సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు రాపోలు. అందరి సమక్షంలో టీఆర్‌ఎస్ సభ్యుడిగా చేరటం సంతోషంగా ఉందన్నారు.
‘తెలంగాణ విజయ రథ సారథి సీఎం కేసీఆర్ భారీ సంకల్పంతో తెలంగాణ భూ గర్భాన్ని నది గర్భంగా మార్చారు. తెలంగాణ ప్రజల పెద్ద కొడుకు కేసీఆర్. జనగామ పోరాటాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు హద్దులు దాటడం అంటే ప్రాణసంకటం. మిషన్ భగీరథను నేను వేరే పార్టీలో ఉన్నప్పుడే పొగిడాను. మంచిని మంచి అనడంలో అస్సలు తప్పు లేదూ.’ అని పేర్కొన్నారు మాజీ ఎంపీ. అంతుకుముందు గత ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ చేరిక అనంతరం చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు కేటీఆర్. నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన‍్నారు. ‘నేత కార్మికులను కేంద్రం చిన్న చూపు చూస్తోంది. భారత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదు. నేతన్నలకు చేనేత పథకంతో సాయం అందిస్తున్నాం. వస్త్రాల ఉత్పత్తిలో చైనా, బంగ్లాదేశ్ మనకంటే ముందున్నాయి. దానిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు మన నేతన్నల్లో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి.’ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఎంపీ రాపోలు.. కేసీఆర్‌తో భేటీ
Comments
Please login to add a commentAdd a comment