వెంగళరావునగర్: అవిభక్త కవలలైన వీణావాణీలకు దేవుడు కొంత అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వంతుగా తగిన న్యాయం చేస్తున్నారని మం త్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో వీణావాణీలు ఫస్ట్‌క్లాస్ మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ వారం మధురానగర్‌లోని మహిళా శిశుసం క్షేమ శాఖ కార్యాలయం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న వీరిని మంత్రులు కలిశారు.
తొలుత వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు ఏం చదవాలని అనుకుంటు న్నారని వీణావాణీలను ప్రశ్నించగా.. దానికి వారు తాము సీఏ చదవాలని అనుకుంటున్నామని సమాధానం చెప్పారు. కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేని కారణంగా సీఏ చదివితే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వారి మాటలకు స్పందించిన మంత్రులు తప్పనిసరిగా మీ చదువులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇప్పటికే వీణావాణీల తల్లికి ఇక్కడే ఉద్యోగం ఇచ్చారు. వీణావాణీలు సీఏ చదవడానికి శ్రీమేధ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నామని, వారికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment