
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షా పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి సబితా గురువారమిక్కడ మాట్లాడుతూ గతంలో 12 వాల్యుయేషన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 కేంద్రాలకు పెంచామన్నారు.
కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ప్రయివేట్ స్కూల్స్ గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. (జూన్లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!)
Comments
Please login to add a commentAdd a comment