Rapolu Ananda Bhaskar
-
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు రాపోలు. అందరి సమక్షంలో టీఆర్ఎస్ సభ్యుడిగా చేరటం సంతోషంగా ఉందన్నారు. ‘తెలంగాణ విజయ రథ సారథి సీఎం కేసీఆర్ భారీ సంకల్పంతో తెలంగాణ భూ గర్భాన్ని నది గర్భంగా మార్చారు. తెలంగాణ ప్రజల పెద్ద కొడుకు కేసీఆర్. జనగామ పోరాటాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు హద్దులు దాటడం అంటే ప్రాణసంకటం. మిషన్ భగీరథను నేను వేరే పార్టీలో ఉన్నప్పుడే పొగిడాను. మంచిని మంచి అనడంలో అస్సలు తప్పు లేదూ.’ అని పేర్కొన్నారు మాజీ ఎంపీ. అంతుకుముందు గత ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ చేరిక అనంతరం చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు కేటీఆర్. నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘నేత కార్మికులను కేంద్రం చిన్న చూపు చూస్తోంది. భారత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదు. నేతన్నలకు చేనేత పథకంతో సాయం అందిస్తున్నాం. వస్త్రాల ఉత్పత్తిలో చైనా, బంగ్లాదేశ్ మనకంటే ముందున్నాయి. దానిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు మన నేతన్నల్లో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి.’ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. కేసీఆర్‌తో భేటీ -
మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. సీఎంతో భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేసి, చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని, బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతానని సీఎం కేసీఆర్‌తో చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద భాస్కర్ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. బీజేపీ వలస రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో కేసీఆర్ రచించిన మాస్టర్ ప్లాన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ దెబ్బతో కమలానికి గుడ్‌బై చెబుతూ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుకుంటున్నారు. ఇక ఇటీవల పల్లె రవికుమార్, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, బిక్షమయ్య గౌడ్, పనస రవికుమార్ వంటి వారు టీఆర్ఎస్ కండువా కప్పకున్న సంగ తితెలిసిందే. చదవండి: ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు -
తెలంగాణలో అసమర్థ పాలన: రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితా ల్లో తీవ్ర అన్యాయానికి గురైన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు వద్ద చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం కంటికి కనిపించవా? అని ప్రశ్నించారు. విద్యార్థుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యుడిగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చేస్తారా అని విద్యార్థి లోకం ఎదురు చూస్తోందన్నారు. గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంశయం ఏర్పడటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. -
కాషాయ తీర్థం పుచ్చుకున్న రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన ఇక్కడ ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీనియర్ నేత అరుణ్ జైట్లీ తదితరులను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘25 ఏళ్ల ప్రస్థానం తర్వాత కాంగ్రెస్‌ను వీడాను. 15 రోజుల అంతర్మథనం తర్వాత బీజేపీలో చేరాను. సైద్ధాంతిక విధానం, ప్రాంతీయ భావజాలం వంటివి లేని కాంగ్రెస్‌లో ఉండలేకపోయాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, దేశ సమగ్రతకోసం బీజేపీలో చేరాను. చేనేత సామాజిక వర్గానికి ఆత్మగౌరవం కల్పించేలా ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించి బీజేపీ నా కృషిని గుర్తించింది. తెలంగాణ అభివృద్ధి, చేనేత కార్మికుల కోసం కృషి చేస్తాను. ఇవన్నీ బీజేపీతోనే సాధ్యమని నమ్మాను’అని రాపోలు పేర్కొన్నారు. -
బీజేపీలో చేరిన రాపోలు ఆనంద భాస్కర్
సాక్షి, న్యూ ఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గురువారం బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం చెందారు. పార్టీలోఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఆనంద భాస్కర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌కు మరో ఇద్దరు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వికెట్లు రోజుకు కొన్ని చొప్పున పడిపోతున్నాయి. వరుస వలసలతో కంగుతింటున్న ఆ పార్టీకి మరో ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్, మహబూబ్‌నగర్‌కు చెందిన చిత్తరంజన్‌దాస్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఈమేరకు రాపోలు ఇక్కడ తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిత్రులారా..మీ ద్వారా భారమైన ఒక అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తల శ్రేణికి, తెలంగాణ ప్రజానీకానికి ప్రకటిస్తున్నా. 25 ఏళ్ల క్రియాశీలక కార్యకర్తగా అనుబంధం తర్వాత కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశాను. మాతృ హృదయంతో ఆదరించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపాను. సంస్థాగత వ్యవహారాల బాధ్యుడిగా, మేనిఫెస్టో రూపశిల్పిగా, పొత్తులను నిర్ధారించిన వ్యక్తిగా, సమన్వయ కర్తగా బాధ్యతలు నిర్వహించాను. ఆరేళ్లపాటు రాజ్యసభలో ప్రతి ప్రస్తావనలో సంస్థ ఔన్నత్యాన్ని చాటాను. అగమ్య గోచరమైన స్థితిలో, అపసవ్య స్థితిలో అంతర్గత వ్యవహారాలు కొనసాగుతున్న తరుణంలో అనేక సూచనలు చేశాను. కానీ వినిపించుకునే ఓపిక కాంగ్రెస్‌కు లేదని తేటతెల్లమైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాతే నేను రాజీనామా సమర్పించాను’అని పేర్కొన్నారు. అలాగే సీనియర్లకు పార్టీలో గౌరవం లేదని, సామాజిక సమతుల్యత లోపించిన కారణంగానే తాను కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు చిత్తరంజన్‌దాస్ హైదరాబాద్‌లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే వీరు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. ‘పార్టీకి ఎంత నిబద్ధతతో పని చేసినా, నాపట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరిస్తోంది. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా వ్యవహిరిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదు. నా రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించాను. అయితే ఏ పార్టీలో చేరతాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న నన్ను కావాలనే పక్కన పెడుతున్నారు. అయినా పార్టీ కోసం సంస్థాగతంగా కృషి చేశాను.’ అని తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వీడారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాపోలు కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీపై ప్రభావం పడనుంది. -
‘చేనేత’పై జీఎస్టీని తొలగించండి: రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: చేనేత రంగంపై జీఎస్టీ భారాన్ని తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విన్నవించారు. గురువారం ఆయన జైట్లీని కలసి వినతిపత్రం సమర్పించారు. జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు, చేతివృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. చేనేత, హస్తకళలకు ఉపయోగించే ముడిసరుకుపై ఎలాంటి పన్ను భారం మోపరాదని కోరారు. చేనేత, జౌళిపై జీఎస్టీ కారణంగా చైనా, ఇతర దేశాల నుంచి సంబంధిత ఉత్పత్తుల దిగుమతులను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతోందని తెలిపారు. అలాగే రైతాంగం ఉపయోగించే వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై కూడా జీఎస్టీని తొలగించాలని విన్నవించారు. వచ్చే నెల జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని జైట్లీ హామీనిచ్చినట్టు రాపోలు మీడియాకు వెల్లడించారు. -
ఎన్నికలపై జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: హడావుడిగా తెలంగాణ అసెం బ్లీకి ఎన్నికలు వద్దని.. పార్లమెంటుతో పాటే శాసనసభకు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘా న్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లంఘనలు ఏమిటో చెప్పకుండా ఎన్నికలను నిర్వహించరాదంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ధర్మాసనం నిలదీసింది. ఇతర రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలో లేక జమిలి ఎన్నికలు నిర్వహించాలో అన్నది కోర్టులు నిర్ణయించలేవని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైనదని, దాని విధుల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. చట్ట ఉల్లంఘన జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు చూపకుండా దాఖలు చేసే వ్యాజ్యాలను తాము అనుమతించలేమంటూ పిటిషన్‌ను కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సందేహాల నివృత్తికి కోర్టును వేదికగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లు అనిపిస్తోందని.. దీని వెనుక రాజకీయ ఎజెండా ఏమైనా ఉందా అంటూ ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. శాసనసభ రద్దయిన నేపథ్యంలో హడావుడిగా అసెంబ్లీకి ఎన్నికలు వద్దని, పార్లమెంటుతో పాటే అసెంబ్లీ ఎన్నికలు (జమిలి) కలిపి నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాసరెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలో జరిగిన చట్ట ఉల్లం ఘనలు ఏమిటని ప్రశ్నించింది. ప్రభుత్వ ముం దస్తు ఎన్నికల నిర్ణయం, గవర్నర్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వులు గానీ, ఈసీ పనితీరులో గానీ ఎక్కడైనా చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని కోరింది. కీలక అంశం కాబట్టే ఈసీకి నోటీసులిచ్చాం.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేసిన తర్వాత లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్వ్యస్థీకరణ చేయలేదని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక అంశం ముడిపడి ఉందని, అందుకే తాము స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశామని హైకోర్టు గుర్తు చేసింది. చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆధారాలుంటే తప్ప ఈసీ విధుల్లో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని తెలిపింది. -
చేనేత ఆత్మగౌరవం నిలబెడదాం
కోరుట్ల: చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశలో పోరాటం ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. కోరుట్ల పద్మశాలీ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచుర్యం కల్పించి కార్మికుల సంక్షేమానికి పాటుపడాలన్నారు. వర్తక, వాణిజ్య రంగాల్లో మార్గదర్శకులుగా ఉన్న పద్మశాలీలు సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కోరుట్ల పద్మశాలీ సంఘం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యక్తిగత వైషమ్యాలకు తావివ్వకుండా పద్మశాలీల సంక్షేమానికి పూర్తి సమయం ఇవ్వాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చేనేత కార్మికుల హక్కుల పరిరక్షణకు అలుపెరగకుండా ఉద్యమించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలీలు ఐక్యతకు ప్రతీ ఒక్కరు నిరంతరం పాటుపడాలన్నారు. ఐక్యంగా ముందుకు సాగితేనే సామాజికంగా, రాజకీయంగా తగిన గుర్తింపు వస్తుందన్నారు. నూతన అధ్యక్షుడు గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ, పద్మశాలీల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. వారి శ్రేయస్సుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొసికె యాదగిరి, ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్, ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మార్త రమేశ్, నాయకులు వాసం భూమానందం, సదుబత్తుల హరిప్రసాద్, చెన్న విశ్వనాథం, గుంటుక ప్రసాద్, జక్కుల ప్రసాద్, అల్లె సంగయ్య, జిల్లా ధనుంజయ్, వాసాల గణేష్‌లు పాల్గొన్నారు. కొత్త పాలకవర్గ ప్రమాణస్వీకారం పద్మశాలీ సంఘం నూతన అధ్యక్షుడిగా గుంటుక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రుద్ర సుధాకర్, ఉపాధ్యక్షులుగా మచ్చ రమేష్, సహాయ కార్యదర్శిగా జిందం లక్ష్మీనారాయణ, కోశాధికారిగా ఆడెపు నరేష్కుమార్, యువత అధ్యక్షుడిగా అందె రమేష్, ఉపాధ్యక్షుడిగా కటుకం వినయ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జక్కుల ప్రవీన్‌కుమార్, సహాయ కార్యదర్శిగా బండి సురేష్, కోశాధికారిగా చింతకింది ప్రేమ్‌కుమార్‌తో ఎన్నికల అధికారులు కాచర్ల శంకరయ్య, మార్గం రాజేంద్రప్రసాద్, కడకుంట్ల సదాశివ్‌లు ప్రమాణ స్వీకారం చేయించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరణ కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని రాజ్యసభ సభ్యులు రాపోల్ ఆనంద భాస్కర్ ఆవిష్కరించారు. -
వెళ్లొద్దన్నా వచ్చిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు పలువురు ఈ విందుకు హాజరయ్యారు. అయితే గవర్నర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని టీ-కాంగ్రెస్ నేతలు ఈ విందును బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ మంత్రి దానం నాగేందర్‌లు విందుకు హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై రాపోలు ఆనంద భాస్కర్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి సమాచారం లేదని, వెళ్లొద్దని చెబితే వెళ్లేవాడిని కాదని, పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. కాగా ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాలేదు.. -
రిటైర్డ్ ప్రైవేటు ఉద్యోగులకు పింఛన్ ఇవ్వండి
► కేంద్రానికి ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ వినతి న్యూఢిల్లీ: ప్రైవేటు, ఇతర రంగాల్లో ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పింఛన్ వసతి కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కోరారు. ఉద్యోగ విరమణ చేసిన ప్రైవేటు ఉద్యోగులకు పింఛన్, వైద్య సదుపాయాలు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. తమకు కనీస పింఛన్ రూ. 3 వేలు ఇవ్వాలని 60 లక్షల మంది ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. పింఛన్ లేని ప్రైవేటు, సెమీ గవర్నమెంట్, ఇతర రంగాల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ప్రైవేటు ఉద్యోగులకు వైద్య సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ ఉభయసభల్లో చెబుతున్న నేపథ్యంలో వీరికి కనీస పింఛన్ నెలకు రూ. 3 వేలు ఇవ్వాలని ఆయన కోరారు. -
ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అండగా ఉండాలి
ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ఇథియోపియాలో పర్యటన పాలకుర్తి టౌన్: ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో ఉన్న ప్రవాస భారతీయులకు భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం అండ గా నిలబడాల్సిన అవసరం ఉందని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఆదివా రం ఇథియోపియాలో ఎంపీ రాపోలు, పలువురు పర్యటించారు. వారి బృందానికి ఆ దేశ రాజధాని నగరం అడిస్ అబాబాలో ఇండియన్ బిజినెస్ ఫోరానికి చెందిన మయూరి కోఠారి, దౌత్య వ్యవహారాల అధికారి అశోక్‌కుమార్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఎంపీ రాపోలు మాట్లాడారు. అనంతరం ఎంపీ అర్జున్‌లాల్ మీనా మాట్లాడుతూ భారత ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బృందంలో ఐఏపీడీ అర్జున్ శర్మ, తదితరులు ఉన్నారు. -
డీఎస్ బాటలో రాపోలు?
- కాంగ్రెస్‌ను వీడి కారెక్కే యోచన - మాట్లాడుకుందామంటూ ఉత్తమ్ ఫోన్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్దన్నగా ఉంటూ, ‘అవమానం భరించలేకపోతున్నా’నంటూ పార్టీని వీడిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) బాటలోనే రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ కూడా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు డీఎస్ ఆశీస్సులున్నాయని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కున్న అతి కొద్దిమంది ఎంపీల్లో ఒకడినైన తనకు ఏడాదిన్నరగా తగిన విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామిని చేయడం లేదని రాపోలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌లవి రాచరిక పోకడలంటూ ఆక్షేపిస్తున్నారు. కనీసం కార్యకర్తల్లో కూడా విశ్వాసం నెలకొల్పలేని ఇలాంటి నాయకత్వంతో 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయన భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ‘డీఎస్ పార్టీని వీడితే వీళ్లంతా పండగ చేసుకున్నారు. బీసీలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ వాపోయారని వారంటున్నారు. కాంగ్రెస్‌ను వీడాలన్న రాపోలు యోచన వెనక స్వీయ రాజకీయ అవసరాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన సొంతూరు వరంగల్ జిల్లా కొడకండ్ల పాలకుర్తి అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని యోచన చేస్తున్నారు. తనకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యత్వం తిరిగి దక్కదని,అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నెగ్గే పరిస్థితీ లేదన్నది ఆయన భావన. పైగా పాలకుర్తిలో రెడ్డి సామాజిక వర్గ నేతను పీసీసీ నాయకత్వం ప్రోత్సహిస్తున్నందున అధికార టీఆర్ఎస్లోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీగా రాపోలు పదవీకాలం 2018 దాకా ఉన్నా పాలకుర్తి స్థానంపై పట్టు కోసం ఇప్పటి నుంచి రంగంలోకి దిగాలని భావిస్తున్నారంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న డీఎస్ ఆశీస్సులతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌తో సంవాదం పీసీసీ నాయకత్వంపై రాపోలు వ్యాఖ్యల అనంతరం శుక్రవారం సాయంత్రం ఉత్తమ్ ఆయనకు ఫోన్ చేసినట్టు సమాచారం. ‘ప్రతి సమాచారాన్నీ డీసీసీ అధ్యక్షుడు మీకు ఫోన్లో తెలిపారు. ఇంకెలా తెలియపరచాలి?’ అని అడగ్గా రాపోలు తన ఆవేదనంతా వెళ్లగక్కినట్టు తెలిసింది. ‘ఎంపీనైన నాకు కనీసం ఫోనైనా చేసి చెప్పరా? ఎందుకిలా పక్కన పెట్టారు? బలహీన వర్గాలంటే చిన్నచూపెందుకు?’ అంటూ నిలదీశారంటున్నారు. గాంధీభవన్‌కు వస్తే మాట్లాడుకుందామని పిలిచినా, ‘ఆ సంగతి తరవాత చూద్దాం. ఎప్పట్లాగే నన్ను పక్కన పెట్టేయండి’ అంటూ రాపోలు స్పందించినట్టు తెలుస్తోంది. బీసీల అణచివేతకు కుట్ర తెలంగాణ కాంగ్రెస్‌లో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల నేతలను చిత్తు చేసేందుకు ఒక ఎత్తుగడ ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ తరఫున తెలంగాణ సాధనలో భాగంగా పార్లమెంటులో అగ్ర నాయకత్వంతో పాటు నా భూమిక, పాత్ర భరించలేని వారందరూ కలగలిపి జరుపుతున్న కుట్రగా నేను భావిస్తున్నా. దాన్ని వివిధ దశల్లో విభిన్న రీతుల్లో చెబుతూ వచ్చాను. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు రాహుల్‌గాంధీ వచ్చారు. ముందు రోజే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలన్నింటితో మాట్లాడాను. నావంతు ఆర్థిక సాయం కూడా చేశా. తెల్లవారితే మా నాయకుడు రాబోతున్నాడని చెప్పివచ్చా. తెల్లవారి చూస్తే ఆహ్వానించే బృందంలో కూడా నా పేరు లేకుండా చేశారు. ఇలాగే రకరకాల కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యథకు గురిచేస్తూ, అవమానిస్తూ వచ్చారు. వరంగల్ జిల్లాలో నర్సంపేటలో రైతు భరోసా యాత్ర చేశారు. అసలు ఆ పేరే కరెక్టు కాదు. ఆ యాత్రకు రూపకల్పన చేసినప్పుడు నన్ను అసలు సంప్రదించనే లేదు. మనకు మనమే విశ్వాసం కల్పించుకునే పరిస్థితి లేదు. ఇంకొకరికి ఏం కల్పిస్తాం? రైతుల కోసం మనం నిరసన వ్యక్తం చేయగలుగుతాం. పోరాటం చేయగలుగుతాం. భరోసా ఇవ్వడానికి మనకు అధికారముందా? వరంగల్లు జిల్లాలో ఫలానా కార్యక్రమం చేస్తున్నామని చెప్పొద్దా? నేను అట్టడుగు వర్గానికి చెందినవాడినే కావొచ్చు. నేనేం నేరుగా పార్లమెంటులోకి ఊడిపడలేదు. గడియ గడియకు ప్రజల్లో మమేకమవుతున్నవాడిని. కానీ కనీసం నాకు సమాచారం లేదు. జిల్లా కమిటీ నుంచి సమాచారం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో నేను సంస్థాగత కార్యక్రమాలను దశాబ్దకాలంగా నిర్వహించిన వాడిని. శిక్షణ ఇచ్చినవాడిని. కనీసం కార్యక్రమం రూపొందించినప్పుడు సంప్రదించలేరా?’ అంటూ ఉత్తమ్‌పై నిప్పులు చెరిగారు. దిగ్విజయ్ వ్యవహార శైలిపై ‘నిన్నగాక మొన్న ఏఐసీసీ ఇంఛార్జి వెళ్లారు. ఇంకెవరో వెళతారు. కనీసం ఫోన్ చేసి చెప్పేందుకు ఒక అటెండర్ లేరా? ఓ యాభై మంది ఎంపీలు లేరు కదా? మీరు చాలా పెద్దోళ్లు కావొచ్చు. జాతీయ, అంతర్జాతీయ నాయకత్వం కావొచ్చు మీది. కనీసం మీ ఆఫీస్ నుంచి ఒక అటెండర్ ద్వారానైనా సమాచారం ఇవ్వొచ్చు కదా? పీసీసీ అధ్యక్షుడు అంతకంటే బిజీగా ఉన్నాడా? ఒక్కసారి సంప్రదించలేడా? వీటన్నింటినీ భరించాను. నేను ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని. ఆ రాష్ట్రం నుంచి ఉన్న ప్రతినిధిని. మరి ఇంఛార్జి వస్తున్నారని ఆదేశించలేరా?’ అని పేర్కొన్నారు. ఎందుకు ఇలా జరుగుతోందని అనుకుంటున్నారని ప్రశ్నించగా ‘అట్టడుగు వర్గాల ఆత్మగౌరవం దెబ్బతీసేందుకు పన్నుతున్న ఒక వ్యూహం, ఒక కుట్రగా అనుకుంటున్నాం..’ అన్నారు. ఎవరు చేస్తున్నారని ప్రశ్నించగా ‘ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. నేనెప్పుడూ ఫిర్యాదు చేయలేదు. నేను వీళ్ల దగ్గర క్యూ కట్టలేదు. అందరూ కలసి కుట్ర చేస్తున్నట్టుగానే భావిస్తున్నా..’ అని పేర్కొన్నారు. పార్టీని వీడే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘నేను నిజాయతీగల కార్యకర్తను. పార్టీని ఎన్నడూ ఎదిరించలేదు. నేతల వ్యవహారం శ్రుతి మించడంతోనే ఇలా మాట్లాడాల్సి వచ్చింది..’ అని పేర్కొన్నారు. -
నాకు అడుగడుగునా అవమానాలే...
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న రాపోలు
వేములవాడ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ దర్శించుకున్నారు. ఆయన ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కాగా ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
ప్రజారోగ్యాన్ని కాపాడండి: ఎంపీ రాపోలు
హైదరాబాద్ : తెలంగాణలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాపోలు ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను కలసి తెలంగాణలో డెంగ్యూ జ్వరాల వ్యాప్తి, ప్రజారోగ్యానికి కలుగుతున్న ముప్పును వివరించి వినతి పత్రాన్ని అందచేశారు. వరంగల్ జిల్లాల్లో డెంగ్యూ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో వైద్య, ఆరోగ్య వ్యవస్థ గందరగోళంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డెంగ్యూ బాధితులను ఆదుకోవడానికి ప్రత్యేక బృందాలను తెలంగాణకు పంపాలని మంత్రికి విన్నవించారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ఎంపి రాపోలు!
-
టీఆర్ఎస్పై సీఈసీకి కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు
-
టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ ఆరోపించారు. ఇదే విషయంపై శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కలసి రాపోలు ఆనంద్ భాస్కర్ ఫిర్యాదు చేశారు. అనంతరం రాపోలు ఆనంద్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. రాపోలు ఆనంద్ భాస్కర్ వెంట ఎంఏ ఖాన్ కూడా ఉన్నారు. తెలంగాణ శాసనమండలకి ఎమ్మెల్యే కోటాలో జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుపించుకునేందుకు టీఆర్ఎస్కు అవకాశం ఉంది. కానీ ఐదుగురు అభ్యర్థులను రంగంలోకి దింపింది. అందులోభాగంగా ఐదో అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందుకోసం ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలలో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు... అధికార టీఆర్ఎస్పై సీఈసీకి ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
* రాజ్యసభలో రాపోలు డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఈ విషయమై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లు రాష్ట్ర విభజన ఫలితంగా ఏపీకే వెళ్లిపోయాయి. ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో ఆయా పాఠశాలలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లు రద్దు చేసుకోవాలని బెదిరింపులు వచ్చాయి. దీని ఫలితంగా రాష్ట్ర విద్యార్థులు అక్కడి సైనిక్ స్కూళ్లలో చదివే పరిస్థితి లేదు’ అని వివరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో సైనిక్ స్కూలు ఏర్పాటును పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
రైల్వే రవాణావిస్తరణ చేపట్టాలి
కాజీపేట రూరల్ : తెలంగాణలో రవాణా వ్యవస్థపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయం గా రైల్వే రవాణా విస్తరణ జరగాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. శుక్రవారం ఆయన కాజీపేట జంక్షన్‌ను సందర్శిం చారు. రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో కాజీపేట డిజిల్ లోకోషెడ్ సీనియర్ డీఎంఈ లచ్చిరాంనాయక్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ శివప్రసాద్‌తో సమావేశమయ్యూరు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీబీనగర్-నడికుడ మధ్య, జిల్లాలో జనగాం, పాలకుర్తి, కొడకండ్ల, సూర్యపేట మీదుగా రైల్వే లేన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సికింద్రాబాద్-జనగాం, కాజీపేట-కొత్తగూడెం, కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య సిటీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను ప్రవేశపెట్టాలన్నారు. ఆయన వెంట గంట నరేందర్‌రెడ్డి, కొప్పిరాల కృష్ణ, రైల్వే అధికారులు పి.సుధాకర్, బీఆర్.కుమార్, సజ్జన్‌లాల్, విజయరాజు, ధర్మారాజు, సుధాకర్, ఆర్పిఎప్ సీఐ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ సీఐలు రాజ్‌గోపాల్, రవికుమార్ ఉన్నారు. -
కాంబోడియా సదస్సుకు ఎంపీ రాపోలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఫోరం ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్, డెవలప్మెంట్(ఏఎఫ్‌పీపీడీ), కాంబోడియన్ ఎఫ్పీపీడీ సంయుక్త ఆధ్వర్యంలో కాంబోడియాలో నిర్వహించనున్న సదస్సులో రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు మూడు రోజులపాటు జరగనున్న సదస్సుల్లో రాపోలుతోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎంపీ విప్లవ్ఠాకూర్ పాల్గొననున్నారు. ‘మహిళలు, చిన్నారులపై హింసను అరికట్టడం’ అన్న అంశంపై ఎంపీ రాపోలు ఈ నెల 25న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎంపీ వెంట ఆయన సతీమణి సరోజ కూడా వెళుతున్నారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఈ నెల 27న వారు ఢిల్లీకి చేరుకుంటారు. -
టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలందరిదీ ఒకటే మాట!
ఢిల్లీ: ఎప్పుడూ ఎడ్డెం అంటే తెడ్డె అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులందరూ ఈ రోజు రాజ్యసభలో ఒకే కోరిక కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని టిఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనాచౌదరి, కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్లు కేంద్రాన్ని కోరారు. ఉద్యోగుల విభజన చేయకుంటే పాలనకు అనేక సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ఈ అంశంపై కేంద్రమంత్రి జితేందర్ సింగ్ స్పందించారు. కొద్ది వారాల్లోనే ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సర్వేపై తాము ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సుజనాచౌదరి చెప్పారు. సర్వేపై వివరణ మాత్రమే కోరినట్లు తెలిపారు. సర్వే వల్ల తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బందులేనన్నారు. -
రాజ్యసభలో సుజన, కేకే డిష్యూం డిష్యూం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు తెలుగు ఛానళ్ల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్బంగా ఎంపీలు సుజనా చౌదరి, కేకేలు ఒకరితోఒకరు వాగ్వివాదానికి దిగారు. తెలంగాణలోని ఛానళ్ల నిలిపివేతపై ఎంఎస్‌వోల అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా నిరసన తెలిపారు. ఎంఎస్‌వోలను తెలంగాణ ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కేకే జోక్యం చేసుకు... సుజనా చౌదరి ఆరోపణలు అర్థరహితమంటు వ్యాఖ్యానించారు. సుజన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కేకే ప్రకటించారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ జోక్యం చేసుకుని... పరిస్థితిని మొత్తం సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. మీడియా స్వేచ్ఛ, నియంత్రణ అంశాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోరాదని పలు రాజకీయ పక్షాలకు హితవు పలికారు. అమెరికా, బ్రిటన్ దేశాలలో ఉన్న మీడియా రెగ్యులేషన్ సంస్థలను పరిగణనలోకి తీసుకోవాలి రాపోలు సూచించారు. -
'కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉంది'
కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అభివర్ణించారు. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బడ్జెట్‌పై ప్రసంగించిన అనంతరం పార్లమెంట్ వెలుపల రాపోలు ఆనంద భాస్కర్ స్పందించారు. ఈ బడ్జెట్ కార్పొరేట్ వ్యవస్థల పరిరక్షణకు దోహదపడేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత, సంక్షేమానికి విఘాతం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు అంతగా ఒరిగేదేమి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. -
మనోళ్లు.. మనకే
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో చేపట్టిన రాజ్యసభ సభ్యుల కేటాయింపు ప్రక్రియపై నెలకొన్న టెన్షన్ తొలగిపోయింది. జిల్లాకు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు తెలంగాణ రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియలో.. జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులు తెలంగాణకే కేటాయించబడ్డారు. రాష్ట్రం యూనిట్‌గా లాటరీ పద్ధతి నిర్వహించడంతో ఎవరు ఏ ప్రాంతానికి వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై రాజ్యసభ సభ్యుల్లోనూ టెన్షన్ నెలకొంది. లాటరీ పక్రియ ముగియడంతో ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో 18 మంది రాజ్యసభ సభ్యులున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాపోలు ఆనందభాస్కర్, టీడీపీ నుంచి గుండు సుధారాణి, గరికపాటి మోహన్‌రావులు రాజ్యసభ సభ్యులుగా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడే తరుణంలో 11 మంది సభ్యులను ఆంధ్రప్రదేశ్‌కు, ఏడుగురిని తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నారు. ఎవరిని ఏ ప్రాంతానికి కేటాయించాలనే విషయంపై తేల్చేందుకు లాటరీ పద్ధ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుల కేటాయింపు కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. 2016లో ఐదుగురు సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన గుండు సుధారాణి పదవీకాలం 2016 లోనే ముగియనుంది. లాటరీ కావడంతో ఎలా ఉంటుందోనన్న సందేహం వీడింది.సుధారాణి తెలంగాణకే ప్రాతినిధ్యం వహించేలా లాటరీలో నిర్ణయించారు. 2018లో పదవీకాాలం ముగియనున్న వారిలో ముగ్గురిని తెలంగాణకు కేటాయించారు. జిల్లాకు చెందిన రాపోలు ఆనందభాస్కర్ పదవీకాలం 2018లోనే ముగుస్తోంది. లాటరీలో ఆనందబాస్కర్ తెలంగాణకే వచ్చారు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గరికపాటి మోహన్‌రావు పదవీకాలం 2020లో ముగియనుంది. ఇంకా బాధ్యతలు చేపట్టని మోహన్‌రావు లాటరీలో ఏ రాష్ట్రానికి ఎంపికవుతారనే సందేహం వీడింది. లాటరీలో మోహన్‌రావు తెలంగాణకే వచ్చారు. -
సుష్మా స్వరాజ్ సహకారం మరువలేనిది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం పై బీజేపీ సీనియర్ నేత సుప్మా స్వరాజ్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. విభజన బిల్లు రాజ్యసభ వచ్చిన సందర్భంగా రాపోలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాన కారణమైతే, బిల్లు ఆమోదం పొందడానికి సుష్మా స్వరాజ్ కూడా ఒక కారణమన్నారు. ఆమె అందించిన సహకారం ఎనలేనిదిగా రాపోలు అభివర్ణించారు. సోనియాను తెలంగాణ ప్రజలు రాష్ట్ర దేవతగా ఆరాధిస్తున్నారని తెలిపారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రానికి సూచించారు. -
‘ఆత్మగౌరవం కోసమే విభజన కోరుతున్నాం’
న్యూఢిల్లీ: ఆత్మగౌరవం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనను కోరుతున్నామని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రలో ఆ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో పుష్కలంగా నీటి వనరులున్నాయన్నారు. తెలంగాణ వాసులు కోస్తాలోని వనరుల్లో వాటా కోరడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు కోరుతున్నది రాష్ట్ర విభజనను కాదని, ప్రత్యేక తెలంగాణ డిమాండ్ అని ఆయన అన్నారు. . 2001 నుంచి కాంగ్రెస్ ఎజెండాలో తెలంగాణ ఏర్పాటు అంశం ఉందన్నారు. -
ప్రశాంతంగానే విభజన ప్రక్రియ: రాపోలు
రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రశాంతంగానే జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. ప్రక్రియ సాఫీగా సాగుతుందనే సంకేతాలు అధిష్టానం నుంచి సంకేతాలున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. కాగా అంతకు ముందు తెలంగాణ ఎంపీలు... కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేదితో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగవతం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలకు అధిష్టానం కొన్నిసలహాలు, సూచనలు ఇచ్చిందని అన్నారు. తెలంగాణ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని తాను అన్నట్టుగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని మరో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరణ ఇచ్చానని తెలిపారు.