CBSE Results
-
Sreeja: ఈ బిడ్డ గెలుపు ఆ తండ్రికి కనువిప్పు!
ఏ తల్లిదండ్రులకైనా కన్నబిడ్డల విజయం అనేది ఒక కల.. అది అందుకున్న వేళ మధుర క్షణంగా మిగిలిపోతుంది కూడా. కానీ, ఆ తండ్రికి మాత్రం అదొక కనువిప్పు.. అలాంటి తండ్రులకు ఓ మంచి గుణపాఠం. కారణం.. పసికందుగా ఉన్నప్పుడే ఆమెను నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లిపోయాడు కాబట్టి. తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం మార్కులు సంపాదించుకుంది బీహార్ పాట్నాకు చెందిన శ్రీజ. పసితనంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. అయితే ఆమె అలనా పాలనా చూడాల్సిన కన్నతండ్రి.. కర్కశంగా వ్యవహరించాడు. ఆ చిన్నారి ఖర్చులు భరించడం తన వల్ల కాదంటూ.. పైగా ఆడబిడ్డ అనుకుంటూ నిర్లక్ష్యంగా ఇంట్లో ఒక్కదానినే వదిలేసి వెళ్లిపోయాడు. చిన్నారి శ్రీజ ఏడ్పు విని స్థానికులు.. ఆమె అమ్మ తరపు బంధువులకు సమాచారం అందించారు. విషయం తెలిసి అమ్మమ్మ శ్రీజను అక్కున చేర్చుకుంది. తాతా అమ్మమ్మలే పెంచి.. చదివించారు. ఏళ్లు గడిచాయి.. ఇప్పుడు తన మనవరాలు సాధించిన విజయంతో ఆ అమ్మమ్మ మురిసిపోతోంది. ‘‘నా కూతురు చనిపోయాక మా అల్లుడు శ్రీజను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతన్ని మేం చూడనే లేదు. మరో వివాహం చేసుకున్నాడని మాత్రమే తెలుసు. ఈ ఫలితం చూస్తే.. అతను కచ్చితంగా తన నిర్ణయానికి పశ్చాత్తాపం చెందుతాడని అనుకుంటున్నా’ అని ఆ అమ్మమ్మ అంటోంది. त्याग और समर्पण की अद्भुत दास्ताँ! माँ का साया हटने पर पिता ने जिस बेटी का साथ छोड़ दिया उसने नाना-नानी के घर परिश्रम की पराकाष्ठा कर इतिहास रच दिया। बिटिया का 10वी में 99.4% अंक लाना बताता है कि प्रतिभा अवसरों की मोहताज नहीं है। मैं आपके किसी भी काम आ सकूँ, मेरा सौभाग्य होगा। pic.twitter.com/ufc3Gp4At9 — Varun Gandhi (@varungandhi80) July 24, 2022 మరోవైపు ఈ సక్సెస్‌పై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. శ్రీజకు ఏ విధంగా అయినా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఆయన. మరోవైపు ఇంటర్నెట్ సైతం ఆ చిన్నారి విజయంపై హర్షం వ్యక్తం చేస్తోంది. మానసికంగా ధైర్యంగా ఉండి.. మంచి చదువుతో విజయం సాధించిన శ్రీజకు.. ఆమెకు అండగా నిలిచిన అమ్మ తరపు కుటుంబానికి అభినందనలు తెలియజేస్తోంది. పుస్తకాల పురుగు అయిన Sreeja శ్రీజ.. అలాగని గంటల తరబడి పుస్తకాలకే అంకితమై పోయేది కాదట. చదువుతో పాటు ఆటపాటలు, ఇతర వ్యవహారాలను చాలా సమానంగా చూసుకునేదట. పరీక్షకు ముందు.. పాత ప్రశ్నాపత్రాలను తిరగేయడం, వాటిని సాల్వ్ చేయడం చేస్తూ వెళ్లాను అని అంటోంది ఆమె. ప్రస్తుతం పదకొండవ తరగతి కోసం శ్రీజ DAV-BSEBలో అడ్మిషన్ తీసుకుంది కూడా. -
CBSE Results:టెన్త్‌లో కుమార్తెకు 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి!
చండీగఢ్: తమ పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి? హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. నెలకి రూ.20వేల స్కాలర్షిప్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్షిప్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్‌ను అధికారిక వెబ్సైట్ www.cbse.gov.in/ లేదా cbseresults.nic.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయమే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకే రోజు సీబీఎస్ టెన్త్, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 94.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా 95.21 శాతంగా ఉంటే.. బాలుర ఉత్తీర్ణత 93.80 శాతంగా ఉంది. ట్రాన్స్ జండర్లు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే టాపర్స్ జాబితాను సీబీఎస్ఈ విడుదల చేయలేదు. 11.32 శాతం విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా.. 3.10 శాతం విద్యార్థులు 95 శాతం స్కోర్ చేశారు. కాగా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరిగిన విషయం తెలిసిందే. -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది
సాక్షి, వెబ్‌డెస్క్: పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయరు. ప్రతీది వారి ముందుకే తెచ్చిపెడతారు. ఏమంటే.. పిల్లలు ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఆ ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది పరీక్షల ముందు ఏకంగా అమ్మానాన్న మరణిస్తే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. పరీక్షల్లో పాసవ్వడం సంగతి అటుంచి.. అసలు చాలా మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విద్యార్థిని అందుకు భిన్నం. తల్లిదండ్రులను కోల్పోయాననే బాధ వెంటాడుతున్నప్పటికి.. వారు తనమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే తన బాధ్యత అనుకుంది. మరింత దీక్షగా చదివి.. టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని స్టోరి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. బుధవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలోల మధ్యప్రదేశ్‌కు చెందిన వనీషా పఠాక్ టాపర్‌గా నిలిచింది. స్కూల్ యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నప్పటికి.. పెద్దగా సంతోషించలేకపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో తన పక్కనే ఉండి.. తన విజయంలో పాలు పంచుకుని.. తన కన్నా ఎక్కువగా మురిసిపోవాల్సిన తన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ఫస్ట్ వచ్చిన సంతోషం కంటే.. అమ్మనాన్న లేరనే విషయమే వనీషాను ఎక్కువ బాధిస్తుంది. తల్లిదండ్రులతో వనీషా పఠాక్ (ఫైల్ ఫోటో) ఈ సదర్భంగా వనీషా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోతాహిస్తూ ఉండేవాళ్లు. జీవితాంతం నన్ను పోత్సాహిస్తూనే ఉంటారు. నా పరీక్షల ముందే వారిద్దరికి కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు. నేను చివరి సారిగా ఈ ఏడాది మే 2న మా అమ్మతో మాట్లాడాను. మే 4న ఆమె చనిపోయారు. అప్పటికే మా నాన్న కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ మా బంధువులు నాకు ఆ విషయం చెప్పలేదు. మే 10న నాన్నతో చివరి సారి మాట్లాడాను. ఐదు రోజుల తర్వాత నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాతే నాకు అమ్మనాన్న చనిపోయారనే విషయం చెప్పారు. అమ్మ మృతదేహాన్ని కూడా చూడలేకపోయాను. ‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో.. ధైర్యంగా ఉండి.. మేం త్వరలోనే వస్తాం’’ ఇదే అమ్మ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది వనీషా. ఆ తర్వాత తేరుకుని ‘‘ఇప్పుడు నా జీవితంలో నాకున్న అతిపెద్ద అండ నా సోదరుడు. తను ఇచ్చిన మద్దతు వల్లే నేను అమ్మనాన్న చనిపోయారనే బాధ నుంచి కోలుకుని.. చదువు మీద దృష్టి పెట్టగలిగాను. ఈ రోజు టాపర్‌గా నిలిచాను. నాన్న కలల్ని నేరవేరుస్తాను. అమ్మ కోరుకున్నట్లు నేను ధైర్యంగా ఉంటాను’’ అని తెలిపింది వనీషా. ఇక ఎన్డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం వనీషా తండ్రి జితేంద్ర కుమార్ ఆర్థిక సలహాదారుగా పని చేసేవాడు.. ఆమె తల్లి డాక్టర్ సీమా పఠాక్ స్కూల్ టీచర్‌గా పని చేసేవారు. -
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు.. అత్యధికంగా 99.04% ఉత్తీర్ణత
CBSE Class 10th Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదోతరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈసారి మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులు అత్యధికంగా 99.04% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణతా శాతం 91.46% కాగా, ఈసారి ఏడు శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదేవిధంగా, గత ఏడాది బాలురు, బాలికల మధ్య ఉత్తీర్ణతా శాతం 3.5% కాగా, బాలికలు స్వల్పంగా 0.35% ఆధిక్యం చూపారు. బాలికలు, బాలుర ఉత్తీర్ణతా శాతాలు వరుసగా 99.24, 98.89 ఉండగా ట్రాన్స్జెండర్లు 100% ఉత్తీర్ణత సాధించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలను రద్దుచేసిన సీబీఎస్ఈ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ విధానం ఆధారంగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 21.13 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా, ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలను ప్రకటించాల్సి ఉందని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ ఏడాది మెరిట్ జాబితాతోపాటు మెరిట్ సర్టిఫికెట్ల జారీ కూడా ఉండదని స్పష్టం చేశారు. 17,636 మంది విద్యార్థులకు కంపార్ట్మెంట్ పరీక్షను ఆగస్టు 16–సెప్టెంబర్ 15వ తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉందన్నారు. తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో త్రివేండ్రం రీజియన్ అత్యధికంగా 99.99% మార్కులు, ఆతర్వాత బెంగళూరు 99.96% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. 95% కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 41,804 మంది కాగా, ఈసారి 57,824కు పెరిగినట్లు వెల్లడించారు. 90–95 శాతం మధ్య స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా 1,84,358 నుంచి ఈసారి 2,00,962కు పెరిగినట్లు తెలిపారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటిన నటి.. తన డ్రీమ్ అదేనట
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేవారు చదువులో పెద్దగా రాణించలేరు. నిత్యం షూటింగ్స్‌తో బిజీ, బిజీగా ఉండడం వల్ల చదువుపై దృష్టిపెట్టలేకపోతారు. కానీ కొందరు మాత్రం చదువు వేరు, నటన వేరని నిరూపిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. చదువులో సత్తా చాటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటి అష్నూర్ కౌర్ ఒకరు. ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల బేబ్స్ లాంటి సీరియల్స్‌తో పాటు సంజు చిత్రంలోనూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అష్నూర్ కౌర్.. తాజాగా ప్రకటించిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 94శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. సాధారణ విద్యార్థులకు ఈ మార్కులు రావడం పెద్ద విషయమేమీ కాదు, కానీ నటిగా షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ.. 94 శాతం మార్కులు సాధించడం మాములు విషయం కాదు. ఈ ఫలితాలపై అష్నూర్ కౌర్ స్పందిస్తూ... ‘ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. వర్క్ గ్యాప్‌లో చదువుకొని, చాలా కష్టపడి పరీక్షలు రాశాను. రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పదో తరగతి పరీక్షల్లో 93 శాతం మార్కులు వచ్చాయి. అయితే 12వ తరగతిలో అంతకంటే ఎక్కువగా మార్కులు సాధించాలని అనుకున్నాను. అనుకున్నట్లే కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించాను.నా చదువుని ఇంతటితో ఆపాలనుకోవడం లేదు. బి.బి.ఎం(బ్యాచ్‌లర్ ఆఫ్ మాస్ మీడియా)లో డిగ్రీ చేసి, మాస్టర్స్ చదవడం కోసం విదేశాలకు వెళ్లాను’అని చెబుతోంది ఈ వర్థమాన నటి. ఇక ఇటీవల సొంత ఇంటిని కలను కూడా సాకారం చేసుకుంది ఈ బ్యూటీ. పదిహేడేళ్ల వయసూలో తన సొంత డబ్బుతో ఇల్లుని కొనుక్కుందట. అది తన డ్రీమ్ హౌస్ అని, త్వరలోనే ఇంటి పనులు పూర్తిచేసుకొని, వచ్చే ఏడాదిలో గృహ ప్రవేశం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు అష్నూర్ కౌర్ వెల్లడించింది. -
ఈసారి పరేడ్‌లో ఒక ఫైటర్ ఒక టాపర్
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌పథ్ మీదుగా ఇండియా గేట్ వరకు ఎనిమిది కి.మీ. దూరం సాగవలసిన రిపబ్లిక్ డే పరేడ్ ఈ ఏడాది మునుపటంత సందడితో ఉండబోవడం లేదు. ఎప్పుడూ లక్షమంది వరకు వీక్షకులను అనుమతించేవారు. ఈ ఏడాది ఆ సంఖ్యను ఇరవై ఐదు వేలకు కుదించారు. ఆ ఇరవై ఐదు వేల మందిలో నాలుగు వేల మంది మాత్రమే సాధారణ ప్రజలు. మిగతావారంతా వి.ఐ.పి.లు, వి.వి.ఐ.పీలు. ఎప్పుడూ చిన్నాపెద్దా అందరూ పరేడ్‌ను చూడ్డానికి వచ్చేవారు. ఈ ఏడాది పదిహేనేళ్ల వయసు లోపువారికి, అరవై ఐదేళ్లు దాటిన వారికి రాజ్‌పథ్ ప్రవేశాన్ని నిషేధించారు. బయటి అతిథులు కూడా ఎవరూ రావడం లేదు. కారణం తెలిసిందే. సోషల్ డిస్టెన్స్. అయితే.. ఇన్ని నిరుత్సాహాల నడుమ రెండంటే రెండే ఉల్లాసకరమైన విషయాలుగా కనిపిస్తున్నాయి. ఫ్లయింట్ లెఫ్ట్‌నెంట్ భావనా కాంత్ మన వాయుసేనలోని ఫైటర్ జెట్‌తో గగనతలంలో విన్యాసాలు చేయబోతున్నారు! రిపబ్లిక్ డే పరేడ్‌లో ఒక మహిళా ఫైటర్ పైలట్.. యుద్ధ విమానాన్ని చక్కర్లు కొట్టించబోవడం ఇదే మొదటిసారి. అలాగే దివ్యాంగి త్రిపాఠీ అనే విద్యార్థినికి పరేడ్ గ్రౌండ్స్‌లోని ప్రధాన మంత్రి బాక్స్‌లో కూర్చొని వేడుకలను తిలకించే అవకాశం లభించడం దేశంలోని బాలికలు, మహిళలందరికీ స్ఫూర్తినిచ్చే పరిణామం. భావనా కాంత్ (28) భారతదేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. జనవరి 26 న ఆమె రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ అవుతారు. భారత వాయుసేన ఆమెకు ఈ అరుదైన, ఘనమైన, చరిత్రాత్మక అవకాశాన్ని కల్పించింది. 2016 లో తొలి ఫైటర్ పైలట్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) లోకి వచ్చారు భావన. ఇంచుమించుగా ఆమెతో పాటే అవని చతుర్వేది, మోహనా సింగ్ ఫైటర్ పైలట్ శిక్షణలో చేరారు. అప్పటి వరకు మన సైన్యంలో మహిళా ఫైటర్ పైలట్లే లేరు. మూడేళ్ల అంచెలంచెల శిక్షణానంతరం 2019 మే లో యుద్ధ విమానాలు నడిపేందుకు భావన పూర్తి అర్హతలు సంపాదించారు. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లోని వైమానిక స్థావరంలో విధి నిర్వహణలో ఉన్నారు. మిగ్–21 యుద్ధ విమానాన్ని అన్ని కోణాల్లో మలుపులు తిప్పి శత్రువు వెన్ను విరచడంలో నైపుణ్యం ఉన్న యోధురాలు భావనా కామత్ ఇప్పుడు. భావన 1992 డిసెంబర్ 1న బిహార్‌లోని దర్భంగా లో జన్మించారు. అయితే ఆమె పెరిగింది అక్కడికి సమీపంలోని బెగుసరాయ్‌లోని రిఫైనరీ టౌన్షిప్లో. ఆమె తండ్రి తేజ్ నారాయణ్.. ఇంజనీర్. ఆ టౌన్‌షిప్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో ఆయన ఉద్యోగం. భావన తల్లి రాధాకాంత్ గృహిణి. భావన తమ్ముడు నీలాంబర్, భావన చెల్లి తనూజ. వారిద్దరికీ భావనే అన్నిటా స్ఫూర్తి. భావనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే కావచ్చు డ్రైవింగ్‌కి అత్యున్నతస్థాయి అనుకోదగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్‌ను కెరీర్‌గా ఎన్నుకున్నారు. ఇంకా ఆమెకు ఖోఖో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డిబేట్స్, సినిమాలు ఇష్టం. టౌన్‌షిప్‌లోని స్కూల్లో చదువు పూర్తయ్యాక భావన బెంగళూరులోని బి.ఎం.ఎస్. కాలేజ్‌లో మెడికల్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో కొన్నాళ్లు పని చేశారు. ఎయిర్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ట్రైనింగ్ అయ్యాక మేడ్చెల్ జిల్లాలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్అకాడమీ నుంచి ఫ్లయింగ్ ఆఫీసర్‌గా బయటికి వచ్చారు. భారత రాష్ట్రపతి గత ఏడాది ఆమెకు నారీ శక్తి పురస్కారం ప్రదానం చేశారు. ∙ ∙ ఇక రిపబ్లిక్ డే పరేడ్‌ను పీఎం పక్కన కూర్చొని వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పొందిన దివ్యాంగీ త్రిపాఠీ (18) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ అమ్మాయి. 2020 సీబీఎస్ఇ 12వ తరగతి పరీక్షల్లో 99.6 శాతం మార్కులతో జిల్లాలోనే టాపర్‌గా నిలవడంతో దివ్యాంగికి ఈ అరుదైన అవకాశం లభించింది. ఆమెతో పాటు ఈ అవకాశం దేశంలోని మిగతా రాష్ట్రాల టాపర్స్కీ దక్కింది. ఇప్పుడు ఆమెకు స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఎదురౌతున్న ప్రశ్న ఒక్కటే. ‘ప్రధాని నరేంద్ర మోదీ పక్కన కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు?’ అని! దివ్యాంగి తండ్రి ఉమేశ్‌నాథ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్. తల్లి ఉష గృహిణి. ఈ నెల 13న కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ‘పరేడ్’ను చూసేందుకు ఆహ్వానం వచ్చిందని ఆమె ఎంతో సంతోషంతో తెలిపారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ -
అమ్మాయ్.. ఎన్ని మార్కులొచ్చాయ్?
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. 10వ తరగతిలో 91.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇది గతేడాదితో పోలిస్తే 0.36 శాతం అధికం. ఇక పన్నెండవ తరగతిలో 88.78% ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఇప్పుడు మొదలవుతుంది విద్యార్థులకు అసలు పరీక్ష. అవునండోయ్.. పరీక్షలు రాసేవరకు అసలు పాసవుతామా? లేదా? అని తెగ భయపడిపోతుంటారు. తీరా ఫలితాలు వచ్చాక పరిస్థితి ఇంకోలా ఉంటుంది! మంచి మార్కులు వస్తే వాళ్లే అందరికీ పనిగట్టుకుని మరీ ఫోన్ చేస్తారు. (54 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పుడు దొరికింది) #CBSE10thRESULT2020 Me calling all my younger siblings, Relatives,juniors... Known... Unknown... and every damn kid of class 10th in my contact list :- pic.twitter.com/BFDPqIK74H — Mohinish vatsa (@Mohinish_vatsa) July 15, 2020 అందరిచేత అడిగించుకుని మరీ మార్కులు చెప్పుకుంటారు. ఆ సంతోషమే వేరు. కానీ మార్కుల సంగతి దేవుడెరుగు.. కనీసం పాస్ అయినా అవకపోయారో! ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా తలకిందులవుతుంది. గది దాటి బయటకు కూడా వెళ్లలేరు. ఎందుకంటే.. 'ఏంటమ్మాయ్/ ఏంటబ్బాయ్ ఎన్ని మార్కులు అంటూ బంధువులు, పొరుగింటి వారు, పక్కనుండే వీధిలోని ఆంటీ అంకుళ్లు.. ఆఖరికి దుకాణానికి వెళ్తే షాపువాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు విద్యార్థుల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉంటుంది. సీబీఎస్ఈ ఫలితాలొచ్చిన సమయంలో ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఇదీ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. (వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఇన్ని రోగాలు!) #CBSE10thRESULT2020 Relatives continuous calling for asking my marks. Even result is not announced yet. Le me- pic.twitter.com/yPByc84snN — Tushar singh (@Tushar38660199) July 15, 2020 #CBSE10thRESULT2020 Me and My Bois going to the relative's house who brutally trolled me for my 12th result But Now his own son failed in 10th pic.twitter.com/BzXueqxJXr — AWM_KAR 🇮🇳 (@Kal_se_padhunga) July 15, 2020 ఫలితాలు ప్రకటించగానే లక్షలాది మంది విద్యార్థులు సైట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు అది ఓపెన్ అవకుండా విద్యార్థుల సహనానికి పరీక్ష పెడుతుంది. నేను చెప్పనుగా అంటూ స్టూడెంట్స్‌తో దాగుడుమూతలాడుతుంది. ఇక నీకు మంచి మార్కులు రాకపోతే.. మీ నాన్న రియాక్షన్.. నువ్వు నా రక్తం కాదని ఈరోజు నిరూపించావ్రా అంటూ ఓ సీరియస్ లుక్కిస్తాడు. When you fail to score more percentage than your dad in boards. Le Dad-#CBSE10thRESULT2020 pic.twitter.com/iXdmKcxs8f — Sankalp (@sankalpx) July 15, 2020 #CBSE10thRESULT2020 Students checking there results. Meanwhile website : pic.twitter.com/4BGLfNFDW4 — Varthik Singh (@LuNaTiC_Varthik) July 15, 2020 ఇక కొందరు బంధువులుంటారు. అసలు ఫలితాలింకా వెల్లడించకముందే మార్కులెన్ని వచ్చాయ్? అంటూ ఫోన్లు చేసి విసిగిస్తూనే ఉంటారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విద్యార్థులు ఇదిగో ఇలా ప్రవర్తిస్తారంటూ ఓ మీమ్ అందరినీ నవ్విస్తోంది. (ఈ ఫొటో చూసి మీ మాస్కు తినేయకండి) Jst a pic of 12th student watching 10th nibbas checking there result.😂#CBSE10thRESULT2020 pic.twitter.com/kgb6IYxek8 — Predator (@I_m_whitewalker) July 15, 2020 #CBSE10thRESULT2020 Students waiting for results pic.twitter.com/ZgTQrl6ZHb — Bhojpuriya_troller (@Bhojpuri_trolls) July 15, 2020 During results -#CBSE10thRESULT2020 #cbseresults2020 #cbseclass10 pic.twitter.com/vCiodyp58A — Susovan Bhattacharya (@Susovan_26) July 15, 2020 #CBSE10thRESULT2020 announced student ignore their relatives call Relatives be like : pic.twitter.com/sFUpqq2Inp — 𝐒𝐮𝐫𝐦𝐚 𝐁𝐡𝐨𝐩𝐚𝐥𝐢 ♕ (@tweethimanshu_) July 15, 2020 -
అందుకే 100 శాతం మార్కులు: దివ్యాన్షి
‘‘నేను రోజూ ప్రార్థనలు చేశాను. అదే విధంగా కష్టపడి చదివాను కూడా. ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కీలక అంశాలను అందులో రాసుకున్నా. తద్వారా త్వరగా, మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నా. చదివిన ప్రతీ అంశాన్ని అనేక మార్లు పునరుశ్చరణ చేసి.. వాటిని విశ్లేషించి అర్థం చేసుకున్నా’’అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం(600/600) మార్కులు సాధించిన దివ్యాన్షి జైన్. హిస్టరీ సబ్జెక్టుపై పరిశోధన చేయాలనుకుంటున్నానని, దేశానికి సంబంధించిన గత చరిత్ర, విశేషాలపై అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు భవిష్యత్ ప్రణాళిక గురించి పంచుకుంది. కాగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలురపై(86.19 శాతం) బాలికలు(92.15 శాతం) పైచేయి సాధించారు.(సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి) ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దివ్యాన్షి జైన్ 600/600 స్కోరు సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నవయుగ్ రేడియన్స్ సీనియర్ సెకండరీ స్కూళ్లో విద్యనభ్యసించిన ఆమె ఇంగ్లీష్, సంస్కృతం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో వంద శాతం మార్కులు సాధించింది. దివ్యాన్షి తండ్రి స్థానికంగా దుకాణం నిర్వహిస్తుండగా.. ఆమె తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేస్తున్నారు. ఇక పరీక్షల్లో తాను సాధించిన గెలుపు గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టలేదని, ప్రణాళిక ప్రకారం రివిజన్, మాక్ టెస్టులకు సమయం కేటాయించి.. ఎక్కువగా ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) పుస్తకాలనే చదివానని చెప్పుకొచ్చింది. తన విజయానికి తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే కారణమని పేర్కొంది. -
‘సోషల్‌మీడియాలో వస్తున్న వార్త నిజం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ వచ్చేవారం విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాతో పాటు, కొన్ని ఛానెళ్లు, పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. 10, 12 వ తరగతి ఫలితాలను జూలై 11, 13 తేదీలలో విడుదల చేయనున్నారంటూ సీబీఎస్ఈ రూపొందించినట్టే ఉన్న సర్కూలర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై స్పందించిన సీబీఎస్ఈ ఆ వార్త అవాస్తమని ఖండించింది. పరీక్షల ఫలితాల తేదీని బోర్డు ఇంకా నిర్ణయించలేదని బోర్డు స్పష్టతనిచ్చింది. ఈ వార్తను విద్యార్థులు వారి తల్లిదండ్రులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. సీబీఎస్సీ 8-12వ తరగతి వరకు ఉన్న సిలబస్‌ను 30 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీబీఎస్ఈ -
టీచర్ల ఇళ్లలోనే జవాబు పత్రాల మూల్యాంకనం
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఉపాధ్యాయులు తమ ఇళ్లలోనే మూల్యాంకనం చేయవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శనివారం చెప్పారు. ఈ జవాబు పత్రాలను టీచర్లకు అందజేయడానికి 3 వేల పాఠశాలలను గుర్తించామని తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన 1.5 కోట్ల ఆన్సర్ షీట్లను టీచర్లకు అందజేస్తామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూల్యాంకనాన్ని 50 రోజుల్లోగా పూర్తి చేస్తామన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు జూలై 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. -
పరీక్షల్లేకున్నా పాస్!
కర్ణాటక, మైసూరు: కరోనా వైరస్ కొందరు విద్యార్థులకు పరీక్షల జంఝాటాన్ని తప్పించింది. పాత మైసూరు ప్రాంతంలోని సీబీఎస్ఈ పాఠశాలల్లో ఈ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ధారించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డు, ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి నాలుగో తరగతి విద్యార్థులకు ఈ నెల 20 లోగా పరీక్షలు పూర్తి చేసి పై తరగతులకు పంపించాలని తీర్మానించారు. అలాగే ఇక పదో తరగతి వరకు అన్ని పాఠశాలల్లో మార్చి 22 లోగా పరీక్షలు నిర్వహించి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని, అవసరమైతే పరీక్షలు లేకుండానే పాఠశాలలు మూసివేయాలని నిర్ధారించారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయినా పాస్ చేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో పరిశుభ్రతపై చర్చ విద్యార్థులకు ఎవరికైనా హఠాత్తుగా దగ్గు, జలుబు, జ్వరం కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించాలని తీర్మానించారు. ఇటీవల కరోనా భయాందోళనల గురించి సమావేశంలో చర్చించారు. కరోనా బారి నుంచి తమ విద్యార్థులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రతి విద్యార్థి తొలుత పాఠశాలకు రాగానే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేలా చేయాలని, మాస్కులను ఇవ్వాలని, వేడి తాగునీరు అందివ్వాలని, అలాగే పాఠశాల ఆవరణం శుభ్రంగా ఉండాలని తీర్మానించారు. -
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూనే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధానికి చెందిన 16 ఏళ్ల ప్రియేష్ తయాల్ పోరాటపటిమ ఎవరికైనా స్ఫూర్తి కలిగించకమానదు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూనే ప్రియేష్ సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల్లో 96 శాతం మార్కులు సాధించడం విస్తుగొలుపుతోంది. పరీక్షల సమయంలోనూ ప్రియేష్ కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి వెళుతూ ఓ వైపు చికిత్స పొందుతూ మరోవైపు పుస్తకాలనూ తిరగేశాడు. ఇంద్రప్రస్థ అపోలో ఆస్ప్రతి ఆంకాలజిస్ట్ డాక్టర్ మానస్ కల్రా ప్రియేష్ చికిత్స వివరాలను తెలుపుతూ..లుకేమియా రోగికి కనీసం రెండున్నర సంవత్సరాల పాటు చికిత్స అందించాలని, కీమోథెరఫీ కోసం ఆస్పత్రికి రావాలని చెప్పారు. వీటికితోడు రోగికి విపరీతమైన నొప్పులు, నిద్రలేమి బాధిస్తాయని అన్నారు. తన కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలియగానే తాను నిలువెల్లా వణికిపోయానని, బోర్డు పరీక్షలపై ఆందోళన చెందానని ప్రియేష్ తల్లి చెప్పారు. అయితే ప్రియేష్ మాత్రం మొక్కవోని ధైర్యంతో పరిస్థితి ధైర్యంగా ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. 2017 డిసెంబర్లో బోర్డు పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ప్రియేష్ హై ఫీవర్‌తో బాధపడుతున్నాడని, శరీరంపై నీలం రంగు మచ్చలు వచ్చాయని చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో అతడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు వెల్లడైందన్నారు. అప్పటినుంచి ప్రియేష్‌కు చికిత్స కొనసాగుతోంది. ఐఐటీలో చదువుతా.. తాను భవిష్యత్‌లో ఐఐటీలో చదివి ఇంజనీర్ పట్టా పొందుతానని ప్రియేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌ను జయించి దేశంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఉందని తన ఆకాంక్షను వెల్లడించారు. వీటన్నింటి కన్నా మంచి పౌరుడిగా ఉంటే చాలని అన్నారు. సీబీఎస్ఈ మంగళవారం వెల్లడించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 86.70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలురిపై బాలికలు పైచేయి సాధించారు. -
నలుగురికి 499 మార్కులు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పదవ తరగతి ఫలితాల్లో నలుగురు విద్యార్థులు 500కి అత్యధికంగా 499 మార్కులు సాధించారు. మంగళవారం వెలువడిన ఈ ఫలితాల్లో మొత్తంగా 86.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల్లో 85.32 శాతం, బాలికల్లో 88.67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గుర్గావ్కు చెందిన ప్రాకార్ మిత్తల్, యూపీలోని బిజ్నూర్కు చెందిన రిమ్జిమ్ అగర్వాల్, షమ్లీకి చెందిన నందినీ గార్గ్, కొచ్చి అమ్మాయి శ్రీలక్ష్మిలు 500కి 499 మార్కులు సాధించారు. మరో ఏడుగురికి 498మార్కులు, 14 మందికి 497 మార్కులొచ్చాయి. ఉత్తీర్ణతా శాతం పరంగా చూస్తే తిరువనంతపురం (99.6 శాతం), చెన్నై (97.37 శాతం), అజ్మీర్ (91.86 శాతం) రీజియన్లు మెరుగైన ఫలితాలు సాధించాయి. దేశం మొత్తం మీద 27,426 మంది విద్యార్థులు 95 శాతానికిపైగా మార్కులు తెచ్చుకున్నారు. అంగ వైకల్యం కలిగిన విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం 92.55 కాగా, గుర్గావ్కు చెందిన అనుష్క పండా, ఘజియాబాద్‌కు చెందిన సాన్యా గాంధీలు 489 మార్కులు పొందారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని సీబీఎస్ఈ రద్దు చేశాక జరిగిన తొలి పరీక్షలివే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు చెప్పారు. ఫెయిల్ అయిన విద్యార్థులు మనో నిబ్బరంతో ఉండాలని కోరారు. 12వ తరగతి టాపర్లను కలిసిన కేజ్రీవాల్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీలో టాపర్లుగా నిలిచిన వారిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలు విద్యార్థుల ఇళ్లలోనే కలిశారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి కూడా అయిన సిసోడియాతో కలసి కేజ్రీవాల్.. టాపర్లు భారతీ రాఘవ్, ప్రిన్స్ కుమార్, ప్రాచీ ప్రకాశ్, చిత్రా కౌశిక్‌ల ఇళ్లకు వెళ్లారు. అలాగే 12వ తరగతి వొకేషనల్ విద్య విభాగంలో టాపర్‌గా నిలిచిన షహనాజ్‌ను కలిసేందుకు దర్యాగంజ్ ప్రాంతంలో ఉన్న అనాధశ్రమాన్ని కూడా వారిరువురూ సందర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులను రెండింతలు చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అది డబ్బు ఎక్కువ ఖర్చు చేయడం కాదనీ, పిల్లల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని మంగళవారం అన్నారు. సీబీఎస్ఈకి లీకు వీరుల జాబితా సీబీఎస్ఈ పరీక్షల్లో 10వ తరగతి గణితం, 12వ తరగతి ఆర్థిక శాస్త్రం ప్రశ్న పత్రాలు లీకయ్యి సంచలనం సృష్టించడం తెలిసిందే. అలా ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకుని పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను పోలీసులు సీబీఎస్ఈకి సమర్పించారు. లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో పోలీసులు కొందరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. అరెస్టయిన వారి నుంచి వివరాలను రాబట్టి, ప్రశ్న పత్రాలను ముందుగానే అందుకున్న విద్యార్థుల జాబితాను పోలీసులు సీబీఎస్ఈకి పంపారు. -
ఔరా అనిపించిన అమ్మాయిలు
నొయిడా: సీబీఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో బాలికలే ముందంజలో ఉండగా.. బాలురు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన నిధి ఉపాధ్యాయ, సృష్టి సింగ్‌లు ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి 96 శాతం మార్కులు సాధించారు. వీరిద్దరు నొయిడాలోని సెక్టార్ 44 గల మహామాయ ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాలలో చదువుతున్నారు. ర్యాంకులు సాధించడానికి పట్టుదల, నిబద్ధత అవసరమని రుజువు చేశారు. ఖరీదైన, కార్పొరేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశారు. హ్యుమనిటీస్ విభాగంలో నిధి ఉపాధ్యాయ 96.2 శాతం మార్కులు సాధించగా, బయాలజీ విభాగంలో సృష్టి సింగ్ 98.8 శాతం మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం: నిధి ‘మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివాను. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు విషయంలో నాన్న వెన్నంటి ఉన్నారు. నా లక్ష్యం ఐఏఎస్ కావడం. కష్టపడి చదివి నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తా’ ఆమె కోసమే ఇక్కడికొచ్చా.. నిధి తండ్రి రామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ‘నా కూతురు చదువులో చురుగ్గా ఉంటుంది. ఆమె చదువు కోసమే ఈ పట్టణానికి వచ్చా. రోజంతా ఆటో నడిపినా పూట గడవడమే కష్టం. అయినే సరే ఆమె కోసం కష్టపడటంలో ఆనందం ఉంది. నిధి తప్పకుండా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది’ ఆర్మీ డాక్టర్నవుతా: సృష్టి ‘వ్యాపారం చేసుకుని మమ్మల్ని బాగా చూసుకునే నాన్నకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నా అనారోగ్యం కారణంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన వ్యాపారం పూర్తిగా నష్టాల బాట పట్టింది. నా ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. కానీ, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివా. నా కోసం మా టీచర్లు సాయంత్రం కూడా క్లాసులు పెట్టారు. వారికి నా ధన్యవాదాలు. చదువులో రాణించాలంటే గురువుల మార్గదర్శనం తప్పనిసరి. డాక్టర్ని అయి ఆర్మీలో సేవలందిస్తా’ -
క్లాస్‌లో కౌగిలింత.. కట్ చేస్తే...
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన ‘విద్యార్థుల కౌగిలింత’ వ్యవహారం గుర్తుండే ఉంటుంది. క్లాస్ రూమ్‌లోనే జూనియర్ విద్యార్థినిని గాఢంగా కౌగిలించుకున్న ఓ విద్యార్థి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో క్రమశిక్షణ పేరిట స్కూల్ యాజమాన్యం వాళ్లను సస్పెండ్ చేయగా, పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తూ సీబీఎస్ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. అయితే న్యాయ పోరాటం తర్వాత విజయం సాధించిన ఆ విద్యార్థి ఎట్టకేలకు పరీక్షలు రాసి శనివారం విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో సత్తా చాటడం విశేషం. 12 తరగతి పరీక్షల ఫలితాల్లో అతను మొత్తం 91.2 శాతం సాధించాడు. ఆంగ్లంలో 87, ఎకనామిక్స్‌లో 99, బిజినెస్ స్టడీస్‌లో 90, అకౌంటెన్సీలో 88, సైకాలజీలో 92 మార్కులు వచ్చాయి. దీనిపై అతని తల్లిదండ్రలు సంతోషం వ్యక్తం చేశారు. ‘న్యాయ పోరాటం తర్వాత మా అబ్బాయి పరీక్షలకు అనుమతి లభించింది. కానీ, అప్పటికే తరగతులన్నీ అయిపోయాయి. అయినప్పటికీ కష్టపడి చదివాడు. ఫలితం సాధించాడు’ అని విద్యార్థి తండ్రి చెప్పారు. అసలేం జరిగింది... గతేడాది తిరువనంతపురంలోని సెయింట్ థామస్ సెంట్రల్ స్కూల్లో జరిగిన ఓ ఈవెంట్లో 12వ తరగతి చదువుతున్న స్టూడెంట్.. జూనియర్ విద్యార్థినిని క్లాస్‌రూమ్‌లో కౌగిలించుకొని ఫోటోలు దిగాడు. వాటిని కాస్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయటం, అది స్కూల్ యాజమాన్యం దృష్టికి వెళ్లటంతో వారిద్దరినీ సస్పెండ్ చేసింది. దీంతో బోర్డు పరీక్షలకు ఆ విద్యార్థిని అనర్హుడిగా ప్రకటించింది. ఈ ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. విద్యార్థి ఫిర్యాదుతో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం, స్కూల్ యాజమాన్యాన్ని మందిస్తూ తిరిగి చేర్చుకోవాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్కూల్ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే విద్యార్థుల క్రమశిక్షణ విషయం స్కూల్ పరిధిలోనే ఉంటుందని, అలాగని పరీక్షలు రాయనీయకపోవటం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసిన కోర్టు తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. చివరకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ జోక్యంతో స్కూల్ యాజమాన్యం వెనక్కి తగ్గింది.విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలంటూ సీబీఎస్ఈ బోర్డుకు స్కూల్ మేనేజ్మెంట్ లేఖ రాయటంతో వివాదం సర్దుమణిగింది. అమ్మాయి పరిస్థితి... సస్పెండ్ కావటానికి నెల రోజుల ముందే స్కూల్లో విద్యార్థిని చేరటం, పైగా గతంలో ఆమె చదువుకున్న టీసీ ఇవ్వకపోవటంతో ఆమె సస్పెన్షన్ విషయంలో సంగ్దిగ్దత నెలకొంది. అయితే అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన ఆ విద్యార్థిని స్కూల్ అధికారులు తనపై అనుచిత పదజాలం వాడారంటూ ఆరోపించి కలకలం రేపింది. వాటిని ఖండించిన స్కూల్ మేనేజ్మెంట్ చివరకు ఆమెను కూడా పరీక్షలకు అనుమతించింది. -
గుజరాత్ కుర్రోడికి నీట్ ఫస్ట్ ర్యాంక్
వైద్య విద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఫలితాలను బుధవారం విడుదల చేస్తారనుకున్నా.. ఒకరోజు ముందుగానే సీబీఐఎస్‌ఈ విడుదల చేసింది. గుజరాత్‌కు చెందిన హెట్ షా (18) ఈ పరీక్షలలో మొత్తం 720 మార్కులకు గాను 685 మార్కులు సాధించి ఆలిండియా మొదటి ర్యాంకు పొందాడు. ఇతడు రాజస్థాన్‌లోని కోటలోని అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. ఒడిషాకు చెందిన ఏకాంశ్ గోయల్, రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ బజియాలకు రెండు, మూడో ర్యాంకులు వచ్చాయి. వీళ్లు కూడా అదే సంస్థలో కోచింగ్ తీసుకున్నారు. మే 1వ తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు మొత్తం 6 లక్షల మంది హాజరయ్యారు. అయితే తొలిదశ పరీక్షకు చాలామంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోకపోవడంతో జూలై 24న రెండోదశ పరీక్ష నిర్వహించగా, మరో 4 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులు ఇంకా దానికి సిద్ధం కాలేదన్న కారణంతో సుప్రీంకోర్టు అనుమతితో విడివిడిగా ఎంసెట్లు నిర్వహించారు. (నీట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. 21 వ తేదీ మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ 21 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు. -
తండ్రి బాటలో కేజ్రీవాల్ కూతురు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనయ హర్షిత మంచి ప్రతిభ కనబరిచింది. సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆమె 96 శాతం మార్కులు తెచ్చుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన హర్షిత ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు తెచ్చుకుంది. సైన్స్ స్ట్రీమ్‌లో చదివిన ఆమె తన తండ్రిలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆశ పడుతున్నారు. తన తల్లిదండ్రులే తనకు రోల్ మోడల్స్ అని ఆమె తెలిపింది. ఐఐటీలో ప్రవేశం పొందడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని హర్షిత చెప్పారు.