ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్ చేసే ఆలోచన బోర్డుకు లేదని అధికారులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వెల్లడించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్‌మెంట్ రూపంలో నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ 1, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.
చదవండి: ఇంటర్‌లో 30% సిలబస్ కోత
Comments
Please login to add a commentAdd a comment