
సాక్షి, న్యూ ఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గురువారం బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం చెందారు.
పార్టీలోఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఆనంద భాస్కర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.