
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింహ్ వాఘేలా కొడుకు మహేంద్ర వాఘేలా శనివారం అధికార బీజేపీలో చేరారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మహేంద్ర గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడారు. సీనియర్ ఓబీసీ నేత కువర్జీ బవాలియా ఈనెల మూడో తేదీన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా సీఎం విజయ్ రూపానీ ఆయనకు అదే రోజు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు.
ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో మహేంద్ర బీజేపీలో చేరడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన శంకర్‌సింహ్ కొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. మహేంద్ర ఏ పార్టీలోనూ చేరబోనని అప్పట్లో ప్రకటించారు. అతని నిర్ణయంపై శంకర్ సింహ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.