సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారంలో వెలువడనున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధ్యమైనంత వరకు ఈనెల 15న ఫలితాలను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 15న ఫలితాల విడుదల వీలుకాకపోతే 17న వెల్లడించాలని భావిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకునే వెబ్ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. దీంతో ఈనెల 20–23 తేదీల మధ్య డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తానికి వచ్చే నెలలో మొదటి దశ సీట్ల కేటాయింపును దోస్త్ ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment