‘సిమ్లా’కు సర్వం సిద్ధం
ఆనందంగా ఉంది
దేశంలో ఏడాదికి ఒకసారి జరిగే సిమ్లా జాతీయ సదస్సుకు ఈసారి కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఐదు వందల మందికి పైగా ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఫోరెన్సిక్ వైద్య విధానాలు, అనుసరణీయ ప్రక్రియల్లో చోటు చేసుకున్న సానుకూల మార్పుల అవగాహనకు ఈ సదస్సు ఎంతగానో దోహదం చేస్తుంది.
– డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ చైర్మన్,
హెచ్‌వోడీ, ఫోరెన్సిక్, ఆర్‌ఎంసీ, కాకినాడ
ఏర్పాట్లు పూర్తి
మూడు రోజుల సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తరలిరానున్న వైద్యులు, అతిఽథులకు ఏలోటు రాకుండా ఆర్గనైజింగ్ కమిటీ వారం రోజులుగా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్ల సహకారం ఎంతగానో ఉంది. కాకినాడ ఆర్‌ఎంసీలో జరగనున్న ఈ సదస్సు ప్రతి ఫోరెన్సిక్ వైద్యుడికి ఓ జీవిత కాలపు అనుభూతిగా మిగలనుంది.
– డాక్టర్ పి.ఫణికిరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ,
అసోసియేట్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్, ఆర్‌ఎంసీ, కాకినాడ
కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల
కాకినాడ క్రైం: కాకినాడ నగరం ప్రతిష్టాత్మక జాతీయ సదస్సుకు వేదిక కానుంది. 20వ సౌత్ ఇండియా మెడికో లీగల్ అసోసియేషన్ (సిమ్లా) జాతీయ సదస్సు–2024కు ఆతిథ్యమిస్తోంది. గురువారం నుంచి జరిగే ఈ సదస్సుకు రంగరాయ వైద్య కళాశాలలోని ఆడిటోరియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేశంలో పలు రాష్ట్రాల నుంచి వందల మంది ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఈ కార్యక్రమానికి తరలి రానున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, రంగరాయ వైద్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును ఆర్గనైజింగ్ చైర్మన్ హోదాలో హెచ్‌వోడీ డాక్టర్ పి.ఉమామహేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.ఫణికిరణ్ పర్యవేక్షిస్తున్నారు.
8 రాష్ట్రాల నుంచి 491 మంది నిపుణులు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్నాటక, గోవా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 491 మంది ఫోరెన్సిక్ నిపుణులు గురువారం నుంచి ప్రారంభం కానున్న కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరి నమోదు ప్రక్రియ పూర్తయింది. రంగరాయ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని ప్రముఖ హోటళ్లన్నింటిలో వీరి బసకు ఏర్పాట్లు చేశారు.
తరలిరానున్న ప్రముఖులు
సిమ్లా సదస్సులో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్టులో ప్రముఖులను ఆహ్వానించినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఫణికిరణ్ తెలిపారు. వీరిలో డాక్టర్ సిర్లే వాసు (హెచ్‌వోడీ కేఎంసీటీ మెడికల్ కాలేజ్, కేరళ), డాక్టర్ వింద జే భట్ (హెడ్, ఎఫ్‌ఎంటీ, సిమ్స్ అండ్ ఆర్‌సీ మంగళూరు), డాక్టర్ ఎం.అరుణ (ప్రొఫెసర్, ఎఫ్‌ఎంటీ, జేఎస్‌ఎస్ మెడికల్ కాలేజ్, కర్ణాటక), డాక్టర్ బీజీ మహేష్ కృష్ణ (హెడ్, ఎఫ్‌ఎంటీ, వెలమ్మల్ మెడికల్ కాలేజ్, మధురై), డాక్టర్ టి.సాయి సుధీర్ (హెచ్‌వోడీ, ఎఫ్‌ఎంటీ, మెడికల్ కాలేజ్, కర్నూల్), డాక్టర్ దాసరి హరీష్ (హెడ్, ఎఫ్‌ఎంటీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఛండీఘర్), డాక్టర్ సునీల్ సుబ్రహ్మణ్యం (హెడ్, ఎఫ్‌ఎంటీ, పీఐఎంఎస్, పాండిచ్చేరి), డాక్టర్ ఎస్‌వీ ఫణీంద్ర (హెడ్, ఎఫ్‌ఎంటీ, ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజ్, గుంటూరు), డాక్టర్ జయంతి యాదవ్ (ప్రొఫెసర్, ఎఫ్‌ఎంటీ, ఎయిమ్స్, బోపాల్), డాక్టర్ బి.శాంతకుమార్ (పూర్వపు డైరెక్టర్, మద్రాస్ మెడికల్ కాలేజ్), డాక్టర్ సీబీ జానీ (హెడ్, ఎఫ్‌ఎంటీ, ఎస్‌ఏఎల్ ఇన్‌స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్సెస్, అహ్మదాబాద్), డాక్టర్ ఎం.నారాయణరెడ్డి (వైస్ ప్రిన్సిపాల్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ విమెన్, హైదరాబాద్), డాక్టర్ వి.పవన్ కుమార్ (అసోసియేట్ ప్రొఫెసర్, మిమ్స్, విజయనగరం), డాక్టర్ సూరిబాబు (విశ్రాంత జేడీ, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ఛత్తీస్‌ఘర్) తదితరులు హాజరుకానున్నారు.
ఐజీ, రిజిస్ట్రార్లు అతిఽథులుగా...
ఏలూరు రేంజి ఐజీ గోరంట్ల వెంకటగిరి అశోక్ కుమార్, ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. అలాగే అతిఽథులుగా రాష్ట్ర డీఎంఈ, డాక్టర్ ఎన్‌టీఆర్ యూహెచ్‌ఎస్ వీసీ, రంగరాయ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఏ.విష్ణువర్ధన్, డాక్టర్ డీఏవీఎస్ శశి హాజరుకానున్నారు.
బహుమతిగా పండూరు మామిడి తాండ్ర
ఫోరెన్సిక్ జాతీయ సదస్సులో మన పండూరు మామిడి తాండ్ర సందడి చేయబోతోంది. దేశంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చే వైద్య బృందాలకి పండూరు మామిడి తాండ్ర ప్యాకెట్లను బహుమతిగా ఇచ్చి స్థానిక కమ్మదనాన్ని రుచి చూపాలని నిర్వాహకులు సంకల్పించారు. అందులో భాగంగా నిర్వాహకులు సుమారు 300 కిలోల మామిడి తాండ్రను ఆర్డర్ చేసి సిద్ధం చేశారు. ప్రత్యేక ప్యాక్‌లలో ఓ మధురమైన బహుమతిగా మన మామిడి తాండ్ర సిద్ధమైంది.
నేటి నుంచి ఫోరెన్సిక్
నిపుణుల జాతీయ సదస్సు
వేదిక కానున్న కాకినాడ ఆర్‌ఎంసీ
మూడు రోజుల పాటు నిర్వహణ
విజ్ఞానభరితం
భవిష్యత్ ఫోరెన్సిక్ దిశానిర్దేశం (నావిగేటింగ్ ఫ్యూచర్ ఫోరెన్సిక్ హారిజన్స్) అనే థీంతో మూడు రోజుల పాటు ఈ సదస్సు విజ్ఞానభరితంగా సాగనుందని డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. 26, 27, 28వ తేదీలలో మూడు రోజుల్లోనూ వివిధ కీలక అంశాలపై నిపుణుల బోధనలు, చర్చాగోష్టి కొనసాగుతాయన్నారు.
తొలి రోజు
తొలి రోజు గురువారం వివిధ అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు జరుగుతాయి. డిజిటల్ ఫారెన్సిక్స్, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్చెస్ టు స్కెలిటల్ ఎగ్జామినేషన్ అమాంగ్ ఫోరెన్సిక్, ఆంత్రాపోలజిస్ట్, ఓడోనోటోలజిస్ట్ అండ్ పాథాలజిస్ట్స్, మెడికల్ హూమానిటీస్, ఎలక్టివ్స్ ఇన్ ఎఫ్‌ఎంటీ, క్రియోనిక్స్, క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఎంవీ ఆక్సిడెంట్స్, నేవిగేటింగ్ ఇంటర్నేనేషనల్ లాస్ అండ్ అగ్రిమెంట్స్ అనే అంశాలపై ఇవి కొనసాగుతాయి.
రెండో రోజు
సదస్సులో భాగంగా రెండో రోజు శుక్రవారం వివిధ అంశాలపై చర్చాగోష్టి జరుగుతుంది. ఎ సినాప్సిస్ ఆఫ్ ది పాస్ట్, అండర్ స్టాండింగ్ ది ప్రజెంట్ అండ్ ఏ గ్లింప్స్ ఆఫ్ ది ఫ్యూచర్, డెవలపింగ్ ఫారెన్సిక్ హిస్టో పాథాలజీ ఏఎస్ ఏన్ ఎసన్షియల్ ఎయిడ్ టు అటాప్సీ ఇన్ ఇండియన్ సినారియో, జ్యూడీషరీ పెర్సెప్షన్ ఆఫ్ మెడికల్ నెగ్లెజెన్స్, డీక్రిమినలైజేషన్ ఆఫ్ సెక్షన్ 309 ఐపీసీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మెడికో లీగల్ ఇన్వెస్టిగేషన్ అంశాలపై జరుగుతుంది.
చివరి రోజు
ఇక చివరి రోజు శనివారం బోధనలు, ప్రసంగాలు ఉంటాయి. ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ బాలిస్టిక్స్ ఫ్రం ఏ లీగల్ పర్‌స్పెక్టివ్, మాలిక్యులార్ ఎటాప్సీ ఏస్‌ఏ డయాగ్నస్టిక్ టూల్ ఇన్ ఎస్‌సీడీ, యుటిలిటీ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ టూల్స్ అండ్ ఎన్‌టోమోలోజికల్ ఎవిడెన్స్ ఇన్ క్రైం ఇన్వెస్టిగేషన్ అనే అంశాలపై ఇవి కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment