Evaluation
-
దీన్నే పిచ్చి అంటారండి ! మహిళా టీచర్ క్రేజీ రీల్ వైరల్
సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వడం కోసం, లైక్‌ల కోసం యూజర్లు చేస్తున్న పనులకు హద్దు లేకుండా పోతోంది. తాజాగా ఒక ఉపాధ్యాయురాలు పేపర్లు దిద్దుతూ కూడా రీల్ చేసింది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కట్ చేస్తే...బిహార్‌లోని పాటలీ పుత్ర యూనివర్శిటీ (పీపీయూ) చెందిన టీచర్ పరీక్ష పేపర్ కరెక్షన్స్ చేస్తోంది. దీన్ని ఏకంగా ఇన్స్టాగ్రామ్ రీల్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచిత్ర విచిత్రమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. पीपीयू एग्जाम का कॉपी जांचने का रील्स इंस्टाग्राम पर वायरल, मैडम पर FIR दर्ज। pic.twitter.com/GlnZhH4Yuk— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 26, 2024 హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురులా కనిపిస్తోంది' అని ఒకరంటే, దీన్నే పిచ్చి అంటారండి అంటూ మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఒక టీచర్‌గా మీరు చేయాల్సిన పని ఇదేనా అంటూచాలామంది మండి పడ్డారు. ఇలాంటివాళ్లు సిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదైనాయి అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. చివరికి ఇది ఉన్నతాధికారులదాకా చేరడంతో టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
మే 15 కల్లా ఇంటర్, టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది. మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్ ద్వారా ఇంటర్ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు. -
పరీక్షల్లో మార్పులు ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో పరీక్షల విధానాన్ని, మూల్యాంకన పద్ధతిని సమూలంగా మార్చబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఇప్పటికే ఈ దిశగా అధ్యయనానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం జరిగే సమావేశం కీలకమైందిగా అధికారులు చెబుతున్నారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు ఈ భేటీకి హాజరవుతున్నారు. మరో ఆరు ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపల్స్‌ను సమావేశానికి ఆహ్వానించారు. విశ్వవిద్యాలయాల పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటి వరకూ జరుగుతున్న పరీక్షలకు సంబంధించిన డేటాను ఐఎస్బీకి అందజేయబోతున్నారు. ఈ సమావేశం అనంతరం ఐఎస్బీ బృందాలు దాదాపు వంద కాలేజీల నుంచి సమగ్ర సమాచారం సేకరిస్తాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ఉన్న పరీక్షల విధానంపై స్టడీ చేస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని తెలంగాణ ఉన్నత విద్య కోర్సుల్లో అనుసరించాల్సిన సరికొత్త పరీక్షల ప్రక్రియపై ఐఎస్బీ నివేదిక ఇస్తుంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత దీన్ని అమలులోకి తెస్తామని ఉన్నత విద్య మండలి తెలిపింది. విభిన్న తరహా విశ్లేషణ డిగ్రీ, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య పరిధిలోని అన్ని కోర్సుల్లో పరీక్షల విధానం ఎలా ఉంది? మార్కులు వేసే పద్ధతి ఏంటి? ఏ తరహా విద్యార్థికి ఎన్ని మార్కులొస్తున్నాయి? ఉన్నత విద్య తర్వాత విద్యార్థికి లభించే ఉపాధి ఏమిటి? అసలు విద్యార్థులు ఏం ఆశిస్తున్నారు? పరీక్షలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఈ తరహా డేటాను పరీక్షల విభాగం కంట్రోలర్స్ ఇప్పటికే సేకరించారు. వీటినే ఐఎస్బీ ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉన్నత విద్యలో అత్యధిక మార్కులు పొందినప్పటికీ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు వారిలో నైపుణ్యం ఉండటం లేదని అఖిల భారత సాంకేతిక విద్య మండలి అధ్యయనంలో వెల్లడైంది. కేవలం మార్కుల కోణంలోనే మూల్యాంకన విధానం ఉందని, విద్యార్థి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే తరహా అవసరమని భావించింది. వేగంగా విస్తరిస్తున్న బహుళజాతి సంస్థల్లో చేరేందుకు ఈ విధానం అవరోధంగా ఉందని గుర్తించారు. డిగ్రీ చేతికొచ్చిన విద్యార్థి ఉద్యోగ వేటలో ఎదురయ్యే పరీక్షల తంతును అందిపుచ్చుకునే తరహాలో శిక్షణ, పరీక్షలు, బోధన విధానం ఉండాలన్నదే సంస్కరణల ప్రధానోద్దేశ్యమని మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ కోణంలోనే ఐఎస్బీ చేత అధ్యయనం చేయిస్తున్నట్టు చెప్పారు. ఇది అత్యంత సాంకేతికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని ఐఎస్బీ నిపుణుడు శ్రీధర్ తెలిపారు. -
జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44
ముదిగొండ: ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి. దీంతో ఎకనామిక్స్ జవాబు పత్రం రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్సైట్లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు. చదవండి👇 తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. తెలంగాణలో జికా వైరస్ కలకలం.. హెచ్చరించిన వైద్యులు -
మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరగలేదు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం హైకోర్టుకు నివేదించింది. డిజిటల్ మూల్యాంకనం కాకుండా మాన్యువల్‌గానే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాలంటూ హైకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చిన తరువాత ఒక్కసారి మాత్రమే మాన్యువల్ మూల్యాంకనం చేయించామని ఏపీపీఎస్సీ తరఫు సీనియర్ న్యాయవాది సర్వ సత్యనారాయణ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. చదవండి: ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. డిజిటల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన పలువురు అభ్యర్థులు తాజా మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కాకపోవడంతో పలు ఆరోపణలతో ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఒకసారి మాన్యువల్ మూల్యాంకనం చేసి, అటు తరువాత దాన్ని పక్కన పెట్టి తిరిగి మరోసారి మూల్యాంకనం చేశారని ఆరోపిస్తున్న అభ్యర్థులు అందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంతో రాజ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు, అందులో పనిచేసే అధికారులకు దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాజ్యాలను అనుమతిస్తూ పోతే పోస్టుల భర్తీ అసాధ్యమని సత్యనారాయణ ప్రసాద్ నివేదించారు. ఉత్తీర్ణులు కాని వారు ఏదో ఒక ఆరోపణతో వివాదం సృష్టిస్తూ పిటిషన్లు వేస్తూ ఉంటారన్నారు. మూల్యాంకనం లాంటి విషయాలు నిపుణులకు సంబంధించినవని, అందులో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు. మూల్యాంకనం చేసిన వ్యక్తులను తాము ఎంపిక చేయలేదన్నారు. వీసీలు, విద్యాశాఖ వారిని ఎంపిక చేశారని చెప్పారు. ఏ అభ్యర్థి సమాధాన పత్రాలను ఎవరు మూల్యాంకనం చేస్తారో ఎవరికీ తెలియదన్నారు. అందువల్ల అవకతవకలు, అక్రమాలు జరిగేందుకు ఆస్కారమే లేదని వివరించారు. బుధవారం నుంచి ఇంటర్వ్యూలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను నిలుపుదల చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తాము చేస్తున్నది కేవలం ఇంటర్వ్యూలే కానీ నియామకాలు కాదన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేయడం లేదు.. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు పి.వీరారెడ్డి, ఎ.సత్యప్రసాద్, కేఎస్ మూర్తి తదితరులు వాదనలు వినిపిస్తూ ఐఐటీ స్థాయి అధ్యాపకులతో కాకుండా డిగ్రీ లెక్చరర్లతో మూల్యాంకనం చేయించడం ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. కేవలం 35 రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేశారన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మాన్యువల్ మూల్యాంకనం చేశారని, తరువాత దాన్ని పక్కనపెట్టి మరోసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మొదటి మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులైన పలువురు అభ్యర్థులను రెండో మూల్యాంకనంలో తొలగించారని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. రాజ్యాంగ సంస్థ అయిన ఏపీపీఎస్సీ రాజ్యాంగానికి లోబడి పని చేయడం లేదన్నారు. వాదనల అనంతరం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సర్వీస్ కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఇంటర్వ్యూల విషయంలో ఏం చేయాలన్న దానిపై తగిన ఉత్తర్వులు ఇస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాత్రికి అందుబాటులోకి వస్తాయా? లేక బుధవారం ఉదయం అందుబాటులోకి వస్తాయా? అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. అవకతవకలు జరిగాయంటూ పిటిషన్లు.. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ మూల్యాంకనం చేయించిన సర్వీస్ కమిషన్ సరైన విధానాలను అనుసరించలేదని, ఇందులో అక్రమాలు జరిగాయంటూ మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణులు కాని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం విచారణ జరిపారు. -
ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. స్పాట్ వాల్యుయేషన్ విధులకు ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు పూర్తిస్థాయిలో హాజరుకావట్లేదు. దీన్ని ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్, మెదక్‌తోపాటు అనేక ప్రాంతాల్లో వారు నిరసనకు దిగారు. మరోపక్క విధులకు హాజరవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. ప్రైవేటు కాలేజీలు స్పాట్‌కు లెక్చరర్లను ఎందుకు పంపడం లేదన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మా వద్ద లెక్చరర్లే లేరని, మేమెలా స్పాట్‌కు పంపగలంఅని ఇంటర్ బోర్డ్ అధికారుల వద్ద ప్రైవేటు కాలేజీలు మౌఖికంగా చెబుతున్నాయి. స్పాట్‌కు పంపే లెక్చరర్ల జాబితా కోరినప్పుడు మాత్రం ఆ కాలేజీలు కొంతమంది పేర్లు బోర్డుకు ఇచ్చాయి. వాస్తవానికి వీళ్లంతా ప్రస్తుతం ఆయా కాలేజీల్లో లేరు. అదే అసలు సమస్యగా కన్పిస్తోంది. కరోనా నేపథ్యంలో 18 నెలలకుపైగా ప్రత్యక్ష బోధన కుంటుపడింది. ఈ సమయంలో వేతనాలు ఇవ్వకపోవడంతో లెక్చరర్లు బతుకుదెరువు కోసం ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. ఇప్పటికీ చాలా ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్ల కొరత వేధిస్తోంది. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి కాలేజీలు బోర్డు నుంచి గుర్తింపు పొందాయి. ఇప్పుడు అధ్యాపకులు లేరని చెబితే కాలేజీ గుర్తింపునకే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీలు చేయకుండా గుర్తింపు ఎలా ఇచ్చారనే ప్రశ్నకు బోర్డు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ముదురుతున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా 405 ప్రభుత్వ, 1,500కుపైగా ప్రైవేటు ఇంటర్ కాలేజీలున్నాయి. ఇటీవల 4.12 లక్షల మంది ఫస్టియర్ పరీక్షలు రాశారు. అన్ని సబ్జెక్టులు కలిపి 25 లక్షల పేపర్లుంటాయి. వీటి మూల్యాంకనానికి 8 వేల మంది లెక్చరర్లు కావాలి. ప్రభుత్వ కాలేజీల్లోని 3,700 మంది కాంట్రాక్టు అధ్యాపకులను, 700 మంది శాశ్వత లెక్చరర్లను, 2 వేల మంది గురుకులాల అధ్యాపకులను వాల్యుయేషన్ విధుల్లోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు లెక్చరర్లను సమానంగా తీసుకోవాలని అధ్యాపక సంఘాలు కోరాయి. అయితే, 6,500 మంది వరకు ప్రభుత్వ లెక్చరర్లను, 1,500 మంది ప్రైవేటు లెక్చరర్లనే తీసుకున్నారు. ప్రైవేటు కాలేజీలు యథాతథంగా నడుస్తుంటే, ప్రభుత్వ కాలేజీలు స్పాట్ కారణంగా బోధన లేకుండా ఉంటున్నాయి. ఈ కారణంగా స్పాట్ ముగిసే వరకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ లెక్చరర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బోర్డు అంగీకరించకపోవడంతో స్పాట్ వాల్యుయేషన్ ముందుకు కదిలే అవకాశం కన్పించడం లేదు. ఇక చర్యలు తప్పవు మూల్యాంకన విధులకు నియమించిన లెక్చరర్లను ప్రైవేటు ఇంటర్ కాలేజీలు రిలీవ్ చేయాలి. గైర్హాజరైన అధ్యాపకులు, కాలేజీల కు నోటీసులు ఇచ్చాం. హాజరుకాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. –ఒమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆందోళన తప్పదు మూల్యాంకనానికి హాజరవ్వని ప్రైవేటు కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. బోర్డు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. –మాచర్ల రామకృష్ణ గౌడ్, తెలంగాణ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్ అధ్యాపకులే లేరు.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వల్ల ప్రైవేటు కాలేజీల బండారం బయటపడింది. కాలేజీల్లో అధ్యాపకులే లేరనేది సుస్పష్టం. అయినా గుర్తింపు ఎలా ఇచ్చారో? –అయినేని సంతోష్‌కుమార్, తెలంగాణ సాంకేతిక కళాశాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు -
Telangana: చీఫ్ ఎగ్జామినర్లుగా జూనియర్లా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకన ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. దీనివల్ల మూల్యాంకనం, తద్వారా ఫలితాల వెల్లడి ఆలస్యం అయ్యే అవకాశం ఉందని బోర్డు వర్గాలు అంటున్నాయి. గత నెల 25 నుంచి మొదలైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 3వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం 40 లక్షలకు పైగా పేపర్లను అధికారులు మూల్యాంకనం చేసి, మార్కులు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడిస్తామన్న ధీమా కూడా అధికారులు వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే జిల్లా కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి మూల్యాంకన ప్రక్రియను పెద్ద ఎత్తున మొదలు పెట్టారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం, ఇతర అంశాల కారణంగా ఇంతవరకు వేగం పుంజుకోలేదు. మమ్మల్ని అవమానించడమే..: మూల్యాంకనం సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పలు వురు అధికారులు ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. కానీ అధికారుల మధ్య సమ న్వయం లోపించడంతో వీటిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని తెలిసింది. స్పాట్ వాల్యూయే షన్లో సీనియర్లకు కాకుండా, జూనియర్లకు ఎక్కు వగా బాధ్యతలు అప్పగించడం తొలిరోజే వివాదా స్పదమైంది. చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామి నర్లుగా జూనియర్లను వేయడం ఏమిటని సీనియర్ అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. సమస్య తలెత్తిన ప్పుడు పరిష్కరించడం వారికి కష్టమవుతుందని చెబుతున్నారు. ఇది తమను అవమానించడమేనని కొందరు అంటున్నారు. తాజా పరిణామాల ప్రభావం స్పాట్‌పై పడుతుందనే సందేహాలు ఉన్నతాధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరుతో విమర్శలు మూల్యాంకనం ఆలస్యమైతే, అధ్యాపకులు ఇదే విధుల్లో ఎక్కువ కాలం కొనసాగితే బోధన దెబ్బ తింటుందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. దాదాపు 40 లక్షల పేపర్లు కేవలం ప్రభుత్వ అధ్యాపకులే మూల్యాంకనం చేయడం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నారు. అయితే ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌కు పంపేందుకు యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదని, తమ విద్యార్థుల క్లాసులు దెబ్బతింటాయని చెబుతున్నారని బోర్డు అధికా రులు అంటున్నారు. కాగా అధికారుల తీరును ప్రభుత్వ అధ్యాపకులు తప్పుబడుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు నష్టం కలిగినా ఫర్వాలేదని, ప్రైవేటు కాలేజీలు మాత్రం సక్రమంగా జరగాలన్నట్టుగా ఇంటర్ బోర్డ్ అధికారులు వ్యవహరించడం దారుణమని అంటున్నారు. ప్రైవేటు అధ్యాపకులను మూల్యాం కనంలో భాగస్వాములను చేయని పక్షంలో వారం రోజుల్లో పూర్తవ్వాల్సిన మూల్యాంకన ప్రక్రియ మూడు వారాలు పడుతుందని చెబుతున్నారు. మూల్యాంకనం కొనసా గుతుంటే విద్యా బోధనపై దృష్టి పెట్టలేమని అంటున్నారు. కీలక సమయంలో మొదటి, ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. ‘స్పాట్’కు రాకుంటే చర్యలు సాక్షి, హైదరాబాద్: స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించిన ప్రతీ సిబ్బంది సంబంధిత క్యాంపు కార్యాలయాల్లో విధిగా రిపోర్ట్ చేయాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆదేశాలను పాటించనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకనం ఇప్పటికే మొదలైందని తెలిపారు. మొదటి విడత మూల్యాంకనంలో ప్రైవేటు కాలేజీల సిబ్బందిని తీసుకున్నా.. వారు చాలావరకు విధుల్లోకి రాలేదు. దీంతో, రెండోదశలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వాళ్లంతా వాల్యుయేషన్‌కు రావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశించింది. పూర్తయ్యే వరకూ సెలవు ఇవ్వాలి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇవ్వాలి. అప్పుడే మూల్యాంకనం త్వరగా పూర్తయి, ఫలితాలు సకాలంలో ఇవ్వొచ్చు. ఇంటర్ బోర్డ్‌లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మూల్యాంకన ప్రక్రియకు అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇది ప్రైవేటు కాలేజీలకు పరోక్షంగా సహకరించడమే. – మాచర్ల రామకృష్ణగౌడ్, కన్వీనర్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి రెగ్యులర్ అధ్యాపకులకు అవమానం మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులను అవమానించేలా ఇంటర్ బోర్లు వ్యవహరిస్తోంది. 60 శాతం కాంట్రాక్టు అధ్యాపకులను స్పాట్ వాల్యూయేషన్‌లో చీఫ్ ఎగ్జామినర్లుగా వేయడం, 40 శాతం రెగ్యులర్ వారిని వేయడం అవమానించడమే. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో మూల్యాంకన ప్రక్రియకు దూరంగా ఉంటాం. – తంగిరాల జగదీష్, రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్టీయూ -
దురాశకు పోయారు.. అడ్డంగా దొరికారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పక్కదారి పట్టారు. పరీక్షలు సరిగా రాయకుండానే అత్యధిక మార్కులు తెచ్చుకోవాలని దురాశకు పోయారు. పరీక్ష సమయంలో రాసిన జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం జేఎన్టీయూకేకు వెళ్లే సమయంలో మార్చేసి, వాటి స్థానంలో ప క్కాగా చూసి రాసిన జవాబు పత్రాలను పెట్టేద్దామని పథక రచన చేశారు. అందులో భాగంగా జేఎన్టీయూకే ఔట్ సో ర్సింగ్ సిబ్బందితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మూల్యాంకనం కోసం వెళ్లే జవాబు పత్రాల వాహనాల రాకపోకలు అన్నీ తెలిసిన శ్రీకాకుళం వాసి ప్లాన్ ప్రకారం మార్గ మధ్యలో ఆ విద్యార్థుల జవా బు పత్రాలు మార్చేశాడు. మూ ల్యాంకనం సమయంలో ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు నూరు శాతం పక్కా గా ఉండడంతో ఎగ్జామినేషన్ సిబ్బందికి అ నుమానం వచ్చింది. దాని తో పాటు జవాబు పత్రాలకు ముగ్గురు విద్యార్థుల హాల్ టిక్కెట్లు అతికించి ఉండటాన్ని గుర్తించారు. సాధారణంగా జవాబు పత్రాలకు హాల్‌టిక్కెట్లు అతికించి ఉండవు. అడ్డదారి పట్టిన విద్యార్థులు తొందరలో తమ హాల్ టిక్కెట్లను జవాబు పత్రాలకు పెట్టేశారు. (చదవండి: అసూయపడి.. ఉసురు తీసి) ఇంకేముంది అడ్డంగా దొరికిపోయారు. జేఎన్టీయూకే అధికారుల దృష్టికెళ్లాక పూర్తిగా ఆరా తీసే సరికి మొత్తం గుట్టు రట్టయ్యింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి శ్రీకాకుళం జిల్లా వాసే. ఈయన గతంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఎగ్జామినేషన్ విభాగంలో పనిచేసి మానేశాడు. గత ఏడాది నవంబర్‌లో బీటెక్ ప్రథమ సంవత్సర మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. విజయనగరం జిల్లా ప్రైవేటు కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జంబ్లింగ్‌లో భాగంగా విశాఖ జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలు రాశారు. పరీక్షలు అయ్యాక జవాబు పత్రాలను మూ ల్యాంకనం కోసం ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు లారీల ద్వా రా కాకినాడ జేఎన్టీయూకే వర్సిటీకు వెళ్లాయి. వర్సిటీ పరీక్షల విభాగానికి చెందిన సిబ్బంది లారీల ద్వారా వాటిని తీసుకు వెళ్లారు. అంతవరకు బాగానే ఉన్నా దానికి ముందు జరిగిన డీల్ ఏకంగా మార్గ మధ్యంలో జవాబు పత్రాలను మార్చేసే వరకు వెళ్లింది. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లో పనిచేసి మానేసిన రామ్మోహన్ అనే వ్యక్తి జేఎన్టీయూకే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో ఉన్న పరిచయాలను అడ్డగోలు వ్యవహారానికి వాడుకున్నాడు. (చదవండి: రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి) ముందుగా విజయనగరం ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను ట్రాప్ చేశాడు. పరీక్ష సమయంలో ఎలా రాసినప్పటికీ మూల్యాంకనం కోసం వెళ్లే స మయంలో వాటిని తీసేసి, నూరు శాతం పక్కాగా రాసిన జవాబు పత్రాలను పెట్టించే ఏర్పాటు చేస్తాన ని ముగ్గురు విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే వర్సిటీ సిబ్బంది, రామ్మోహనరావుతో కలిసి ముందస్తు పథకం ప్రకారం జవాబు పత్రాలను మార్చేశారు. వైజాగ్ దాటిన తర్వాత ఒప్పందం కు దుర్చుకున్న ముగ్గురు విద్యార్థుల జవాబు పత్రాలు మార్చారు. కాకపోతే పొరపాటున వారి హాల్ టి క్కెట్లు కూడా జవాబు పత్రాలతో ఉంచేశారు. జవా బు పత్రాలతో పాటు హాల్‌టిక్కెట్ కూడా జతపరిచి ఉండటం, రైటింగ్ చాలా అందంగా ఉండటంతో పా టు అన్ని ప్రశ్నలకు సక్రమంగా సమాధానాలు ఉండటంతో వర్సిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీనిపై సబ్జెక్టు నిపుణుల కమిటీ వేశారు. పరీక్ష రాసిన విద్యార్థులతో పాటు రామ్మోహన్‌ను విచారించడంతో నిజం బయటకు వచ్చింది. జవాబు పత్రాలు ఏ స మయంలో ఏ రకంగా వస్తాయన్నది ఎలా తెలిసింద ని రామ్మోహన్‌ను ఆరా తీసే సరికి గతంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేశానని, అప్పట్లో జేఎన్టీయూకే ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పరిచయాలు ఏర్పడ్డాయని, వారితో కలిసి ఈ రకంగా చేశామని రామ్మోహన్ సంబంధిత కంట్రోల్ ఎగ్జామినర్‌కు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి గుట్టు రట్టు అవడంతో అప్రమత్తమైన జేఎన్టీయూకే అధికారులు అప్రమత్తమై కాకినాడ పోలీసులకు ఫిర్యాదు చేశార తప్పు ఒప్పుకున్నారు నిపుణుల కమిటీ వేశాం. విద్యార్థులను, ఎగ్జామినేషన్ విభాగంలోని ఉద్యోగి రామ్మోహన్‌ను పిలిచి మాట్లాడాం. తప్పు చేశామని ఒప్పుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. జేఎన్టీయూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ముగ్గురిని విధుల నుంచి తొలగించాం. విద్యార్థులపైన, రామ్మోహన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – సత్యనారాయణ, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ -
నాడు ఉచితం.. నేడు కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకన విధులకు హాజరయ్యేందుకు నాడు ఉచితంగా ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు ఇప్పుడు ఆ చార్జీలను అధ్యాపకుల నుంచే వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా మూల్యాంకన విధులకు హాజరైనందుకు గాను అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్‌ను ఇంటర్ బోర్డు నిలిపివేసింది. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై అధ్యాపకులు, అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కష్టకాలంలోనూ పనిచేస్తే ఇదేం పని? కరోనా నేపథ్యంలో మూల్యాంకనం ఆగిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధ్యాపకులంతా గత నెలలో నిర్వహించిన మూల్యాంకనకు ప్రాణాలు తెగించి మరీ విధులకు హాజరయ్యారు. దాదాపు 16 వేలమంది మూల్యాంకన విధులను నిర్వర్తించారు. వారికోసం బోర్డు 362 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అందులో 25 మంది చొప్పున ప్రయాణించారు. అయితే ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణం చేయాల్సి ఉందని, 25 మందే ప్రయాణించినందున మిగతా 25 మందికి సంబంధించిన చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రత్యేక బస్సుల చార్జీలు సాధారణ చార్జీల కంటే నాలుగు రెట్లు ఉంటుందని, అందులో ఒక వంతు చార్జీలు అధ్యాపకుల దగ్గర్నుంచే వసూలు చేయాలని, అందుకే మూల్యాంకనం పూర్తయినా, ఇంకా విధులకు హాజరైన వారికి రెమ్యూనరేషన్ చెల్లించడం నిలిపివేస్తూ బోర్డు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా సబ్సిడీ భోజన ఖర్చు రూ. 2.5 కోట్లను కూడా మినహాయించాలని బోర్డు అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం పట్ల అధ్యాపక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మూల్యాంకన విధులకు హాజరైన వారిలో ప్రైవేటు అధ్యాపకులే ఎక్కువ మంది ఉన్నారు. కరోనా కారణంగా వారికి కాలేజీల నుంచి కూడా వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే పరిష్కరించాలి ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. ఇంటర్‌బోర్డు నిర్ణయంతో మూల్యాంకన విధులకు హాజరైన అధ్యాపకునికి రోజుకు వచ్చే రూ.1,500లలో రూ.800 వరకు చార్జీల కిందే పోయే ప్రమాదం ఉంది. బస్సు చార్జీలు, భోజన ఖర్చులు అధ్యాపకుల నుంచి వసూలు చేయకుండా, రెమ్యూనరేషన్ మొత్తాన్ని చెల్లించాలి. – ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ భౌతికదూరం తదితర జాగ్రత్తలతో సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మొత్తం 10.64 లక్షల మంది వివిధ కాంబినేషన్ల కోర్సులతో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు రాశారు. వీరికి సంబంధించి 60 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్య దర్శి ఎం.రామకృష్ణ తెలిపారు. రోజూ రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎగ్జామినర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున 30 పేపర్లు ఇస్తామని, పరిస్థితిని బట్టి వీటి సంఖ్య కొంత పెంచి మూల్యాంకనాన్ని త్వరగా ముగించి ఫలితాలు వెల్లడిస్తామనిì తెలిపారు. గతంలో జిల్లాకొకటి చొప్పున 13 మూల్యాంకన కేంద్రాలుండగా ఇప్పుడు వాటిని మొత్తం 46 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం, తూ.గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, ప.గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విజయనగరం జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
మూల్యాంకనం వాయిదాకు హైకోర్టు ‘నో’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనాన్ని వాయిదా వేసేందుకు హైకోర్టు అంగీకరించలేదు. లాక్డౌన్ పూర్తిగా తొలగించే వరకూ ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించరాదనే అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇంటర్ పరీక్షల ఫలితాలకూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్య ప్రవేశాలకు ముడిపడి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో మూల్యాంకనం వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. (ఏది పడితే అది పండించొద్దు: సీఎం కేసీఆర్) లాక్డౌన్ పూర్తయ్యే ఈ నెల 29 వరకూ మూల్యాంకనం నిర్వహించరాదని కోరుతూ సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ భోజన విరామ సమయంలో దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యాన్ని మంగళవారం ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలోని 9.65 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల పరీక్ష పత్రాలను మూల్యాంకనం చేసుకోవచ్చునని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. -
టీచర్ల ఇళ్లలోనే జవాబు పత్రాల మూల్యాంకనం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. -
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షా పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి సబితా గురువారమిక్కడ మాట్లాడుతూ గతంలో 12 వాల్యుయేషన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 కేంద్రాలకు పెంచామన్నారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ప్రయివేట్ స్కూల్స్ గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. (జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!) -
11 నుండి ఇంటర్ వాల్యుయేషన్
సాక్షి, అమరావతి: ఈ నెల 11 నుండి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్థులోని మంత్రి తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిన్ వి. రమేష్ లతో కలిసి మంత్రి 13 జిల్లాల ఆర్ఐఓలు, ఆర్జేడీలు, డీవీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. (సీబీఎస్ఈ సిలబస్ కుదింపు!) లాక్ డౌన్ అనంతరం రెడ్ జోన్ జిల్లాల్లో.. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి సూచన ప్రాయంగా తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్,ఎడ్ సెట్, లా సెట్, పీఈసెట్ తదితర పోటీపరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి.. రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరంలో 5,18,280 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మొత్తంగా 10,64,442 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరయినట్లు పేర్కొన్నారు. వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ప్రత్యేకంగా గుర్తించిన రెండు, మూడు భవనాలను మూల్యాంకన కార్యకలాపాలకు వినియోగించనున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. మార్గదర్శకాలు పాటించాలి.. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో షిప్టులో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు ప్రతిరోజూ మూల్యాంకనం చేయాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో సంబంధింత అధికారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భరోసానిచ్చారు. మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. మూల్యాంకన ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. తొలుత ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో ఈ మూల్యాంకన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. వారికి మినహాయింపు ఇవ్వాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారామ్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యదర్శి వి.రవి 55 ఏళ్లకు పైబడిన వారికి మూల్యాంకన ప్రక్రియలో మినహాయింపు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ నిబంధనల ప్రకారమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జూన్ చివరి నాటికి ఇంటర్మీడియట్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలు పొందుపరుచనున్నామని తెలిపారు. దీనికి జోన్-4 కడప జిల్లా ఆర్జేడీ కె.చంద్రశేఖర్ ఇన్ చార్జిగా వ్యవహరించనున్నారని వెల్లడించారు. -
డీఎడ్ పేపర్ వాల్యూయేషన్ బహిష్కరణ
సాక్షి, గుంటూరు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ ఎడ్) ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన 130 మందికి పైగా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అధ్యాపకులు గతేడాది డీఎడ్ ద్వితీయ సంవత్సర మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూరేషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. రెమ్యూనరేషన్ బకాయిలు చెల్లించిన తరువాతే మూల్యాంకన విధుల్లో పాల్గొంటామని అక్కడే ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ మాణిక్యాంబకు స్పష్టం చేసి, వాల్యూయేషన్ విధులను బహిష్కరించారు. అనంతరం క్యాంప్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్ విధులకు హాజరైన అధ్యాపకులు బి.వెంకటేశ్వరరావు, మరియదాసు, టి.దాసు, రాజ్‌కుమార్ మాట్లాడుతూ గతేడాది వాల్యూయేషన్ చేసిన అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఫలితంగా తాజాగా డీఎడ్ ప్రథమ సంవత్సర వాల్యూయేషన్ విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతేడాది వాల్యూయేషన్ విధుల్లో పాల్గొన్న 177 మంది అధ్యాపకులకు డీఏతో పాటు పేపర్ వాల్యూయేషన్‌కు కలిపి మొత్తం రూ.9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని తెలిపారు. డీఈవో హామీతో ఆందోళన విరమణ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో ఆర్.ఎస్.గంగా భవానీ అక్కడకు చేరుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతేడాదికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చెల్లింపులు జరగని మాట వాస్తవమేనని, బకాయిలను 20 రోజుల్లోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన అధ్యాపకులు తిరిగి వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకూ వాల్యూయేషన్ జరగనుంది. -
మూల్యాంకనంలో మొబైల్ వాడొద్దు!
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో పేపర్లు దిద్దే సమయంలో ఎవరైనా సెల్‌ఫోన్ మాట్లాడితే కఠి న చర్యలు తీసుకుంటామని ఆర్జేడీ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి హెచ్చరిం చారు. మూల్యాంకన కేంద్రాలైన మున్సిపల్ హైస్కూల్ తో పాటు, ఉర్దూ బాలుర నగరకోన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పేపర్లు ఏ విధంగా మూల్యాంకనం చేస్తున్నారు, వసతులు ఎలా ఉన్నాయనే దానిపై పరిశీలించారు. ఇదే సమయంలో మొయిన్, ఉర్దూ హైస్కూల్లోని మూల్యాం కన కేంద్రాలలో ఇద్దరు సెల్‌ఫోన్ మాట్లాడుతూ పేపర్లు దద్దుటాన్ని గమనించిన ఆర్జేడీ షోకాజ్ నోటీసులను ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మెయిన్ స్కూల్ కేంద్రంలో ఒకరు టోటల్ మార్కులను సక్రమంగా వేయకపోవడాన్ని గమనించి షోకాజ్ నోటీసులను ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలన్నారు. మూల్యాంకనంలో పర్యవేక్షించే అధికారులు కూడా సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఆర్జేడీ వెంట డీఈఓ శైలజ, డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డి, డిప్యూటీ ఈఓలు ఉన్నారు. -
హాల్‌టికెట్, బుక్లెట్ నంబర్ల వంటి తప్పులు విస్మరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు పరీక్ష సమయంలో హాల్‌టికెట్ నంబర్, బుక్లెట్ నంబర్, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినంత మాత్రాన వారి సమాధానపత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బబ్లింగ్ ద్వారా వివరాలు పూరించేటప్పుడు చేసే పొరపాట్లకు, అభ్యర్థుల ప్రతిభకు సంబంధం లేదని పేర్కొంది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేసిన అభ్యర్థుల సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అనంతరం వారి మార్కులను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం కీలక తీర్పు వెలువరించారు. ఏమిటీ వివాదం..? రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల భర్తీ నిమిత్తం టీఎస్పీఎస్సీ ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. రాతపరీక్ష నిర్వహించింది. పరీక్ష సమయంలో పలువురు అభ్యర్థులు బబ్లింగ్ (సున్నాను పెన్నుతో నింపడం) ద్వారా బుక్లెట్ నంబర్, హాల్‌టికెట్ నంబర్‌ను పూరించేటప్పుడు, వ్యక్తిగత వివరాలను నమోదు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేశారు. దీంతో అధికారులు ఆ సమాధాన పత్రాలను మూల్యాంకనానికి పంపకుండా పక్కన పెట్టేశారు. ఆ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఇన్విజిలేటర్ ఏ సిరీస్ బుక్‌లెట్‌కు బదులు బీ సిరీస్ బుక్లెట్ ఇచ్చారని.. ఇందులో తన తప్పులేదంటూ ఓ అభ్యర్థి సర్వీస్ కమిషన్ అధికారులకు తెలిపారు. మిగతా అభ్యర్థులు కూడా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని, తమ సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయా లని కోరారు. దీనిపై టీఎస్పీఎస్సీ స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇలా దాఖలైన నాలుగు వ్యాజ్యాలపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు.. అభ్యర్థుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పొరపాటు మానవ సహజం..! తరువాత ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు తుది విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లది ఉద్దేశపూర్వక తప్పు కాదని కోర్టుకు విన్నవించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి గురువారం ఉదయం తీర్పు వెలువరించారు. పొరపాటు మానవ సహజమని అందులో పేర్కొన్నారు. పిటిషనర్లు చేసిన పొరపాట్లన్నీ కూడా కేవలం హాల్‌టికెట్, బుక్లెట్ బబ్లింగ్ తదితరాలకు సంబంధించినవి మాత్రమేనని... ఇవి వారి ప్రతిభను ప్రభావితం చేసేవి కానప్పుడు వాటిని విస్మరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లుగా ఉన్న అభ్యర్థుల సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి అంశాలపైనే గతంలో పిటిషన్లు దాఖలైనప్పుడు హైకోర్టు ధర్మాసనాలు కొట్టివేశాయని çపబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొనగా.. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆ ధర్మాసనాలు ట్రిబ్యునల్ ఉత్తర్వులను సమర్థించాయే తప్ప, ఎటువంటి కారణాలను రాయలేదని స్పష్టం చేశారు. ఇటువంటి కేసుల్లో ఎలా వ్యవహరించాలో ధర్మాసనాల నుంచి ఎటువంటి మార్గదర్శనం లేదని, అందువల్ల ఆ తీర్పులను తాను అనుసరించడం లేదని జస్టిస్ రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు. అవకాశాన్ని దూరం చేయొద్దు.. ‘‘ఉద్యోగం అనేది చాలా మందికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం. కావాలని చేయని పొరపాటును కారణంగా చూపుతూ ఆ అవకాశాన్ని వారి నుంచి దూరం చేయడానికి వీల్లేదు. ఉద్యోగం కోసం నిర్వహించే పరీక్షల్లోనైనా, కాలేజీల్లో సీట్ల భర్తీకోసమైనా పోటీతత్వం ఉంటుంది. చేయని పొరపాటు ఆధారంగా ఆ పోటీ నుంచి ఆయా వ్యక్తులను దూరం చేయడం సరికాదు. ఆ పొరపాటు ప్రతిభకు సంబంధించిన వ్యవహారం కానప్పుడు.. దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో చూడాలి. చేసిన పొరపాటు బుక్లెట్ నంబర్, ప్రశ్న నంబర్, హాల్ టికెట్ నంబర్, వ్యక్తిగత వివరాల నమోదుకు సంబంధించినది అయితే.. దానికి, అభ్యర్థి ప్రతిభకు ఎలాంటి సంబంధం లేదు. పరీక్షా హాలులో అభ్యర్థుల మానసిక స్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పొరపాట్లు చేసేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ పొరపాట్లు ప్రతిభను ప్రభావితం చేయనివి అయితే.. వాటిని విస్మరించి, ఇతరులతో పోటీ పడేందుకు వారికి మరో అవకాశం ఇవ్వొచ్చు..’’ – న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు -
మూల్యాంకనంలో అక్రమాలకు చెక్
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్కుల కేటాయింపుపై నిఘా అంతర్గతంగా తప్పులు తేలితే చర్యలు జనవరిలో నోడల్ బృందాలతో తనిఖీలు ఆసిఫాబాద్ రూరల్ : పదో తరగతి అంతర్గత మూల్యాంకనంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రైవేటు పాఠశాల అక్రమాలకు ముక్కుతాడు వేసేందుకు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పాఠశాల విద్య సంచాలకులు తాజాగా ఆర్సీ సంఖ్య 92/డీఎస్ఈ /అకాడమిక్ /2016, తేదీ 23–12–2016 ఉత్తర్వులు విడుదల చేశారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మార్కుల అవార్డులను తనిఖీలు చేసేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహంచాలని డీఈవోలను ఆదేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. 2014–15 నుంచి నిరంతర మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్న విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు విద్యాసంవత్సరంలో పాఠశాల స్థాయిలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తోంది. ఇందులో నిర్మాణాత్మక మూల్యాంకనలో మార్కులు అవార్డు చేయడం పూర్తిగా ఉపాధ్యాయులు చేతుల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల సంగతెలా ఉన్నా..ప్రైవేటు పాఠశాలల వారు ర్యాంకులకు కక్కుర్తి పడి తమ విద్యార్థులకు అధిక మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి అక్రమాలకు తావులేకుండా రెండు దఫాలుగా నోడల్ బృందాలు తనిఖీలు నిర్వహించేందుకు 2017 జనవరి రెండో వారంలో పాఠశాలలను సందర్శించనున్నాయి. నైపుణ్య బృందాలు ఏం చేస్తాయంటే.. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి ఆ జిల్లాలోని అనుభవజ్ఞులైన ఓ ప్రధానోపాధ్యాయుడు, విషయ నిపుణులైన ఆరుగురు ఉపాధ్యాయులతో కూడిన నైపుణ్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బృందంలో జిల్లాలోని 20 పాఠశాలలను సందర్శించి పదో తరగతికి ఇప్పటి వరకు జరిగిన మూడు (ఎఫ్ఏ3 వరకు)నిర్మాణాత్మక మూల్యాంకన రికార్డులను పరిశీలిస్తుంది. మార్కులు సక్రమంగా వేశారా లేదా అనేది ప్రత్యేకంగా చూస్తుంది. పొరపాట్లను సరిచేస్తుంది కమ్యూలేటివ్ రికార్డుల్లో నమోదును పరిశీలించి ధృవీకరిస్తుంది. ఎస్ఏ1 మూల్యాంకన జవాబు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలన అంశాలను ఫొటోలు తీసి పరీక్షల సంచాలకులకు పంపిస్తారు. నైపుణ్య బృందాలతోపాటు డీఈవో జిల్లాలో అందుబాటులో ఉన్న నిపుణుడైన ఓ ప్రధానోపాధ్యాయుడిని మానిటరింగ్ నోడల్ అధికారిగా నియమిస్తారు. ఈ నోడల్ అధికారి విషయ నిపుణుల బృందాలకు పాఠశాలలను కేటాయించడం, ప్రణాళికలను సిద్ధం చేయడంలో డీఈవోకు సహాయకారిగా ఉంటారు. నియమించిన జిల్లాలోని మానిటరింగ్ బృందాలకు, నోడల్ అధికారి డీఈవోలకు ఈ నెల 30న ఎస్సీఈ ఆర్టీ విషయ నిపుణులు, రాష్ట్ర రిసోర్సు బృందంతో దృశ్య శ్రవణ మాద్యమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ బృందాలు పాఠశాలల్లో పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి తనిఖీలు చేయాల్సి అంశాలను వివరిస్తారు. సందేహాలు ఉంటే తీరుస్తారు. శిక్షణ పొందిన బృందాలు 2017 జనవరి రెండో వారంలోపు పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహిస్తారు. ఎంఈవో వీరి వెంట ఉంటారు. ∙ఈ బృందాలు ఫిబ్రవరిలో రెండోసారి పాఠశాలలను సందర్శించి 4వ నిర్మాణాత్మక మూల్యంకన (ఎఫ్ఏ4)మార్కులు /గ్రేడ్లు రికార్డులను పరిశీలిస్తుంది. తుది 20 మార్కుల నమోదును పరిశీలించి ధ్రువీకరిస్తుంది. ∙ఈ విషయంలో ఆర్జేడీలు ప్రతీ జిల్లాలో ఐదు పాఠశాలలను సందర్శించి మూల్యాంకన తనిఖీలు చేస్తారు. ∙రాష్ట్ర మానిటరింగ్ బృందాలు సైతం ఫిబ్రవరిలో తనిఖీలు చేసి రూడీ చేసుకుంటారు. -
డిగ్రీ ముల్యాంకనంలో ముసలం!
- చీఫ్‌ల నియామకంలో వివాదం - ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు - ముల్యాంకనాన్ని బహిష్కరించిన ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు - రెండు రోజులుగా నత్తనడకన గణితం, కెమిస్ట్రి సబ్జెక్టుల ముల్యాంకనం కర్నూలు సిటీ: రాయల సీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీ సెమిస్టర్ పరీక్షల ముల్యాంకనంలో ముసలం పుట్టింది. బి క్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనం పర్యవేక్షణ కోసం చేపట్టిన చీఫ్‌ల నియమాకాలకు సంబంధించి ప్రభుత్వం, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీల అధ్యాపకుల మధ్య వివాదం చేలరేగింది. దీంతో ఎయిడెడ్, ఆన్ఎయిడెడ్ కాలేజీలకు చెందిన గణితం, రసాయన శాస్త్రాల అధ్యాపకులు విధులను బహిష్కరించడం చర్చనియాంశంగా మారింది. ఈ నెల 10 తేదీ నుంచి మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల మూడవ దశ కింద జువాలజి, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన ముల్యాంకనం జరుగుతోంది. స్పాట్ ఎవాల్యుయేషన్ జరుగుతున్న కేంద్రమైన పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతున్ క్యాంపు ఆఫీసర్‌గా ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా ఉన్న వారిలో ఒక్కరు స్ట్రాంగ్ రూంకు, మరొకరు ఎవాల్యుయేషన్ జరిగే కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. ప్రతి సబ్జెక్టు ఎవాల్యుయేషన్కు హాజరయ్యే అసిస్టెంట్ ముల్యాంకన అధికారుల సంఖ్యను బట్టీ ప్రతి ఐదుగురిలో ఒకరిని చీఫ్ ఎవ్యాలుయేషన్గా నియమించాలి. కానీ అసిస్టెంట్ క్యాంపు అధికారి యూనివర్సిటీ నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తక్కువ సర్వీస్ ఉన్న వారిని నియమించారనే విమర్శలున్నాయి. ఈ కారణంతోనే ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు స్పాట్ విధులను బహిష్కరించినట్లు వారు చెబుతున్నారు. రాయల సీమ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ డీగ్రీ కాలేజీలు 14, ఎయిడెడ్ కాలేజీలు 10, ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ కాలేజీలు 71, లా కాలేజీ 1 ప్రకారం మొత్తం 96 కాలేజీలున్నాయి. ఇవీ నిబంధనలు... - ఏ యూనివర్శిటీ పరిధిలోనైనా పరీక్షల ముల్యాంకనానికి వెళ్లేందుకు బోధనలో ఒకే కాలేజీలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. - వీరిని అసిస్టెంట్ ఎవాల్యుయేషన్‌గా పరిగణించాలి. - ప్రభుత్వ, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి బోధనలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని చీఫ్ ఎవాల్యుయేషనర్(సీఈ)గా నియమించాలి. ప్రస్తుతం ఈ అనుభవాన్ని పదేళ్లకే కుదించారు. ప్రస్తుతం ఇలా పాటిస్తున్నారు...! -చీఫ్ ఎవాల్యుయేషనర్లుగా 40 శాతం ప్రభుత్వం కాలేజీల వారు, 60 శాతం ఎయిడెడ్ అధ్యాపకులు ఉండాలనే నిబంధన తెచ్చారు. - 10 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వారిని కాదని, మూడేళ్ల అనుభవం ఉన్న ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులను సీఈలుగా నియమించారు. సీఈలుగా అనుభవం లేని వారిని నియమించారు - పి.వి భాస్కర్‌రెడ్డి, గణితం శాస్త్ర అధ్యాపకులు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనంలో నిర్దిష్ట అనుభవం లేని వారిని సీఈలుగా నియమిస్తున్నారు. సీఈలుగా 40 శాతం ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులే ఉండాలని అసిస్టెంట్ క్యాంపు అధికారి చెబుతున్నారు. నిబంధనలు విరుద్దంగా చేయడం వల్లే ముల్యాంకనాన్ని బహిష్కరించాం. సబ్జెక్టు బోర్డు చైర్మన్లను సంప్రదించకుండానే.... -ఎం.వి.ఎన్.వి ప్రసాద్ గుప్తా, రసాయన శాస్త్ర అధ్యాపకులుl సబ్జెక్టు బోర్డులోని సీనియర్స్‌తో సంప్రదించకుండానే సీఈ, ఏఈ టీంలను తయారు చేస్తున్నారు. అసిస్టెంట్ క్యాంపు అధికారుల తీరు మార్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల విబాగం కంట్రోలర్లు స్పందించాలి. ఆన్ ఎయిడెడ్ వారి కోసమే.. - డా. యన్ రంగారెడ్డి, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే నియమించాం. ఆన్ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను కూడా సీఈలుగా నియమించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా చేయలేమని చెప్పడంతోనే గణితం, రసాయన శాస్త్రం ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు వెళ్ళిపోయారు. ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను సీఈలుగా నిబంధనలకు విరుద్దంగా చేయడం కుదరదనే చెప్పాం. -
వెబ్సైట్లో మూల్యాంకన విధివిధానాలు
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): ఎస్సీఈఆర్టీ తయారు చేసిన సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన విధివిధానాలను డీఈఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో ప్రధానోపాధ్యాయులు/కరస్పాండెంట్లను కోరారు. ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యంకన విధివిధానాలు ఉన్నాయన్నారు. అంతేకాక ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల బండిళ్లను ఈనెల 13వ తేదీలోపు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఆదేశించారు. -
మూల్యాంకనంలో మాయాజాలం
ఐసీటీ సబ్జెక్టులో వందకు 92 మంది ఫెయిల్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం యూజీ విభాగం ఎదుట ధర్నా వర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలి తాలు గత వారం విడుదలయ్యా యి. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ) సబ్జెక్టులో ప్రతి 100 మంది విద్యార్థులకు 92 మందిని ఫెయిల్ చేశారు. మిగిలిన సబ్జెక్టుల్లో వీరు 70 నుంచి 80 శాతం మార్కులు సాధించినవారే. ఫలితాల్లో కేవలం 19 ఉత్తీర్ణత శాతం (అన్ని సబ్జెక్టుల్లో) నమోదు కావడానికి ఐసీటీ సబ్జెక్టు మూల్యాంకనంలో నిర్లక్ష్యమే కారణమని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేవలం 9 శాతం మంది మాత్రమే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత చెందారు. మిగిలినవారందరూ ఐసీటీలో ఫెయిల్ అయ్యారు. దీనిపై అధ్యాపకులు వర్సిటీ యూజీ డీన్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అనివార్య పరిస్ధితి. ఇంటర్నల్ మార్కులు తెచ్చిన తంటా : డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్లో ఇంటర్నల్ మార్కులు న మోదు చేయకుండా ఫలితాలు ప్రకటించారు. అ నుబంధ డిగ్రీ కళాశాలల సిబ్బంది ఇంటర్నల్ మార్కులు పంపడంలో నిర్లక్ష్యం చేశారు. కొందరు పంపినా నమోదులో యూజీ అధికారుల తాత్సారం కారణంగా వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లా నలుమూలల నుంచి డిగ్రీ విద్యార్థులు సోమవారం ఎస్కేయూకు తరలివచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యూజీ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ, యూజీ డీన్ జీవన్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ శ్రీరాములు నా యక్ విద్యార్థులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొన్ని కళాశాలల సిబ్బంది ఇంటర్నల్ మార్కులు పంపక పోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య వెంకటరమణ అన్నారు. 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్ విద్యార్ధి విభాగం నాయకులు జయచంద్రా రెడ్డి, క్రాంతికిరణ్, భానుప్రకాష్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాన్సన్, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు జయపాల్ యాదవ్, కే.మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మూల్యాంకనం
మొదలైన పీయూసీ పేపర్ కరెక్షన్ బెంగళూరు: పీయూసీ జవాబు పత్రాల మూల్యాంకనం ఎట్టకేలకు బుధవారం ప్రారంభమైంది. దీంతో విద్యార్థులతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. వేతన పెంపు, వేతనాల తారతమ్య పరిష్కారం కోసం కుమార్‌నాయక్ నివేదిక అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం గత 18 రోజులగా పీయూసీ లెక్చరర్లు మూల్యాంకనాన్ని బహిష్కరించి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వీరితో పలుమార్లు చర్చలు జరిపి ఒక ఇంక్రిమెంట్ పెంపునకు ముందుకు వచ్చినా ఫలితం లేకపోయింది. అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్వచ్ఛందంగా నిరసననను విరమించిన లెక్షరర్లు మూల్యాంకన ప్రక్రియకు హాజరయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 46 కేంద్రాలలో 20,500 మంది లెక్చరర్ల ద్వారా జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ పీయూ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య మాట్లాడుతూ...‘మే 4,5 తేదీల్లో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సుల ప్రవేశానికి అవసరమైన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీఈటీ) జరగనుంది. అంతకు ముందే అంటే మే 2 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రభుత్వం మాకు సహకరించకున్నా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మేము నిరసన దీక్షను విరమించాం.’ అని పేర్కొన్నారు. -
మూల్యాంకనం బహిష్కరణ
సుప్మా ఆధ్వర్యంలో నిరసన కమాన్‌చౌరస్తా: ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు తక్షణమే విడుదల చేయాలని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రైవేట్ డిగ్రీ, పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ (సుప్మా) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మూల్యాంకనం బహిష్కరిస్తామని ఆ సంఘం నాయకులు హెచ్చరించారు. యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం నిరసన వ్యక్తం చేసి రిజిస్ట్రార్ ఎం. కోమల్రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం పరీక్షల నియంత్రణాధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యే వరకు యూనివర్సిటీ ఎలాంటి ఫీజులను డిమాండ్ చేయొద్దని, విద్యార్థులకు రెగ్యులర్, బ్యాక్లాగ్ సబ్జెక్టులకు ఒకే హాల్‌టికెట్ అందించాలని కోరారు. సుప్మా అధ్యక్షుడు వి. సతీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేంకటేశ్వర్రావు, ప్రతినిధులు పి. వేణు, వి. రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పల్-యాదాద్రి ‘మెట్రో’కు స్థల పరిశీలన
-
రూల్స్.. రివర్స్..!
కేయూ, దూరవిద్య కేంద్రం బాగోతం ఫీజులు చెల్లించకుండానే పీజీ పరీక్షల నిర్వహణ నకిలీ హాల్ టికెట్లతో ఎంవోయూ సెంటర్ నిర్వాకం నామినల్ రోల్స్‌లో పేర్లు ఉన్న విద్యార్థుల ప్రశ్నపత్రాలనే మూల్యాంకనం చేయూలి. కానీ.. ఇక్కడ ఇవేమీ పట్టించుకోకుండా ప్రొవిజనల్, మెమోలు సిద్ధం చేస్తున్నారు..! ఇక.. ఎక్కడైనా అడ్మిషన్, టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతారుు. ఆ తర్వాత నామినల్ రోల్స్‌లో పేర్లు నమోదవుతారుు. ఈ మేరకు సదరు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. కానీ.. ఇక్కడ పరీక్షలు రాసిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటున్నారు..! కేయూ, దూరవిద్య కేంద్రంలో నిరాటంకంగా సాగుతున్న ఈ తంతు కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే నిదర్శనం.. కొనసాగుతున్న అక్రమ బాగోతం ఇది. నకిలీ హాల్‌టికెట్లతో పరీక్షలు రారుుంచిన సదరు ఎంఓయూ స్టడీ సెంటర్‌పై చర్యలు తీసుకోకుండా.. ప్రేమ ఒలకబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కేయూ దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ డిగ్రీ కాలేజీ ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ స్టడీ సెంటర్లో 2011-12 అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కొందరు ప్రథమ సంవత్సరం పూర్తి చేశాక.. ద్వితీయ సంవత్సరం 2012-2013 అడ్మిషన్లకు సంబంధించి దూరవిద్యా కేంద్రానికి ఎలాంటి టర్మ్, పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ మేరకు వారికి యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ, సంబంధిత ఎంఓయూ సెంటర్ యూజమాన్యం.. ఫీజు చెల్లించని వారిలో కొందరు విద్యార్థులకు 2013లో నిర్వహించిన పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది. అదీ.. నకిలీ హాల్‌టికెట్లను సృష్టించి, నామినల్ రోల్స్‌లో పేరు లేని అభ్యర్థులకు అందజేసి పరీక్షలు రాయించారు.ఆయా జవాబుపత్రాలను కేయూ పరీక్షల విభాగానికి పంపారు. నిబంధనల ప్రకారం నామినల్ రోల్స్‌లో పేరు లేని విద్యార్థుల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకూడదు. ఇదేమీ పట్టని కేయూ పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ఫలితాలను నిలిపివేశారు. దీంతో తాండూరు స్టడీసెంటర్ యాజమాన్యం పలు సార్లు కేయూ పరీక్షల విభాగం అధికారుల చుట్టు తిరిగారు. ఫీజులు చెల్లించకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించడం నిబంధనలకు విరుద్ధమని, ఫలితాలు ప్రకటించేది లేదని కొద్దిరోజులుగా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదోలా సదరు ఎంఓయూ సెంటర్ నిర్వాహకులు.. కేయూ పరీక్షల విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. కొందరు విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్‌కు లేఖపెట్టుకున్నారు. చివరకు ఒక్కో అభ్యర్థి రూ.7,200 ఫీజు చెల్లిస్తూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని ఒప్పందానికి వచ్చారు. దీంతో రెండు రోజులుగా విద్యార్థులు దూరవిద్యా కేంద్రానికి ఫైన్‌తో సహా టర్మ్ ఫీజు చెల్లించి, కేయూలో ప్రొవిజనల్, మెమోలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను తీసుకున్నారు. ఇందులో ఏడుగురు ఎంఏ సోషియాలజీ, ఒకరు ఎంఏ పోలిటికల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. సదు ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇలా 50 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇక్కడ నకిలీ హాల్‌టికెట్లతో పరీక్ష రారుుంచిన ఎంఓయూ సెంటర్‌పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం.. పరీక్షలు రాసిన తర్వాత దూరవిద్యా కేంద్రం అధికారులు అడ్మిషన్లు తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.