join bjp
-
Haryana Political Crisis: బీజేపీ గూటికి కిరణ్ చౌదరి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి, ఆమె కూతురు శ్రుతి చౌదరిని కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీల సమక్షంలో వీరిద్దరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు. కిరణ్ చౌదరి ఎమ్మెల్యే కాగా, శృతి హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ. హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు కిరణ్. హరియాణా కాంగ్రెస్ పార్టీని సొంత జాగీరులా నడుపుతున్నారని తన బద్ధ విరోధి, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాపై కిరణ్ ధ్వజమెత్తారు. -
మళ్లీ రాజకీయాల్లోకి తమిళిసై
సాక్షి, చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మళ్లీ బీజేపీలో చేరారు. చెన్నైలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, అన్నామలై, ఎల్.మురుగన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఆమెకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు. గవర్నర్‌గా చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటని విపక్ష పారీ్టలు, అధికార డీఎంకే చేస్తున్న విమర్శలపై అన్నామలై స్పందించారు. ‘‘ రాజ్యాంగబద్ధ విశిష్ట పదవుల్లో కొనసాగి కూడా తర్వాత సాధారణ కార్యకర్తలా పనిచేసే సదవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుంది. ఇతర రాజకీయ పారీ్టల్లో పనిచేసి తర్వాత గవర్నర్ అయిన వారు మళ్లీ సాధారణ జీవితం కోరుకోరు. వాళ్లకు అత్యున్నత పదవుల్లో కొనసాగడమే ఇష్టం. కానీ బీజేపీ నేతలు అందుకు పూర్తి భిన్నం’ అని ఆయన అన్నారు. -
కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి,మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి ,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు త్వరలో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి జయసుధ గెలిచారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి జయసుధను దింపుతారని ప్రచారం. ఇప్పటికే ఈటలతో జయసుధ భేటీ అయిన సంగతి తెలిసిందే. చదవండి: రాజకీయాలు చేయాల్సిన టైం ఇదా కేసీఆర్..? ఎవరికి చెక్ పెట్టేందుకు జయసుధ? ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తుండగా, ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేందుకు జయసుధను తెస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. -
కెప్టెన్ గేమ్‌ప్లాన్ ఏమిటో..!
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ గత ఏడాది నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)’గా తమ పార్టీకి నామకరణం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), బీజేపీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాయని కమలదళం పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్‌లోని తన అనుయాయులను సొంత పార్టీలోకి లాగుతారని, ఎన్నికలు సమీపించేకొద్దీ... వలసలు పెరుగుతాయని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జంపింగ్‌లు మొదలయ్యాయి కానీ... ఆశ్చర్యకరంగా కెప్టెన్ అనుంగు అనుచరులు బీజేపీలోకి దూకేస్తున్నారు. ఇది పలువురి భృకుటి ముడిపడేటట్లు చేస్తోంది. అమరీందర్ గేమ్‌ప్లాన్ ఏమిటి? సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సింది పోయి ముఖ్య అనుచరులు బీజేపీలోకి వెళ్లడాన్ని ఎలా అనుమతిస్తున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరెవరు వెళ్లారంటే.. మాజీ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి (గురుహర్ సహాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే) డిసెంబరు 21న కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 67 ఏళ్ల గుర్మీత్ నాలుగుసార్లు ఎమ్మెల్యే. సెప్టెంబరు దాకా అమరీందర్ కేబినెట్లో క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు. కెప్టెన్‌కు బాగా సన్నిహితుడిగా ముద్రపడ్డారు. ఈ కారణంగానే చన్నీ కేబినెట్లో ఈయనకు చోటివ్వలేదు. ఖాదియాన్ ఎమ్మెల్యే ఫతేజంగ్ బజ్వా, శ్రీహరిగోవింద్పూర్ ఎమ్మెల్యే బల్విందర్ సింగ్ లడీలు 22న కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో బజ్వాకు కాంగ్రెస్ టిక్కెట్ రావడానికి అమరీందర్ సహాయపడ్డారు. ఇలా కెప్టెన్‌కు సన్నిహితులు కాషాయ కండువా కప్పుకోవడంతో... సమీప భవిష్యత్తులో అమరీందర్ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరూ ఉండరని, ఉమ్మడి మేనిఫెస్టోతో ప్రధాని నరేంద్ర మోదీ పేరిటే ఎన్నికలకు వెళతామని షెకావత్ ప్రకటించారు. కూటమిలో బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుందని, పంజాబ్ అసెంబ్లీలోని 117 స్థానాల్లో సగానికి పైగా తామే పోటీచేస్తామని షెకావత్ ఉద్దేశపూర్వకంగా లీకులిచ్చినా... అమరీందర్ శిబిరం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కాంగ్రెస్‌ను సాధ్యమైనంత ఎక్కువగా నష్టపర్చడమే ఈ 79 ఏళ్ల పాటియాలా రాజవంశ వారసుడి ప్రథమ లక్ష్యమని, అందుకే బీజేపీ అభీష్టం మేరకే నడుచుకుంటున్నారనే వాదన ఉంది. పరస్పర అవగాహనతోనేనా..! కెప్టెన్ పార్టీని బీజేపీలో వీలినం చేస్తారనే ఊహాగానాలను లోక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రిన్స్ ఖుల్లర్ తోసిపుచ్చారు. బీజేపీకి పట్టున్న పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీచేయాలనుకున్న వారు కాషాయదళంలోకి వెళుతున్నారని.. అమరీందర్‌తో సంప్రదించే చేరికలు జరుగుతున్నాయని ఖుల్లర్ చెప్పారు. రాణా గుర్మీత్ సోధి ఫిరోజ్‌పూర్ నుంచి, ఫతేజంగ్ బజ్వా హిందూ బెల్ట్ నుంచి బరిలోకి దిగాలని కోరుకున్నారని... ఇవి బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంకున్న, చాలా ఏళ్లుగా ఆ పార్టీ పోటీచేస్తున్న సీట్లు కావడంతో వారు అటువైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే... పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతిమంగా కూటమికి లబ్ధి చేకూరేలా అమరీందర్, బీజేపీలు అవగాహనకు వచ్చినట్లు కనపడుతోంది. సన్నిహితులు ’సేఫ్‌జోన్’ను (విజయావకాశాలు మెండుగా ఉన్న స్థానాల నుంచి) కోరుకోవడం... ఏ పార్టీలో ఉన్నా తన మనుషులే, కూటమి ఎమ్మెల్యేలుగానే ఉంటారనే లెక్కతో కెప్టెన్ వీరికి పచ్చజెండా ఊపి ఉండొచ్చు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూటమి భాగస్వామ్యపక్షాలు ఒక అవగాహనకు వచ్చాయని, అదే సమయంలో సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని పార్టీలకు నియోజకవర్గాల కేటాయింపు జరగాలని కోరుకుంటున్నాయని పీఎల్సీ అధికార ప్రతినిధి ఖుల్లర్ చెప్పారు. ఎవరికెన్ని సీట్లనేది ఇంకా ఖరారు కానున్నా... పీఎల్సీ, శిరోమణి అకాలీదళ్ (సంయుక్త) పార్టీలు గ్రామీణ నియోజకవర్గాల నుంచి, బీజేపీ పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయవర్గాల సమాచారం. 2017లో జరిగిన ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తులో భాగంగా 23 చోట్ల పోటీచేసి మూడింటిలో మాత్రమే నెగ్గిన బీజేపీ.. కెప్టెన్ అండతో ఈసారి గట్టికూటమిని ఏర్పాటు చేసింది. పంజాబ్ ఎన్నికలను ఈ కొత్త కూటమి చతుర్ముఖ (శిరోమణి అకాలీదళ్– బీఎస్పీ కూటమి, కాంగ్రెస్, ఆప్‌లు మిగతా మూడు) పోరుగా మార్చింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీలోకి సైనా
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఆమె సోదరి చంద్రాన్షు సైతం బీజేపీలో చేరారు. బుధవారం వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం పార్టీలో చేరి మీడియాతో మాట్లాడారు. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!
న్యూఢిల్లీ: రాజ్యసభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షం కంటే వెనుకబడిన అధికార బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలను మచ్చిక చేసుకుంటోంది. దీని ఫలితంగానే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆరుగురు సభ్యుల్లో నలుగురితోపాటు సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ ఇటీవల కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వైఖరితో తీవ్ర అసంతృప్తితో ఉన్న మరి కొందరు కూడా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు నీరజ్ శేఖర్ అంటున్నారు. ప్రతిపక్షాలకు చెందిన ఇంకొందరు కూడా ‘కాషాయ’బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీ బలం 78కి చేరుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వచ్చే ఏడాది కల్లా రాజ్యసభలో అధికార ఎన్డీఏకి మెజారిటీ దక్కే అవకాశముంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆలోగానే బీజేపీకి రాజ్యసభలో పైచేయి సాధించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే, ఎన్డీఏలోని జేడీయూ వంటి పార్టీలు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్, పౌరసత్వ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోయే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకే బలం పెంచుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని బీజేపీ నేత ఒకరు అన్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కైవసం చేసుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. -
బీజేపీలో చేరిన రాపోలు ఆనంద భాస్కర్
సాక్షి, న్యూ ఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గురువారం బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో నేతలు తనను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపం చెందారు. పార్టీలోఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవరిస్తున్నారని విమర్శించారు. ఆనంద భాస్కర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్
ముంబై : సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణవిఖే పాటిల్ కుమారుడు సుజయ్ విఖే పాటిల్ మంగళవారం బీజేపీలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. తాను పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్న అహ్మద్‌నగర్ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో నిరాశ చెందిన సుజయ్ బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా అహ్మద్‌నగర్ స్ధానాన్ని కాంగ్రెస్ ఎన్సీపీకి కేటాయించింది. కాగా ఈసారి ఇదే స్ధానాన్ని సుజయ్ పాటిల్‌కు ఇచ్చేందుకు ఎన్సీపీ నిరాకరిస్తోంది. న్యూరోసర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సుజయ్ ఇదే స్ధానం నుంచి పోటీ చేసేందుకు పట్టుబడుతున్నారు. కాగా మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్‌తో ఇదే విషయంపై సంప్రదింపులు జరిపారు. సుజయ్ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోందని, అతడికి ఏదో విధంగా సర్ధిచెప్పాలని ఈ సందర్భంగా అశోక్ చవాన్, రాధాకృష్ణ పాటిల్‌కు నచ్చచెప్పినట్టు సమాచారం. మరోవైపు తనకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని వెల్లడించిన సుజయ్ పాటిల్ గతవారం బీజేపీ నేత గిరీష్ మహాజన్‌ను కలవడంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు షాక్!
బిలాస్పూర్: మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రామ్‌దయాళ్ ఉయికె బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అణచివేతను భరించలేకే తిరిగి సొంతగూటికి వచ్చానన్నారు. రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధరమ్‌లాల్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఉయికె బిలాస్పూర్లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ తీవ్ర అణచివేతకు గురయ్యా. సిద్ధాంతాలు, ఆశయాలను ఆ పార్టీ విస్మరించింది. అశ్లీల సీడీ రాజకీయాలతో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, పేద ప్రజలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేయడంతో ఎస్టీ వర్గానికి చెందిన వాడిగా ఎంతో ఆవేదనకు గురయ్యా’ అని తెలిపారు. ఓ మహిళతో రాష్ట్ర మంత్రి రాజేశ్ మునత్ రాసలీలలు నెరుపుతున్న సీడీ బహిర్గతం కావడం వెనుక సూత్రధారిగా సీబీఐ పేర్కొంటున్న వారిలో రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బఘేల్ కూడా ఒకరు. 2000వ సంవత్సరంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉయికె.. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలైన పాలి–తనఖార్ లేదా మర్వాహిల నుంచి ఉయికెను బీజేపీ పోటీలోకి దించే చాన్సుంది. -
లాహోటీ చూపు.. బీజేపీ వైపు
సాక్షి, కొడంగల్ (రంగారెడ్డి): కొడంగల్ టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సీనియర్ నాయకుడు శ్యాసం రామకృష్ణ మౌనంగా ఉన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ టీఆర్ఎస్ నాయకుడు పున్నం చంద్ లాహోటీ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆయనకు కొడంగల్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానంలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. పున్నంచంద్ గతంలో బీజేపీలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పలుమార్లు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రజల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ వల్ల నష్టపోయిన వారు.. నామినేటెడ్ పోస్టులు దక్కని వారు కూటమిగా ఏర్పడుతున్నారు. పున్నంచంద్ లాహోటీని ఎన్నికల బరిలో నెలబెట్టి పాత కాపుల