న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment