కాకినాడలోని మూల్యాంకన కేంద్రంలో సిబ్బంది శారీరక ఉష్ణోగ్రత పరిశీలిస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ భౌతికదూరం తదితర జాగ్రత్తలతో సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభమైంది. మొత్తం 10.64 లక్షల మంది వివిధ కాంబినేషన్ల కోర్సులతో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పరీక్షలు రాశారు. వీరికి సంబంధించి 60 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్య దర్శి ఎం.రామకృష్ణ తెలిపారు.
రోజూ రెండు షిఫ్టుల్లో మూల్యాంకనం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఎగ్జామినర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 చొప్పున 30 పేపర్లు ఇస్తామని, పరిస్థితిని బట్టి వీటి సంఖ్య కొంత పెంచి మూల్యాంకనాన్ని త్వరగా ముగించి ఫలితాలు వెల్లడిస్తామనిì తెలిపారు. గతంలో జిల్లాకొకటి చొప్పున 13 మూల్యాంకన కేంద్రాలుండగా ఇప్పుడు వాటిని మొత్తం 46 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో 6 కేంద్రాలు, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు, ప్రకాశం, తూ.గోదావరి జిల్లాల్లో 4 చొప్పున, శ్రీకాకుళం, విశాఖ, ప.గోదావరి, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 3 చొప్పున, విజయనగరం జిల్లాలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment