తండ్రి బాటలో కేజ్రీవాల్ కూతురు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తనయ హర్షిత మంచి ప్రతిభ కనబరిచింది. సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆమె 96 శాతం మార్కులు తెచ్చుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిన హర్షిత ఫిజిక్స్ లో అత్యధిక మార్కులు తెచ్చుకుంది.
సైన్స్ స్ట్రీమ్లో చదివిన ఆమె తన తండ్రిలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆశ పడుతున్నారు. తన తల్లిదండ్రులే తనకు రోల్ మోడల్స్ అని ఆమె తెలిపింది. ఐఐటీలో ప్రవేశం పొందడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని హర్షిత చెప్పారు.