డిగ్రీ రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Published Mon, May 29 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
కర్నూలు (ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీ ఏప్రిల్–2017 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రివాల్యుయేషన్‌కు మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ నెల 5వ తేదీలోపల www.ruexms.in అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రివాల్యుయేషన్ ఫీజు రూ.300ను విద్యార్థులు ఆయా కళాశాలల్లోనే చెల్లించాలన్నారు. ఒక్క సబ్జెక్టు మాత్రమే ఫెయిలైన మూడో సంవత్సరం విద్యార్థులు మాత్రం ఇన్‌స్టంట్ పరీక్షకు రూ.1500 ఫీజు చెల్లించి జూన్ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇన్‌స్టంట్ పరీక్ష జూన్ 20వ తేదీన జరుగుతుందన్నారు. కళాశాలల యాజమాన్యాలు..విద్యార్థుల జాబితా, ఆన్‌లైన్ చలానాలను జూన్ 7వ తేదీలోపల వర్సిటీకి చేర్చాలని పేర్కొన్నారు.
Advertisement