సిమ్లా: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో వాతావరణం వేడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే, జూన్ నాటి వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల నిష్క్రమణతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారింది. దీంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు.
మరికొద్ది రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజానికి హిమాచల్ ప్రదేశ్‌లో సెప్టెంబర్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనెల 15 తర్వాత హిమాచల్‌లో రెండు రోజుల పాటు వాతావరణం చల్లగా మారింది. మనాలి, కిన్నౌర్, లాహౌల్ స్పితి తదితర ప్రాంతాల్లోని పర్వతాలపై మంచు కురిసింది. అయితే గడచిన కొద్దిరోజులుగా వర్షాలు తగ్గి, ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిమ్లా, మనాలిలో ప్రస్తుతం ఏర్పడిన ఉష్ణోగ్రతలు పదేళ్ల రికార్డును బద్దలు కొట్టాయి.
సిమ్లా వాతావరణ కేంద్రం విడుదల చేసిన డేటాలోని వివరాల ప్రకారం ఈ నెల 23, 24 తేదీల్లో సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదైంది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం. 1994లో సెప్టెంబర్ 30న సిమ్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెంట్రీగ్రేడ్‌గా నమోదయ్యింది. అదేవిధంగా మనాలిలో కూడా సెప్టెంబర్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ సెప్టెంబర్ 23న 27.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.
మరోవైపు సెప్టెంబర్ నెలలో కాంగ్రాలో ఆల్ టైమ్ ఉష్ణోగ్రతల రికార్డు బద్దలైంది. ఈ నెలలో ఇక్కడి ఉష్ణోగ్రత ఎప్పుడూ 35 డిగ్రీలకు చేరుకోలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 24న ఇక్కడ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యంత వేడిగా ఉండే హిమాచల్ జిల్లాలోనూ పరిస్థితి ఇలానే ఉంది. సెప్టెంబర్‌లో ఉనాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ధర్మశాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం ఇక్కడ అత్యధికంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది కూడా చదవండి: నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు
Comments
Please login to add a commentAdd a comment