హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల ఫలితాలు (సీబీఎస్‌ఈ) శనివారం విడుదలయ్యాయి. మొత్తం 96.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది 1.11 శాతం ఉత్తీర్ణత తగ్గింది. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు.
కాగా 5309 పాఠశాలలకు చెందిన 8,92,685 మంది బాలురు, 6,06,437 మంది బాలికలు కలిపి మొత్తం 14,99,122 మంది విద్యార్థులు ఈ ఏడాది సీబీఎస్‌ఈ నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ http://cbseresults.nic.in/class10/cbse102014.htmలో పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.