CBSE class 10 results
-
CBSE 10th Result 2022: సీబీఎస్ఈ టెన్త్ టాపర్లు వీరే
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.21 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 93.80 శాతం మంది పాసయ్యారు. బాలికల్లో దియా నామ్‌దేవ్, బాలురలో మయాంక్ యాదవ్ నేషనల్ టాపర్స్‌గా నిలిచారు. వీరిద్దరూ 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుని చదివా షామ్లీ జిల్లాకు చెందిన దియా నామ్‌దేవ్.. స్థానిక స్కాటిష్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాను టాపర్‌గా నిలిచానని దియా నామ్‌దేవ్ తెలిపారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను. నేను ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు చదువుకున్నాను. కాన్సెప్ట్‌లను బాగా అర్థం చేసుకుని చదవడం వల్ల టాపర్‌గా నిలిచాన’ని అన్నారు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు నోయిడాలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన మయాంక్ యాదవ్ కూడా 100 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచాడు. అన్ని సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు తెచ్చుకుని సత్తా చాటాడు. టాపర్‌గా నిలవడం పట్ల మయాంక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్రివేండ్రం టాప్.. గువాహటి లాస్ట్ సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో త్రివేండ్రం ముందు వరుసలో నిలిచింది. త్రివేండ్రంలో అత్యధికంగా 99.68 శాతం ఉత్తీర్ణత నమోదయింది. గువాహటి 82.23 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. ఢిల్లీలో 86.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తూర్పు ఢిల్లీలో 86.96 శాతం, పశ్చిమఢిల్లీలో 85.94 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ( కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు) -
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్స్‌ను అధికారిక వెబ్సైట్ www.cbse.gov.in/ లేదా cbseresults.nic.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయమే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకే రోజు సీబీఎస్ టెన్త్, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 94.4 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా 95.21 శాతంగా ఉంటే.. బాలుర ఉత్తీర్ణత 93.80 శాతంగా ఉంది. ట్రాన్స్ జండర్లు 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే టాపర్స్ జాబితాను సీబీఎస్ఈ విడుదల చేయలేదు. 11.32 శాతం విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించగా.. 3.10 శాతం విద్యార్థులు 95 శాతం స్కోర్ చేశారు. కాగా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరిగిన విషయం తెలిసిందే. -
ఇంట్లో పెను విషాదం..కన్నీళ్లను దిగమింగుతూ టాపర్‌గా నిలిచింది
సాక్షి, వెబ్‌డెస్క్: పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలు.. పిల్లల గురించి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగనీయరు. ప్రతీది వారి ముందుకే తెచ్చిపెడతారు. ఏమంటే.. పిల్లలు ఏ మాత్రం డిస్టర్బ్ అయినా ఆ ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది పరీక్షల ముందు ఏకంగా అమ్మానాన్న మరణిస్తే.. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. పరీక్షల్లో పాసవ్వడం సంగతి అటుంచి.. అసలు చాలా మంది ఎగ్జామ్స్‌కు హాజరవ్వరు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే విద్యార్థిని అందుకు భిన్నం. తల్లిదండ్రులను కోల్పోయాననే బాధ వెంటాడుతున్నప్పటికి.. వారు తనమీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడమే తన బాధ్యత అనుకుంది. మరింత దీక్షగా చదివి.. టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ విద్యార్థిని స్టోరి ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు.. బుధవారం ప్రకటించిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలోల మధ్యప్రదేశ్‌కు చెందిన వనీషా పఠాక్ టాపర్‌గా నిలిచింది. స్కూల్ యాజమాన్యం, ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నప్పటికి.. పెద్దగా సంతోషించలేకపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో తన పక్కనే ఉండి.. తన విజయంలో పాలు పంచుకుని.. తన కన్నా ఎక్కువగా మురిసిపోవాల్సిన తన తల్లిదండ్రులు రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడి మృతి చెందారు. ఫస్ట్ వచ్చిన సంతోషం కంటే.. అమ్మనాన్న లేరనే విషయమే వనీషాను ఎక్కువ బాధిస్తుంది. తల్లిదండ్రులతో వనీషా పఠాక్ (ఫైల్ ఫోటో) ఈ సదర్భంగా వనీషా మాట్లాడుతూ.. ‘‘నా తల్లిదండ్రులు నన్ను ప్రతి విషయంలో ప్రోతాహిస్తూ ఉండేవాళ్లు. జీవితాంతం నన్ను పోత్సాహిస్తూనే ఉంటారు. నా పరీక్షల ముందే వారిద్దరికి కోవిడ్ సోకి ఆస్పత్రిలో చేరారు. నేను చివరి సారిగా ఈ ఏడాది మే 2న మా అమ్మతో మాట్లాడాను. మే 4న ఆమె చనిపోయారు. అప్పటికే మా నాన్న కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. కానీ మా బంధువులు నాకు ఆ విషయం చెప్పలేదు. మే 10న నాన్నతో చివరి సారి మాట్లాడాను. ఐదు రోజుల తర్వాత నాన్న కూడా చనిపోయారు. ఆ తర్వాతే నాకు అమ్మనాన్న చనిపోయారనే విషయం చెప్పారు. అమ్మ మృతదేహాన్ని కూడా చూడలేకపోయాను. ‘‘నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో.. ధైర్యంగా ఉండి.. మేం త్వరలోనే వస్తాం’’ ఇదే అమ్మ నాతో మాట్లాడిన ఆఖరి మాటలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యింది వనీషా. ఆ తర్వాత తేరుకుని ‘‘ఇప్పుడు నా జీవితంలో నాకున్న అతిపెద్ద అండ నా సోదరుడు. తను ఇచ్చిన మద్దతు వల్లే నేను అమ్మనాన్న చనిపోయారనే బాధ నుంచి కోలుకుని.. చదువు మీద దృష్టి పెట్టగలిగాను. ఈ రోజు టాపర్‌గా నిలిచాను. నాన్న కలల్ని నేరవేరుస్తాను. అమ్మ కోరుకున్నట్లు నేను ధైర్యంగా ఉంటాను’’ అని తెలిపింది వనీషా. ఇక ఎన్డీటీవీ తెలిపిన వివరాల ప్రకారం వనీషా తండ్రి జితేంద్ర కుమార్ ఆర్థిక సలహాదారుగా పని చేసేవాడు.. ఆమె తల్లి డాక్టర్ సీమా పఠాక్ స్కూల్ టీచర్‌గా పని చేసేవారు. -
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు.. అత్యధికంగా 99.04% ఉత్తీర్ణత
CBSE Class 10th Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదోతరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈసారి మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులు అత్యధికంగా 99.04% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణతా శాతం 91.46% కాగా, ఈసారి ఏడు శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదేవిధంగా, గత ఏడాది బాలురు, బాలికల మధ్య ఉత్తీర్ణతా శాతం 3.5% కాగా, బాలికలు స్వల్పంగా 0.35% ఆధిక్యం చూపారు. బాలికలు, బాలుర ఉత్తీర్ణతా శాతాలు వరుసగా 99.24, 98.89 ఉండగా ట్రాన్స్జెండర్లు 100% ఉత్తీర్ణత సాధించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలను రద్దుచేసిన సీబీఎస్ఈ ఆల్టర్నేటివ్ అసెస్మెంట్ విధానం ఆధారంగా ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 21.13 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా, ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలను ప్రకటించాల్సి ఉందని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ ఏడాది మెరిట్ జాబితాతోపాటు మెరిట్ సర్టిఫికెట్ల జారీ కూడా ఉండదని స్పష్టం చేశారు. 17,636 మంది విద్యార్థులకు కంపార్ట్మెంట్ పరీక్షను ఆగస్టు 16–సెప్టెంబర్ 15వ తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉందన్నారు. తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో త్రివేండ్రం రీజియన్ అత్యధికంగా 99.99% మార్కులు, ఆతర్వాత బెంగళూరు 99.96% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. 95% కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 41,804 మంది కాగా, ఈసారి 57,824కు పెరిగినట్లు వెల్లడించారు. 90–95 శాతం మధ్య స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా 1,84,358 నుంచి ఈసారి 2,00,962కు పెరిగినట్లు తెలిపారు. -
బాలికలదే హవా
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈసారి సీబీఎస్ఈ పదవతరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి ఉత్తీర్ణతా శాతం స్వల్పంగా పెరిగి, 0.36 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతంపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3 శాతం తగ్గగా, 95 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు 1 శాతం తగ్గారు. (ఫలితాలు వచ్చిన రోజు ఇదీ పరిస్థితి!) సీబీఎస్ఈ బోర్డు ఎటువంటి మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు. మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్మెంట్లో పాస య్యారు. మొత్తం మీద 1.84 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా, 41,000 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. గత సంవత్సరం 80.97 శాతం ఉండగా, ఈ సంవత్సరం ఉత్తీర్ణత 85.86 శాతంగా ఉంది. 99.23 శాతం ఉత్తీర్ణతతో కేంద్రీయ విద్యాలయాలు అగ్రస్థానంలో నిలవగా, 98.66 ఉత్తీర్ణతా శాతంతో జవహర్ నవోదయ విద్యాలయాలు తరువాత స్థానంలో నిలిచాయి. (సీబీఎస్ఈ ఫలితాలు.. సమానంగా కవలల మార్కులు) -
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ www.cbseresults.nicలో అందుబాటులో ఉంచినట్టు సీబీఎస్ఈ పేర్కొంది. అలాగే, www.cbse.nic.in వెబ్సైట్లో కూడా ఫలితాలు చూసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ప్రభుత్వ సర్వీసులను అందించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే, 011-24300699 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవడానికి వీలు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం సీబీఎస్ఈ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కరోనా మహమ్మారి తెరమీదకు రావడంతో కొన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించకుండానే వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశం ఇంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. కరోనా మహమ్మారి మరింత తీవ్రమవుతున్న పరిస్థితుల్లో మిగిలిన పరీక్షలను రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన రీతిలో మార్కులను కేటాయించిట్టు సీబీఎస్ఈ తెలియజేసింది. ఆ రకంగా అన్ని పరీక్షలకు మదింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బుధవారం తుది ఫలితాలను విడుదల చేశారు. 12వ తరగతి ఫలితాలు సీబీఎస్ఈ సోమవారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 18 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. (సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి). ఈ ఏడాది పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే ఇది 0.36 శాతం అధికం. ఫలితాల్లో బాలికలు అత్యధికంగా 93.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 90.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మొత్తం ఫలితాల్లో 41,804 (2.23 శాతం) మంది విద్యార్థులు 95 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. -
‘60 శాతం స్కోర్ చేశావ్.. చాలా గర్వంగా ఉంది’
న్యూఢిల్లీ : పిల్లలు పరీక్షల్లో నూటికి తొంభై శాతం మార్కులు సాధించినా కొందరు తల్లిదండ్రులు సంతృప్తి పడరు. వేలకువేలు పోసి చదివిస్తే.. ఈ మార్కులేనా అంటూ విమర్శలు. ఇలాంటివారిని చూస్తే.. అత్తెసరు మార్కులతో పాసయిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చదువనేది రూపాయలు పోసి కొనే వస్తువు కాదని వీరంతా ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. మన చుట్టూ దాదాపు అందరూ ఇలాంటి వారే. కాబట్టి కాసేపు వీరి విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫేస్బుక్లో వైరలవుతోన్న ఓ తల్లి మెసేజ్ గురించి మాట్లాడుకుందాం. రెండు రోజుల క్రితం సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు వచ్చాయి కదా. ఈ ఫలితాల్లో తన కుమారుడు 60 శాతం మార్కులతో పాసయ్యాడంటూ ఓ తల్లి చాలా గర్వంగా ఫేస్బుక్ వేదికగా ప్రకటించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆ వివరాలు.. ఢిల్లీకి చెందిన వందన సూఫియా కతోచి అనే మహిళ తన ఫేస్బుక్లో చేసిన ఈ పోస్ట్ ఎందరినో ఆకర్షించడమే కాక ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఈ మెసేజ్‌లో ‘10వ తరగతి బోర్టు ఎగ్జామ్స్‌లో 60 శాతం మార్కులతో పాసయిన నా కొడుకును చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు చదివింది నిజమే. నా కొడుకు సాధించింది 90 శాతం కాదు.. 60 శాతం మార్కులు మాత్రమే. తొంభై శాతం సాధించినా.. అరవై శాతం సాధించినా నా సంతోషంలో ఏ మాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే పరీక్షల ముందు కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో మా అబ్బాయి చాలా ఇబ్బంది పడ్డాడు. తప్పకుండా ఫెయిల్ అవుతాననే భావించాడు. దాంతో చివరి నెలన్నర చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. ఫలితం సాధించాడు’ అని తెలిపింది. అంతేకాక ‘ఈ మహా సముద్రంలో నీ లక్ష్యాన్ని నువ్వే ఎంచుకో. దాంతో పాటు నీ మంచితనాన్ని, తెలివిని, ఉత్సుకతను, హాస్య చతురతను కూడా సజీవంగా ఉంచుకో’ అంటూ కొడుకు సూచించింది వందన. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ మెసేజ్ ఇప్పటికే కొన్ని వేల లైక్‌లు, షేర్స్‌తో పాటు కామెంట్స్ కూడా అందుకుంది. ఓ తల్లిగా ఆమె కొడుకును అర్థం చేసుకున్న తీరును చాలా మంద్రి తల్లిదండ్రులు, విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. ‘మీరేవరో నాకు తెలీదు. కానీ మిమ్మల్ని చూస్తే చాలా చాలా గర్వంగా ఉందం’టూ కొందరు కామెంట్ చేయగా.. ‘మార్కుల గురించి వదిలేద్దాం. మన పిల్లల కష్టాన్ని గుర్తిద్దాం.. వారు చెప్పేది విని.. అండగా నిలుద్దాం’ అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. 91 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 17,61,078 పరీక్షలు రాయగా 16,04,428 విద్యార్థులు పాసయ్యారు. బాలురు కంటే బాలికలు 2.31 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 92.45 శాతం, బాలురు 90.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. 13 మంది విద్యార్థులు ఎఐఆర్ గ్రేడ్-1 సాధించారు. వీరంతా 500 గానూ 499 మార్కులు సాధించారు. టాపర్స్‌లో ఏడుగురు బాలురు, ఆరుగురు బాలికలు ఉన్నారు. 25 మంది విద్యార్థులు 500 గానూ 498 మార్కులు సాధించి ఎఐఆర్ గ్రేడ్-2 పొందారు. 59 మంది విద్యార్థులు(497/500) ఎఐఆర్ గ్రేడ్-3 దక్కించుకున్నారు. భారత్ వెలుపల 98 కేంద్రాల్లో 40,296 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసినట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. పదో తరగతి పాసైన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందనలు తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలు(99.47 శాతం), జవహర్ నవోదయ విద్యాలయాలు (98.57 శాతం) మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల జవదేకర్ హర్షం ప్రకటించారు. -
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల ఫలితాలు (సీబీఎస్ఈ) శనివారం విడుదలయ్యాయి. మొత్తం 96.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 1.11 శాతం ఉత్తీర్ణత తగ్గింది. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. కాగా 5309 పాఠశాలలకు చెందిన 8,92,685 మంది బాలురు, 6,06,437 మంది బాలికలు కలిపి మొత్తం 14,99,122 మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్ఈ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://cbseresults.nic.in/class10/cbse102014.htmలో పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.