![Minister KTR Comments On Komatireddy Rajagopal Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/KTR-1.jpg.webp?itok=85L7V8q7)
సాక్షి, నల్గొండ: కేసీఆర్ పెన్షన్లు పెంచితే.. మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ, దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటారని దుయ్యబట్టారు.
చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్
కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తిరుమలకు ధీటుగా యాదాద్రిని కేసీఆర్ అభివృద్ధి చేశారు. పాకిస్తాన్, హిందూస్తాన్ తప్ప, పనికొచ్చే ముచ్చట్లు చెప్పరు. కేసీఆర్ కంటే మోదీ పెద్ద హిందువా?. కూసుకుంట్లను గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకుంటా.. ప్రతి మూడు నెలలకోసారి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment