అయోధ్య: రాముడు కొలువైన అయోధ్యలో ఈరోజు(ఆదివారం) శీతాకాలపు తొలి పొగమంచు కనిపించింది. వేడి నుంచి ఉపశమనం లభించడంతో పాటు అయోధ్యవాసులను చలి తాకింది. భక్తులు తొల పొగమంచును ఎంజాయ్ చేస్తున్నారు.
అయోధ్యలో తొలి పొగమంచు ప్రభావం రోడ్లపై వెళుతున్న వాహనాలపై పడింది. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. సరయూ తీరం, రామ్ కీ పైడీ, రాంపథ్.. ఇలా అన్ని చోట్లా పొగమంచు కనిపిస్తోంది. అయోధ్య చేరుకున్న భక్తులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది చలికాలం ఆగమనానికి ప్రతీక అని స్థానికులు అంటున్నారు.
చలి ప్రవేశంతో అయోధ్యకు వచ్చే భక్తులకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలుగుతోంది. అయోధ్యలో తొలిసారిగా పొగమంచు కమ్ముకోవడం శుభపరిణామమని భక్తులు భావిస్తున్నారు. కౌశాంబి నుండి అయోధ్యకు వచ్చిన భక్తురాలు రాణి మాట్లాడుతూ అయోధ్యలో పొగమంచు మాత్రమే ఉందని, చలి అంతగా లేదన్నారు. గోరఖ్‌పూర్ నుంచి అయోధ్యకు వచ్చిన నవీన్ అనే భక్తుడు మాట్లాడుతూ అయోధ్యలో కురుస్తున్న పొగమంచు చక్కని అనుభూతిని ఇస్తున్నదన్నారు.
ఇది కూడా చదవండి: కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు
Comments
Please login to add a commentAdd a comment