సత్తా చాటాలని చూస్తున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి పలుమార్లు పున్నం చంద్‌కు ఫోన్ చేసి సముదాయించినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై పున్నం చంద్ లాహోటీని వివరణ కోరగా వారం రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. నాయకుల కినుక.. కొడంగల్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవ చేస్తున్న తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణా ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు ప్రస్తుతం పార్టీలో సరైన స్థానం లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించి సకల జనుల సమ్మెను విజయవంతం చేసిన పాత కాపులు ఇప్పుడు కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ తొలి ఇన్చార్జ్ శ్యాసం రామకృష్ణతో పాటు నేటితరం నాయకుడు పున్నం చంద్ లాహోటీ వరకు టీఆర్ఎస్పై కినుక వహిస్తున్నారు. -
బీజేపీ గూటికి వాఘేలా కొడుకు
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింహ్ వాఘేలా కొడుకు మహేంద్ర వాఘేలా శనివారం అధికార బీజేపీలో చేరారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మహేంద్ర గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడారు. సీనియర్ ఓబీసీ నేత కువర్జీ బవాలియా ఈనెల మూడో తేదీన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా సీఎం విజయ్ రూపానీ ఆయనకు అదే రోజు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో మహేంద్ర బీజేపీలో చేరడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన శంకర్‌సింహ్ కొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. మహేంద్ర ఏ పార్టీలోనూ చేరబోనని అప్పట్లో ప్రకటించారు. అతని నిర్ణయంపై శంకర్ సింహ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సమాజ్‌వాదికి ఝలక్.. బీజేపీలోకి కీలక నేత
న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీకి తాజాగా ఓ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు నచ్చడం లేదంటూ ఎస్పీలో కీలక అధికార ప్రతినిధిగా పనిచేసిన గౌరవ్ భాటియా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఫిబ్రవరిలోనే సమాజ్‌వాది పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేసిన ఆయన తాజాగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ న్యాయవాదిగా ఉన్న గౌరవ్ భాటియా బీజేపీలో చేరకముందు సమాజ్‌వాది పార్టీ తరుపున జాతీయ చానెళ్లలో రాజకీయ చర్చల్లో పాల్గొనేవారు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు. విషయ పరిజ్ఞానంతోపాటు మంచి చతురత కలిగిన నాయకుడు అని కూడా గౌరవ్‌కు పేరుంది. అయితే, సమాజ్‌వాది పార్టీలో సామాజిక స్పృహ తగ్గిపోతుందని, సామ్యవాద భావాలు కొరవడుతున్నాయని, పరిపాలన కుటుంబానికి పరిమితమై పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని పదవులకు తాను ఫిబ్రవరిలోనే రాజీనామాలు చేసినట్లు వెల్లడించారు. ‘నూతన భారత నిర్మాణం కోసం భారత ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఆలోచనను ఇస్తున్నారు. ఆయన ఆలోచన విధానమే నన్ను బీజేపీలో చేరేందుకు స్ఫూర్తినిచ్చింది’ అని భాటియా తెలిపారు. అంకిత భావానికి, కలుపుగోలుతనానికి బీజేపీ పెట్టిందని కొనియాడారు. సమాజ్‌వాది పార్టీలో మాత్రం రాజకీయ కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, పార్టీపై పట్టుకోసం సాక్షాత్తు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ పోటీ పడ్డారని గుర్తు చేశారు. ఇక నుంచి తాను కూడా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని అన్నారు. గౌరవ్ భాటియా తండ్రి వీరేంద్ర భాటియా ములాయంసింగ్‌కు చాలా సన్నిహితుడు. ఆయన 2010లో చనిపోయారు. ములాయం సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. -
బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?
లక్నోః ఇటీవల పార్టీకి రాజీనామాచేసిన బహుజన సమాజ్ వాద్ పార్టీ మాజీ నాయకుడు, పడ్రౌనా ఎమ్మెల్యే స్వామిప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలోని తన మద్దతుదారులు సహా కొంతమంది మాజీ పార్టీ నాయకులతోపాటు ఆయన ఢిల్లీలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బహుజన సమాజ్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ స్వామిప్రసాద్ మౌర్య.. జూన్ 22న మాయావతి పార్టీకి రాజీనామా చేశారు. మాయావతి పార్టీ టికెట్లను వేలం వేస్తున్నారని, దళితులను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష నేత అయిన స్వామి ప్రసాద్ మౌర్య.. 2017 ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమైనవని, పార్టీ విజయంకోసం మంచి అభ్యర్థులను ఎంపిక చేయకుండా.. డబ్బు ఎక్కువగా ఇచ్చినవారికి మాయావతి పార్టీ టికెట్లు వేలం వేస్తున్నారంటూ విమర్శించారు. ప్రస్తుతం మౌర్య.. తన మద్దతుదారులతోపాటు ఢిల్లీవెళ్ళి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. అదే విషయాన్ని ఓ సీనియర్ బీజేపీ నాయకుడు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. శివ్ పూర్ ఎమ్మెల్యే ఉడియాలాల్ సహా కొందరు మాజీ బీఎస్పీ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మౌర్య బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పయనమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజీపే ఫుల్పూర్ ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్యను స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గా ఏర్పాటు చేసిన బీజేపీకి.. స్వామి ప్రసాద్ చేరికతో ఉత్తర ప్రదేశ్ లో అన్నివిధాలుగా కలసివచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.