
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.