Rapolu Bhaskar
-
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు రాపోలు. అందరి సమక్షంలో టీఆర్ఎస్ సభ్యుడిగా చేరటం సంతోషంగా ఉందన్నారు. ‘తెలంగాణ విజయ రథ సారథి సీఎం కేసీఆర్ భారీ సంకల్పంతో తెలంగాణ భూ గర్భాన్ని నది గర్భంగా మార్చారు. తెలంగాణ ప్రజల పెద్ద కొడుకు కేసీఆర్. జనగామ పోరాటాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు హద్దులు దాటడం అంటే ప్రాణసంకటం. మిషన్ భగీరథను నేను వేరే పార్టీలో ఉన్నప్పుడే పొగిడాను. మంచిని మంచి అనడంలో అస్సలు తప్పు లేదూ.’ అని పేర్కొన్నారు మాజీ ఎంపీ. అంతుకుముందు గత ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ చేరిక అనంతరం చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు కేటీఆర్. నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘నేత కార్మికులను కేంద్రం చిన్న చూపు చూస్తోంది. భారత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదు. నేతన్నలకు చేనేత పథకంతో సాయం అందిస్తున్నాం. వస్త్రాల ఉత్పత్తిలో చైనా, బంగ్లాదేశ్ మనకంటే ముందున్నాయి. దానిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు మన నేతన్నల్లో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి.’ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. కేసీఆర్‌తో భేటీ -
లాక్డౌన్: 100 కోట్లకు వడ్డీ చెల్లించండి
సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన రూ. 100 కోట్లు ఫండ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చిన వడ్డీని న్యాయవాదులకు అందించాలని అడ్వకేట్ రాపోలు భాస్కర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటినర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపిస్తూ.. లాక్డౌన్ కారణంగా న్యాయవాదులు కేసులు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో కేటాయించిన రూ.100 కోట్ల ఫండ్‌కు వచ్చిన వడ్డీని కరోనా కష్ట కాలంలో న్యాయవాదులకు ఇచ్చి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు విడుదల చేసిందని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ.. తాజాగా కేటాయించిన 25 కోట్ల గురించి తాము అడగడం లేదని, గతంలో ఇచ్చిన 100 కోట్ల న్యాయవాదుల ఫండ్ గురించి అడుగుతున్నామని వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. అలాగే రూ. 25 కోట్లు ఏ ప్రాతిపదికన న్యాయవాదులకు ఇస్తున్నారో రేపటిలోగా (బుధవారం) తెలపాలని ప్రభుత్వానికి తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి (బుధవారం) వాయిదా వేసింది. (అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించకండి) జర్నలిస్ట్‌లను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1391284009.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టు మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ బోర్డుతో గ్లోబరీనా సంసథ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు. అయితే రాపోల్ భాస్కర్ పిటిషన్‌పై హైకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు వైఫల్యాలపై పలువరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్
-
అసెంబ్లీ రద్దు.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.