీసం పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే విధంగా కాంట్రాక్టు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీసినట్లు సమాచారం. సమాచారమంతా నివేదికలోకి... ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. పరీక్షల నిర్వ హణ, ఫలితాల వెల్లడిలో జరి గిన ప్రక్రియనంతా వడపోసిన కమిటీ... ఇందులో బాధ్యులుగా ఉన్న వారిని కేటగిరీలవారీగా విభజించి వివరాలను సేకరిం చింది. ఇంటర్ బోర్డు అధి కారులు, ఉద్యోగులతోపాటు గ్లోబరీనా ప్రతినిధులు, గతంలో పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారితోనూ మాట్లాడింది. అలాగే కాంట్రాక్టు సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై వస్తున్న విమర్శలపైనా సమాచారాన్ని సేకరించి నట్లు తెలిసింది. ఈ వివరాలతోపాటు అధికారు లపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని విశ్లేషించింది. కమిటీ ఇచ్చే నివేదికతో పాటు బయటివర్గాల నుంచి విశ్వసనీయంగా సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ష్... గప్‌చుప్... లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గందర గోళంలో పడేసిన ఇంటర్ ఫలితాల విషయంలో తప్పొప్పుల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రస్తుతం తమ విచారణ వివరాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. కనీసం మీడియాతో సైతం మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు సైతం పరిశీలన తాలూకు అంశాలను బయటకు వెల్లడి కానివ్వడం లేదు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటం... లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో కమిటీ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నివేదికలోని అంశాలు బయటపడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కమిటీ బృందం అత్యంత గోప్యత పాటించాలని నిర్ణయించిన క్రమంలో ఎప్పుడు ప్రభుత్వ దరికి నివేదిక చేరుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్రిసభ్య కమిటీపై తీవ్ర ఒత్తిడి? ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించంతో గురువారమే వివరాల సేకరణ పూర్తి చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. సాంకేతిక కారణాలతో నివేదిక సమర్పణలో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో నివేదిక సమర్పణ కోసం కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గ్లోబరీనా సంస్థపై ఆరోపణలకు తోడు... ఆ సంస్థ తప్పిదాలు, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో కొనసాగించిన వ్యవహారాలపై కమిటీ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిటీపై గ్లోబరీనా సంస్థ కూడా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల విషయంలో సంస్థ పొరపాట్లు లేవనే అంశాన్ని బలంగా వినిపించేందుకు కాంట్రాక్టు సంస్థ రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలో సంస్థ పరపతికి భంగం కలగకుండా చూడాలని కమిటీని కోరేందుకు గ్లోబరీనా యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు నివేదికను అత్యంత గోప్యంగా ప్రభుత్వానికి చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. -
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టు మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ బోర్డుతో గ్లోబరీనా సంసథ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు. అయితే రాపోల్ భాస్కర్ పిటిషన్‌పై హైకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు వైఫల్యాలపై పలువరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించాయని తెలంగాణ జన సమి తి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అన్ని విషయాలు బయటికి వస్తాయని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పరీక్షల ఫీజుల వసూలు మొదలు ఫలితాల ప్రకటన వరకు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సింది పోయి, బోర్డునే రద్దు చేయాలని ఆలోచించడం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేస్తున్నట్టుగా వస్తున్న ప్రతిపాదనలను తాము అంగీ కరించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన సరికాదన్నారు. గురువారం పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, రమేశ్‌రెడ్డి, భావనారెడ్డి, రమేశ్ ముదిరాజ్‌లతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి టీఆర్ఎస్ అధినాయకత్వం, బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతికబాధ్యత వహించి విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనాను ఎందుకు వెనుకేసుకొస్తున్నారు... బోర్డు కార్యదర్శి, ఇతర అధికారులు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్నారో చెప్పాలని కోదండరాం డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో నైపుణ్యం, సామ ర్థ్యం లేని ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన కీలకబాధ్యతలు ఇంటర్ బోర్డ్ ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అన్ని విషయాలు తెలుసని, అయినా చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపించారు. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు పట్టే సమయం, ఇతరత్రా విషయాల్లోనూ హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ వ్యవహారంలో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని వెల్లడించారు. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద టీజేఎస్ రిజిస్టర్ పార్టీ అని, అయినా జెడ్పీటీసీ అభ్యర్థులకు అగ్గిపెట్టె, ఎంపీటీసీ అభ్యర్థులకు గ్యాస్‌సిలిండర్ గుర్తులు కేటాయించారని, ఎన్నికల కమిషన్ చేసిన లోపం వల్ల తమ అభ్యర్థులు, పార్టీ ఇబ్బందులు పడాల్సి వస్తోం దని కోదండరాం అన్నారు. గురువారం ఈ అంశాన్ని తాము కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
కార్పొరేట్ గుప్పెట్లో ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీల గుప్పెట్లో చిక్కి ఇంటర్మీడియట్ బోర్డు విలవిల్లాడుతోంది. బోర్డు అడ్డాగా కార్పొరేట్ అవినీతి, అక్రమాల దందా దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయింది. బోర్డులోని కొంతమంది కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఆ సంస్థల అక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ వస్తు న్నారు. దీంతో ఆ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. బోర్డు లోని తమ అనుకూల వ్యక్తులతో అడ్డగోలు వ్యవ హారాలు నడుపుతూ చివరకు బోర్డు ప్రతిష్టనే అభాసుపాలు చేసే ప్రయత్నాలకు ఒడిగడుతున్నా రని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్మీ డియట్ బోర్డులో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్ పాత్ర పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యవహారం రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల దందా ఎప్పటినుంచో కొనసాగుతోంది. బోర్డు అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాలకు అలవాటు పడడం కారణంగా ఈ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండడంలేదు. పేరుకే నిబంధనలు జారీచేసే అధి కారులు వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టిన దాఖ లాలు పెద్దగా లేవు. అకడమిక్ అంశాల నుంచి మొదలుకొని కాలేజీల అనుమతులు, నిర్వహణ అంశాల వరకు అదే పరిస్థితి. అంతేకాదు రిటైరైన అధికారులను కన్సల్టెంట్లు, ఓఎస్డీ పేరుతో కొన సాగించేలా పావులు కదిపి తమ పనులను చేయిం చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ కార్పొ రేట్ సంస్థల కాలేజీల్లో అనేక తప్పిదాలు, అక్ర మాలు జరుగుతున్నా బోర్డు అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ఆశాస్త్రీయ విధానానికి కార్పొరేట్ ఊతం రాష్ట్రంలో అశాస్త్రీయ విద్యావిధానానికి కార్పొరేట్ విద్యాసంస్థలే తెరలేపాయి. అడ్డగోలు విధానాలతో జూనియర్ కాలేజీ విద్యావిధానాన్ని భ్రష్టు పట్టిం చాయి. కొద్దిమంది విద్యార్థుల ర్యాంకులను ఎరచూపి లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఒత్తిడితోనే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల అమలు జరగడంలేదు. ప్రస్తుతం సీబీఎస్ఈలో 11, 12 తరగతుల విధానం ఉంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో ఇదే విధానం ఉంది. వాటిల్లో జూనియర్ లెక్చరర్ కేడర్‌తో సమానమైన పీజీటీకి బీఎడ్ తప్పనిసరి. కానీ జూనియర్ కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితోనే ఈ నిబంధన అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్ కాలేజీల్లో బోధన నిర్వహించిన 220 రోజులను కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణలతోనే సరిపెడుతున్న యాజమాన్యాలు బోర్డు అధికారులను, జిల్లా ఇంటర్ విద్యా అధికారులను మేనేజ్ చేస్తూ విద్యార్థులపై తీవ్రఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అయినా వీరిపై బోర్డు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల కమిటీ పలుమార్లు సిఫారసు చేసినా, బోర్డు అధికారులు వీటి అమలును గాలికి వదిలేశారు. లోపాలు అనేకం.. అయినా చర్యల్లేవ్! ఒక చోట కాలేజీ అడ్రస్.. మరో చోట విద్యా సంస్థ.. పేరుకే ఆన్లైన్ ప్రవేశాలు.. అంతా ఇష్టారాజ్యమే. ఒక సొసైటీ పేరుతో కాలేజీలు, మరో పేరుతో నిర్వహణ విద్యార్థులకు రక్షణ ఉండదు. వేసవి సెలవుల్లో తరగతుల నిర్వహణ ఇలాంటి అనేక లోపాలపై బోర్డుకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలేజీల హాస్టళ్లలో ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కి, కనీస వసతులు కల్పించకపోయినా, వాటిపై అనేక ఫిర్యాదులు వచ్చినా బోర్డు అధికారుల్లో కనీస స్పందన లేదు. గతేడాది 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారుల కమిటీలు తనిఖీలు చేశాయి. బోర్డు.. నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లకు అనుమతులు తప్పనిసరి అని, వాటిల్లో ఉండాల్సిన ప్రమాణాలు, వసతులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా బోర్డు వాటిని పక్కాగా అమలు చేసినా దాఖలాలు లేవు. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో కార్పొరేట్ సంస్థలు బోర్డుపై ఒత్తిళ్లు తెచ్చి సడలింపులు పొందుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 500కు పైగా జూనియర్ కాలేజీలు హాస్టళ్లతో నడుస్తుంటే.. అందులో సగం యాజమన్యాలు కూడా బోర్డుకు దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. విద్యార్థుల జీవితాలతో ఆటలు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయాలు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. పీఆర్వోల వ్యవస్థను పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాటిల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమని వాటిల్లో చేర్చుతూ పిల్లలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు.. అనుమతులు తీసుకోకుండానే బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ, ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. అయినా ర్యాంకుల ప్రచారహోరులో తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తుండటంతో కార్పొరేట్ యాజమాన్యాలు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాయి. కార్పొరేట్ వ్యాపారానికే బోర్డు జై ఇంటర్‌బోర్డు కార్పొరేట్ విద్యావ్యాపారానికి అనుకూల సంస్థగా మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యాపారం తెలంగాణలోనే జరుగుతోంది. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల్లో 80 శాతానికిపైగా కార్పొరేట్ కాలేజీల్లోనే ఉన్నారు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వ లెక్చరర్లతోపాటు కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లకు కూడా ఇచ్చారు. ఆయా కాలేజీల నుంచి వచ్చే లెక్చరర్లు నిజంగా వారి కాలేజీల్లో పాఠాలు చెప్పిన వారు కాదు. కాబట్టి వ్యాల్యుయేషన్ పెద్ద ఫార్సుగా మారిపోయింది. కార్పొరేట్ సంస్థలకు బోర్డు సర్వెంట్‌గా మారిపోయింది. కాబట్టి బోర్డును ప్రక్షాళన చేయాలి. లేదా బోర్డు ఎత్తేసి సీబీఎస్ఈ తరహాలో పాఠశాల విద్యలో కలపాలి. – నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘం కమిటీ పరిశీలన పూర్తి! ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన దాదాపుగా పూర్తయింది. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వాసన్, ప్రొఫెసన్ నిషాంత్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం, ఫలితాలకు సంబంధమున్న అధికారులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా ప్రతినిధులతో వేరువేరుగా విచారించింది. మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వేగవంతంగా పరిశీలన చేసి గురువారం నాటికి పూర్తిచేసినట్లు తెలిసింది. వాస్తవానికి గురువారం రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కమిటీ నివేదిక సమర్పించలేదని సమాచారం. శుక్రవారం ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సాంకేతిక బాధ్యత మరో సంస్థకు ఇంటర్మీడియట్ రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ రంగసంస్థ సీజీజీ లేదా మరో ఇతర సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకునే అవకాశం ఉంది. గ్లోబరీనాపై పలు తప్పిదాలు చేయడం, తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఇకపై ఆ సంస్థ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష (ఏఎస్ఈ) తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వాటికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏఎస్ఈ తేదీలను ముందుకు జరిపే అవకాశముంది. -
విద్యాశాఖ మంత్రిని ఎందుకు తప్పించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని, సీఎం కేసీఆర్ ఎందుకు తప్పించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు తాము ఉద్యమం చేస్తామని అన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిసిన బీజేపీ నేతలు తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ నిర్వహించాలని కోరారు. గ్లోబరీనా సంస్థ బాగోతాలపై దర్యాప్తు జరిపించి.. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. ఆందోళన చేసిన విద్యార్థుల తల్లిదండ్రులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలన్నారు. మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు. ఈ సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా సంస్థకు అనుభవం లేకపోయిన ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని.. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. వారం తరువాతైనా సీఎం ఈ ఘటనపై స్పందించినందుకు సంతోషం అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నిలదీశారు. గవర్నర్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొన్నారు. అశోక్ కుమార్‌ను బోర్డు కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తామిచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకూడదని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని విమర్శించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు చేసుకోవడం బాధకరమన్నారు. సీఎం పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమయిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా మంత్రిపై, బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
చిన్నశంకరంపేట/బొమ్మలరామారం/పరకాల: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట యమపాశంగా తయారైంది. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, తాజాగా మెదక్ జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌కి చెందిన చాకలి రాజు(18) ఇంటర్ ఫెయిల్ అయ్యా నని చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన రాజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాసయ్యాడు. తాజాగా సెకండియర్ రిజల్ట్‌లో ఎకనమిక్స్‌లో 08 మార్కులు, సివిక్స్‌లో 27 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో మితి (19) అనే ఇంటర్ విద్యార్థిని ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మితి బీబీనగర్ మండలంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది పూర్తిచేసింది. ఇటీవల ఫలితాల్లో మితిæ జువాలజీ, కెమిస్ట్రీల్లో ఫెయిలైంది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున మితి ఉరి వేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు ఇంటర్ ఫస్టియర్‌లో బోటనీ సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో బుధవా రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్ చేసేప్పుడు ఒకటికి రెండు, మూడుసార్లు చెక్ చేసుకోకుండా ఎలా వెల్లడిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు పనులను ఎలా అప్పగించారని మండిపడ్డారని సమాచారం. దీంతోపాటుగా.. ఆయన్ను రీ–వెరిఫికేషన్ కమ్ ఫొటో స్కాన్డ్ కాపీ, రీ–కౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. తక్కువ కోట్ చేశారన్న సాకుతో నిబంధనలను కూడా సరిగ్గా అమలు చేయకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ 2017–18 విద్యాసంవత్సరంలో వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాసెసింగ్‌ను సరిగా చేసి చూపించనపుడు.. ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తినపుడు సదరు సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, పైగా ఆ సంస్థ ప్రవేశాల ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదని ఆ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించిన సమయంలోనే.. ఆ సంస్థతో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటినుంచి హాల్‌టికెట్ల జనరేషన్, ఆన్లైన్లో ప్రాక్టికల్ మార్కుల అంశం సరిగాచేయలేని సంస్థను ఎందుకు కొనసాగించారని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం పక్కాగా జరిగేందుకు చర్యలు చేపట్టడంతోపాటు అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందం, దాని ప్రకారమే పని చేసిందా? లేదా? అన్న దానిపైనా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు తక్కువ మార్కులు వేయడం, పరీక్షలకు హాజరైనా గైర్హాజరైనట్లు చూపడం వంటివి సాఫ్ట్వేర్ సమస్యల కారణంగానే దొర్లినట్లు స్పష్టమైంది. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనుంది. ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. సందేహాలుంటే డీఐఈవోలను సంప్రదించండి ఆర్వీ, ఆర్సీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్(ఆర్వీ), రీకౌంటింగ్(ఆర్సీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు bie.telangana.gov.in వెబ్సైట్ లేదా టీఎస్ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రీవాల్యుయేషన్‌కు రూ.600, రీకౌంటింగ్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం కోసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. డీఐఈవో హైదరాబాద్–9848781805, డీఐఈవో రంగారెడ్డి– 9848018284, డీఐఈవో మేడ్చల్– 9133338584 లోనూ సంప్రదించవచ్చంది -
ఆత్మహత్యలు వద్దని వేడుకుంటున్న: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘ఇంటర్మీడియట్లో ఫెయిలయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డా. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలైతే.. జీవితంలో ఫెయిలైనట్లు కాదు. ప్రాణం చాలా విలువైంది. పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. అది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమైన సంఘటనలని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించే చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని సీఎం చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్, అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తల్లిదండ్రుల అనుమానాల నివృత్తికి చర్యలు ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ–వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ–వెరిఫికేషన్ చేయాలి. రీ–కౌంటింగ్ చేయాలి. పాసైన విద్యార్థులకు కూడా రీ–వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’అని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సమస్యల్లేని పరీక్షల విధానం ‘ఇంటర్మీడియట్‌తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతిసారీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఏడాదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం కూడా అనవసరంగా తలనొప్పులు భరిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో ఎలా అమలు చేయగలమో ఆలోచించాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పుల్లేని పరీక్షావిధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న తలనొప్పులు నివారించడం కూడా అసాధ్యమేదీ కాదు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సంస్థపైనా ఆరా ఇంటర్మీయట్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యంపై సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. -
‘తెలంగాణ’ వచ్చాక అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షాఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం సాధారణ విషయం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని బీజేపీ ఆరోపించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో చెలగాటం ఆడటాన్ని ప్రభుత్వం సాధారణ విషయంగా తీసుకుందని మండిపడింది. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. వివిధ అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పది లక్షలమంది విద్యార్థులను తీవ్ర మనోవేదనకు, కొంతమంది ఆత్మహత్యలకు దారితీసిన ఈ ఉదంతాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవటం భావ్యం కాదన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకు అన్ని కలెక్టరేట్ల ఎదుట బుధవారం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్టు తెలిపారు. -
ఇంటర్ అవకతవకలు : అంతా పథకం ప్రకారమే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూలురైన వారికి మేలు జరిగే విధంగా టెండర్ విధానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక పని లేదా ప్రాజెక్టు అమలును నేరుగా ప్రైవేటు సంస్థకు అప్పగించకుండా టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేస్తారు. టెండర్లు పిలిచిన సమయంలో ఆశావహ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి తక్కువ ధరలో కోట్ చేసే సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు సంబంధించి నిపుణుల సమక్షంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. కానీ ఇంటర్ బోర్డు డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు అప్పగింత అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూల సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కేవలం అనుకూల సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ వేసింది రెండు సంస్థలే! ఇంటర్ అడ్మిషన్లు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ తదితర పనులకు ఇంటర్మీడియెట్ బోర్డు 2017 సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. నెల రోజులపాటు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించినప్పటికీ కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. గడువులోగా కేవలం గ్లోబరీనా టెక్నాలజీస్, మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో టెండర్లు తెరిచి ఖరారు చేసే పనిలో భాగంగా ఎల్1 (లోయెస్ట్ వన్) కంపెనీగా ఉన్న గ్లోబరీనాను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త సంస్థ అయినప్పటికీ తక్కువ మొత్తానికి కోట్ చేయడంతో ఎంపిక చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థ సేవలను ఇంటర్ బోర్డు మూడేళ్లపాటు వినియోగించుకోనుంది. అంతా పథకం ప్రకారమే... డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు అనుకూల సంస్థకు అప్పగించడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే భారీ ప్రాజెక్టుకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్ వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లో పాల్గొన్న రెండు సంస్థలు ఒకే కన్సార్షియంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో జేఎన్టీయూ కాకినాడలో విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ కార్యక్రమంలో గ్లోబరీనా, మ్యాగ్న టిక్ సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రక్రియలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ చేసినట్లు జేఎన్టీయూ కాకినాడ సర్టిఫై చేసింది. తాజాగా ఇంటర్మీడియెట్ బోర్డుకు ఈ రెండు సంస్థలు అడపాదడపా సేవలం దిస్తున్నట్లు అధికారులు సైతంచెబుతున్నారు. మ్యా గ్నటిక్ సంస్థతో దాదాపు 13 సంవత్సరాలు కలసి పనిచేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ స్వయంగా అంగీకరించారు. టెండర్ ప్రక్రియలో తక్కువ కోట్ చేయడంతో గ్లోబరీనాకు టెండర్ ఖరారు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సంస్థల కు ఉన్న అర్హతల ఆధారంగానే టెండర్ నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. -
మూడోరోజూ ఉద్రిక్తత
హైదరాబాద్: తోపులాటలు.. నినాదాలు... అరెస్టుల మధ్య తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం వద్ద మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యా ర్థులు, తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు కార్యాలయం ఉన్న నాంపల్లికి చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కార్యాలయం వద్ద ఉన్న రోడ్డు పొడవునా పోలీసులు బారికేడ్లను, ముళ్ల కంచెలను అమర్చడంతోపాటు మూడంచలుగా మోహరించి ఉండటంతో ఆందోళనకారులు లోపలకు వెళ్లలేకపోయారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులతో తల్లిదండ్రుల వాగ్వాదం.. ఇంటర్ బోర్డు లోపలకు వెళ్లేందుకు ఓ టీఆర్ఎస్ నేతను పోలీసులు అనుమతించడంపై విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు వెనక్కి తగ్గారు. లోపలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ నేతను వెనక్కి పంపించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే మీడియా ప్రతినిధులతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సహా మరికొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఆందోళనకారులను అక్కడి నుంచి వాహనాల్లో బేగంబజార్, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, పీడీఎస్‌యూ నేత నాగరాజు, మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఇ. విజయ్ మాదిగ, విద్యార్థి జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎన్. రమేశ్ ముదిరాజ్, టీఎన్ఎస్ఎఫ్, టీడీఎఫ్ నేతలు సాయిబాబా, బాలరాజ్ గౌడ్, మధుకర్ ఉన్నారు. ఉదయాన్నే కార్యాలయానికి బోర్డు సిబ్బంది... ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేసే సిబ్బంది ఉదయం 8 గంటలకే డ్యూటీలకు వచ్చారు. ఆందోళనకారులు రాక ముందే కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రెండు రోజుల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు సిబ్బంది అంతా ఉదయాన్నే విధులకు హాజరు కావాలని బోర్డు కార్యదర్శి ఆదేశించడంతోనే వారంతా సమయంకన్నా ముందే ఆఫీసుకు చేరుకున్నట్లు తెలిసింది. ఉదయాన్నే లోపలకు వెళ్లిన ఉద్యోగులు బయటకు రావడానికి వీలు కాలేదు. సాయంత్రం 6 తరువాతే వారు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రివేళ ఉన్నతాధికారుల సమీక్ష... మంగళవారం సాయంత్రం తర్వాత ఉద్రిక్తత చల్లబడటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాల్లో తప్పిదాలు, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు బోర్డు కార్యదర్శితో సమీక్షించినట్లు సమాచారం. రాత్రి 8 గంటలకు మొదలైన ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకు కొనసాగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షలపై వారు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. -
కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం
తగినంత యంత్రాంగం లేదని చెప్పొద్దు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ధి లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా? – హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తమకు గణాంకాలతో పని లేదని, విద్యార్థుల సమస్యకు పరిష్కారం ఎలా చూపుతారో సోమవారం కల్లా స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తీర్ణులు కాలేకపోయిన 3 లక్షల మంది విద్యార్థుల పత్రాలను పునర్ మూల్యాంకనం చేయడానికి ఉన్న అవకాశాలు ఏమిటో తెలియచేయాలని సూచించింది. సోమవారం ఉదయం 10.15 గంటలకల్లా పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరు కావాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విద్యార్థుల జీవితానికి సంబంధించిన వ్యవహారమని, ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీవాల్యుయేషన్‌కు ఆదేశించడంతోపాటు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో ఏసీజే నేతృత్వంలో అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోర్టుకు నివేదించారు. అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ సమస్యపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. మూల్యాంకన బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీ తన పని సక్రమంగా చేసిందా? లేదా? ఒప్పందం మేరకు వ్యవహరించిందా? లేదా? అన్నది కమిటీ చూస్తుందని ఆయన బదులిచ్చారు. సక్రమంగా మార్కులిచ్చారా అన్నదే ముఖ్యం.. ఇక్కడ సమస్య అది కాదని.. ప్రశ్నలు, వాటి జవాబులు, వాటికి సక్రమంగా మార్కులు ఇచ్చారా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లెక్కల్లో 100కి 100 వస్తాయనుకున్న విద్యార్థికి కేవలం 60 మార్కులే వస్తే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు దిద్దిన పేపర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించే యంత్రాంగం ఉండటం తప్పనిసరని అభిప్రాయపడింది. పిటిషనర్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. దీనికి ఏఏజీ స్పందిస్తూ.. 9.7 లక్షల మంది పరీక్షలు రాశారని, ఇందులో 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ 3 లక్షల మందిలో 22 వేల మంది రీ కౌంటింగ్‌కు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. అధికారుల తప్పదానికి విద్యార్థులు బలైపోయారని, అందువల్ల విశ్రాంత న్యాయమూర్తి చేత జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరారు. జ్యుడీషియల్ విచారణ పరిష్కారం కాదు... ఈ సమస్యకు జ్యుడీషియల్ విచారణ ఎంత మాత్రం పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకవేళ విచారణకు ఆదేశిస్తే, తప్పు ఎలా జరిగింది.. ఎవరు బాధ్యులు అన్న విషయాలే తేలతాయి తప్ప.. విద్యార్థులకు న్యాయం జరిగే మార్గం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. బాధ్యులను జైల్లో పెట్టినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్తకు భరోసా ఇచ్చినట్లు కాదంది. పరీక్షా పత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేశారా? లేదా? ఏం తప్పులు జరిగాయి.. ఆ తప్పులను ఎలా సరిదిద్దాలి.. విద్యార్థుల భవిష్యత్తును ఎలా నిలబెట్టాలి.. అన్న అంశాలకే ప్రాధాన్యతనిచ్చి, వాటికి పరిష్కార మార్గాలను వెతకాలని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదని పేర్కొంది. వారంలోగా పునర్ మూల్యాంకనం చేయలేరా? అంటూ ఏఏజీని ప్రశ్నించింది. పునర్ మూల్యాంకనానికి 2 నెలల సమయం పడుతుందని ఏఏజీ రామచంద్రరావు చెప్పగా.. 9 లక్షల మంది పేపర్లను మూల్యాంకనం చేయడానికి నెల రోజులు పడితే, 3 లక్షల మంది పేపర్లను పునర్ మూల్యాంకనం చేయడానికి రెండు నెలల గడువు కావాలా? అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. కనీసం పది రోజుల్లో చేయలేరా? అని ప్రశ్నించింది. మన పిల్లల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? ‘‘తగినంత యంత్రాంగం లేదని చెప్పొదు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ది లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా? వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి మంటలు చెలరేగినప్పుడు 58 ఏళ్ల అగ్నిమాపక అధికారి చూస్తూ ఉండిపోలేదు. అందరి కన్నా ముందు వెళ్లి ఆయన ప్రాణాలను పణంగా పెట్టి పౌరుల ప్రాణాలను కాపాడారు. ఇక్కడ అంత సాహసం అవసరం లేదు. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించండి చాలు’’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో కోర్టు హాలులో ఉన్న ఇంటర్ కార్యదర్శి అశోక్ స్పందిస్తూ.. పునర్ మూల్యాంకనానికి తగినంత గడువు కావాలని కోరారు. రోజుకు 40 పత్రాలు మాత్రమే పునర్ మూల్యాంకనం అవుతాయని, ముగ్గురు ఎగ్జామినర్లు వాటిని పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఇందుకు 4వేల మంది సిబ్బంది అవసరమని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం చెబుతూ.. తమకు ఈ గణాంకాలతో పనిలేదని, సమస్యకు పరిష్కార మార్గాలు మాత్రమే కావాలని స్పష్టం చేసింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా తాము పని చేస్తున్నామని.. సుప్రీంకోర్టు అవసరమైతే అర్థరాత్రులు కూడా కేసులను విచారిస్తుందని, మీరు పిల్లల కోసం మరింత ఎక్కువ సమయం పనిచేయలేరా? అని ప్రశ్నించింది. ఏది ఏమైనా కూడా సోమవారం కల్లా పునర్ మూల్యాంకనం విషయంలో పరిష్కార మార్గాలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.