
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టు మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ బోర్డుతో గ్లోబరీనా సంసథ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు. అయితే రాపోల్ భాస్కర్ పిటిషన్‌పై హైకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు వైఫల్యాలపై పలువరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment