నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో నంబర్లు వేస్తున్న సిబ్బంది నార్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్ష కేంద్రంలో నంబర్లు వేస్తున్న సిబ్బంది
నార్నూర్(ఆసిఫాబాద్): ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకాను న్నాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణకు అధి కారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా ఈ సారి ప్రతీ పరీక్ష కేంద్రాన్ని నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొం దించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుం డా వసతులు కల్పిస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. అయితే విద్యార్థులు అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 15,347 మంది పరీక్ష రాయనున్నారు.
జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో అన్ని వసతులు కలిగిన 28 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం కలిపి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 15,347 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి సైతం కింద కూర్చోకుండా బెంచీలు ఏర్పాటు చేశారు. పక్కా భవనాలు కలిగిన చోటనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య సిబ్బంది, తాగునీరు ప్రతీ కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నారు.
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ
పరీక్షల్లో ఎలాంటి మాస్‌కాఫీయింగ్‌కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించనున్నారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రంలో విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఇస్తారు. మాస్‌కాఫీయింగ్‌ను ప్రోత్సహించే వారిపై చర్యలు ఉంటాయి. జిల్లాలో రెండు ప్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్యాడ్ బృందాలను నియమించారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి పోలీసు భద్రత నడుమ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు కేంద్రాలకు వచ్చేలా ప్రణాళిక చేసుకోవాలి. 8.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి పరీక్ష నిర్వహణ మొదలై 9 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా విద్యార్థికి అనుమతి ఉండదు. ఎట్టి పరిస్థితిల్లోనైనా విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు హాల్‌టికెట్‌ల విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఇంటర్‌నెట్‌లో ప్రత్యేక వెబ్‌సైట్ ఉంది. హాల్‌టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు. ఫీజుల కోసం ఎవరైనా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు.
సీసీ కెమెరాల నిఘాలో..
ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే కొన్ని కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు లేవు. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను కెమెరాల పర్యవేక్షణలోనే తెరవడం, జవాబు పత్రాలను మూయడం జరుగుతుంది. ఇదంతా ఐదు రోజులకోసారి సీడీలో రికార్డు చేసి భద్రపర్చనున్నారు. 28 కేంద్రాల్లో చీప్ సూపరింటెండెంట్లు, డీవోలతోపాటు ప్రతీ 20 మందికి ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
జిల్లాలో ఈసారి ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. మొత్తం 28 సెంటర్లు కేటాయించాం. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉంది. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్‌లు మూసిఉంచాలి. మాస్ కాఫీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు చేశాం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి. – దస్రునాయక్, డీఐఈవో ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment