ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు! | TS TS Inter Board Is Working To Release 1st And 2nd Year results Simultaneously | Sakshi
Sakshi News home page

ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు!

Published Wed, May 27 2020 3:49 AM | Last Updated on Wed, May 27 2020 3:49 AM

TS TS Inter Board Is Working To Release 1st And 2nd Year results Simultaneously - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఈ నెల 30నాటి కి ప్రథమ సంవత్సర జవాబు పత్రాల మూల్యాం కనం పూర్తి కానుంది. ఆ తరువాత జూన్‌ మొదటి వారంలో ఫలితాల ప్రక్రియను చేపట్టి, రెండో వారంలో ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. కాగా, ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరం ఎలా ఉండాలన్న దానిపై నియమించిన సీనియర్‌ అధికారుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక ఆధారంగా విద్యా కార్యక్రమాల కొనసాగింపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement