ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్‌లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.
మే నెలలో ఈపీఎఫ్‌వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment