డిగ్రీ ముల్యాంకనంలో ముసలం!
Published Mon, Dec 12 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
- చీఫ్‌ల నియామకంలో వివాదం
- ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు
- ముల్యాంకనాన్ని బహిష్కరించిన ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు
- రెండు రోజులుగా నత్తనడకన గణితం, కెమిస్ట్రి సబ్జెక్టుల ముల్యాంకనం
కర్నూలు సిటీ: రాయల సీమ వర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీ సెమిస్టర్ పరీక్షల ముల్యాంకనంలో ముసలం పుట్టింది. బి క్యాంపు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనం పర్యవేక్షణ కోసం చేపట్టిన చీఫ్‌ల నియమాకాలకు సంబంధించి ప్రభుత్వం, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీల అధ్యాపకుల మధ్య వివాదం చేలరేగింది. దీంతో ఎయిడెడ్, ఆన్‌ఎయిడెడ్ కాలేజీలకు చెందిన గణితం, రసాయన శాస్త్రాల అధ్యాపకులు విధులను బహిష్కరించడం చర్చనియాంశంగా మారింది. ఈ నెల 10 తేదీ నుంచి మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల మూడవ దశ కింద జువాలజి, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు సంబంధించిన ముల్యాంకనం జరుగుతోంది. స్పాట్ ఎవాల్యుయేషన్ జరుగుతున్న కేంద్రమైన పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతున్ క్యాంపు ఆఫీసర్‌గా ఉన్నారు. ఇద్దరు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా ఉన్న వారిలో ఒక్కరు స్ట్రాంగ్ రూంకు, మరొకరు ఎవాల్యుయేషన్ జరిగే కేంద్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. ప్రతి సబ్జెక్టు ఎవాల్యుయేషన్‌కు హాజరయ్యే అసిస్టెంట్ ముల్యాంకన అధికారుల సంఖ్యను బట్టీ ప్రతి ఐదుగురిలో ఒకరిని చీఫ్ ఎవ్యాలుయేషన్‌గా నియమించాలి. కానీ అసిస్టెంట్ క్యాంపు అధికారి యూనివర్సిటీ నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తక్కువ సర్వీస్ ఉన్న వారిని నియమించారనే విమర్శలున్నాయి. ఈ కారణంతోనే ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు స్పాట్ విధులను బహిష్కరించినట్లు వారు చెబుతున్నారు. రాయల సీమ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ డీగ్రీ కాలేజీలు 14, ఎయిడెడ్ కాలేజీలు 10, ప్రైవేటు, ఆన్ ఎయిడెడ్ కాలేజీలు 71, లా కాలేజీ 1 ప్రకారం మొత్తం 96 కాలేజీలున్నాయి.
ఇవీ నిబంధనలు...
- ఏ యూనివర్శిటీ పరిధిలోనైనా పరీక్షల ముల్యాంకనానికి వెళ్లేందుకు బోధనలో ఒకే కాలేజీలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
- వీరిని అసిస్టెంట్ ఎవాల్యుయేషన్‌గా పరిగణించాలి.
- ప్రభుత్వ, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ కాలేజీలకు సంబంధించి బోధనలో కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉన్న వారిని చీఫ్ ఎవాల్యుయేషనర్(సీఈ)గా నియమించాలి. ప్రస్తుతం ఈ అనుభవాన్ని పదేళ్లకే కుదించారు.
ప్రస్తుతం ఇలా పాటిస్తున్నారు...!
-చీఫ్ ఎవాల్యుయేషనర్లుగా 40 శాతం ప్రభుత్వం కాలేజీల వారు, 60 శాతం ఎయిడెడ్ అధ్యాపకులు ఉండాలనే నిబంధన తెచ్చారు.
- 10 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న వారిని కాదని, మూడేళ్ల అనుభవం ఉన్న ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులను సీఈలుగా నియమించారు.
సీఈలుగా అనుభవం లేని వారిని నియమించారు
- పి.వి భాస్కర్‌రెడ్డి, గణితం శాస్త్ర అధ్యాపకులు
ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో జరుగుతున్న ముల్యాంకనంలో నిర్దిష్ట అనుభవం లేని వారిని సీఈలుగా నియమిస్తున్నారు. సీఈలుగా 40 శాతం ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులే ఉండాలని అసిస్టెంట్ క్యాంపు అధికారి చెబుతున్నారు. నిబంధనలు విరుద్దంగా చేయడం వల్లే ముల్యాంకనాన్ని బహిష్కరించాం.
సబ్జెక్టు బోర్డు చైర్మన్లను సంప్రదించకుండానే....
-ఎం.వి.ఎన్.వి ప్రసాద్ గుప్తా, రసాయన శాస్త్ర అధ్యాపకులుl
సబ్జెక్టు బోర్డులోని సీనియర్స్‌తో సంప్రదించకుండానే సీఈ, ఏఈ టీంలను తయారు చేస్తున్నారు. అసిస్టెంట్ క్యాంపు అధికారుల తీరు మార్చుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదు. యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల విబాగం కంట్రోలర్‌లు స్పందించాలి.
ఆన్ ఎయిడెడ్ వారి కోసమే..
- డా. యన్ రంగారెడ్డి, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్
యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే నియమించాం. ఆన్‌ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను కూడా సీఈలుగా నియమించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా చేయలేమని చెప్పడంతోనే గణితం, రసాయన శాస్త్రం ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులు వెళ్ళిపోయారు. ఆన్ ఎయిడెడ్ కాలేజీ అధ్యాపకులను సీఈలుగా నిబంధనలకు విరుద్దంగా చేయడం కుదరదనే చెప్పాం.
Advertisement
Advertisement