Munugode By Elections 2022: Telangana Minister KTR Criticizes BJP Over ByPolls - Sakshi
Sakshi News home page

Minister KTR: బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉంది

Published Wed, Nov 2 2022 6:09 PM | Last Updated on Wed, Nov 2 2022 7:01 PM

Munugode By Poll 2022 Telangana Minister KTR Criticizes BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మునుగోడు మండలంలోని పలివెలలో జరిగిన ఘర్షణను సూచిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీ నుంచి ఆదేశాలతోనే బీజేపీ హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్‌ఎస్‌ అని ‍స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఢిల్లీ నుంచి ఆదేశాలతో బీజేపీ హింసకు పాల్పడుతోంది. ఎవరు ఎవరి మీద ఎవరు దాడి చేసరో వీడియోలు ఉన్నాయి. ఈటల పీఏ రాళ్ల దాడి చేశారు. మా పై దాడి చేసి.. మళ్ళీ సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాంతి ఉంది. బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉంది. బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. మునుగోడులో బీజేపీ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఇదే సంస్కృతి కొనసాగిస్తే.. మేము తిరగబడతాము. బీజేపీ,మోదీలు ఫేకులు.’అని విమర్శలు గుప్పించారు కేటీఆర్‌. 

ఇదీ చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement