రేపు మధ్యాహ్నం సీబీఎస్ఈ ఫలితాల విడుదల
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12 తరగతి ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. 21 వ తేదీ మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ శుక్రవారం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా 10.67 లక్షల మంది విద్యార్థులు (ప్లస్ 2) ఈ పరీక్షలకు హాజరయ్యారు. గత మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా జేఈఈతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ లకు హాజరైన విద్యార్థులు సీబీఎస్ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
సీబీఎస్ఈ ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్టు ముందుగా సంకేతాలు ఇచ్చారు. ఆ ఉత్కంఠకు తెరదించుతూ 21 శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. ఫలితాలను www.cbseresults.nic.in లో చూసుకోవచ్చు.