న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ www.cbse.gov.in/ లేదా cbseresults.nic.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకే రోజు సీబీఎస్ టెన్త్, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 94.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా 95.21 శాతంగా ఉంటే.. బాలుర ఉత్తీర్ణత 93.80 శాతంగా ఉంది. ట్రాన్స్ జండర్లు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే టాపర్స్ జాబితాను సీబీఎస్‌ఈ విడుదల చేయలేదు. 11.32 శాతం విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా.. 3.10 శాతం విద్యార్థులు 95 శాతం స్కోర్ చేశారు. కాగా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment