సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను సీబీఎస్‌ఈ వచ్చేవారం విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాతో పాటు, కొన్ని ఛానెళ్లు, పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. 10, 12 వ తరగతి ఫలితాలను జూలై 11, 13 తేదీలలో విడుదల చేయనున్నారంటూ సీబీఎస్‌ఈ రూపొందించినట్టే ఉన్న సర్కూలర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ ఆ వార్త అవాస్తమని ఖండించింది. పరీక్షల ఫలితాల తేదీని బోర్డు ఇంకా నిర్ణయించలేదని బోర్డు స్పష్టతనిచ్చింది. ఈ వార్తను విద్యార్థులు వారి తల్లిదండ్రులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. సీబీఎస్సీ 8-12వ తరగతి వరకు ఉన్న సిలబస్‌ను 30 శాతం తగ్గించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment