shankersinh vaghela
-
మీ అనుభవాన్నిదేశానికి విస్తరించండి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి సాగిస్తోందని.. దాన్ని నిలువరించేందుకు సరైన వేదిక అవసరముందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం ద్వారా బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో వాఘేలా శుక్రవారం సుమారు 5 గంటలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయస్థాయి కీలకాంశాలపై చర్చ జరిగింది. ‘కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు సరైన వేదిక, నాయకత్వం లేకపోవడంపై విపక్ష నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలన, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా ప్రజాస్వామికవాదులు మౌనం వహించడం సరికాదు. దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణితో లొంగదీసుకోవాలనే కుట్రలను బీజేపీ అమలు చేస్తోంది. దేశంలో మత సామరస్యానికి, ప్రాంతీయ సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలి’ అని వాఘేలా అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రేస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. బీజేపీ దుర్మారా్గలను ఎదుర్కొనేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాన్ని, ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. కేంద్రం ఇబ్బందిపెడుతున్నా కేసీఆర్ తెగువ.. ‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్న మీ తీరు నా లాంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. శాంతియుత మార్గంలో పార్లమెంటరీ పంథాలో తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం కొత్త రాష్ట్రాన్ని అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా తెగువ చూపుతున్నారు. బీజేపీ పీడన నుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలను కూడా విముక్తం చేయాల్సిన అవసరం ఉంది. మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా యావత్ దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ల కోరిక మేరకే నేను మీతో భేటీ అయ్యా. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని కేసీఆర్‌తో భేటీలో శంకర్‌సిన్హ్ వాఘేలా పేర్కొన్నారు. దేశ రాజకీయాలు, పాలనలో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తానని, వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకుడు తనకు మద్దతు పలకడంపట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
బీజేపీ గూటికి వాఘేలా కొడుకు
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింహ్ వాఘేలా కొడుకు మహేంద్ర వాఘేలా శనివారం అధికార బీజేపీలో చేరారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మహేంద్ర గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడారు. సీనియర్ ఓబీసీ నేత కువర్జీ బవాలియా ఈనెల మూడో తేదీన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా సీఎం విజయ్ రూపానీ ఆయనకు అదే రోజు కేబినెట్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలో మహేంద్ర బీజేపీలో చేరడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పై తిరుగుబాటు ప్రకటించిన శంకర్‌సింహ్ కొత్త పార్టీని స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. మహేంద్ర ఏ పార్టీలోనూ చేరబోనని అప్పట్లో ప్రకటించారు. అతని నిర్ణయంపై శంకర్ సింహ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
గుజరాత్ కీలక రాజకీయ పరిణామం!
కొత్త రాజకీయ ఫ్రంట్‌ను ప్రకటించిన సీనియర్ నేత వాఘేలా కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి! అహ్మదాబాద్: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత జూలై నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా కొత్త 'రాజకీయ ఫ్రంట్'ను మంగళవారం ప్రకటించారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో రాజకీయ ప్రత్యామ్నాయంగా తన ఫ్రంట్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. 'ఇది రాజకీయ పార్టీ కాదు. యూపీఏ, ఎన్డీయే తరహాలో రాజకీయ కూటమి. ఇది బీజేపీ 'బీ' టీం కాదు. ఇందులో ఎలాంటి మ్యాచ్ ఫీక్సింగ్ లేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం లేదు. అధికార బీజేపీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా అజెండాతో ఎన్నికల్లోకి వెళుతాం' అని వాఘేలా స్పష్టం చేశారు. 'జన్ వికల్ప్' పేరిట గుజరాత్లో 'ప్రజా ప్రత్యామ్నాయాన్ని' అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 182 స్థానాల్లోనూ తమ కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళల సమస్యలు, జీఎస్టీ, నిరుద్యోగిత తదితర 20 అంశాల ఆధారంగా ఎన్నికల్లోకి వెళుతామని చెప్పారు. -
సీఎం వెంట రాగా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
అహ్మదాబాద్: కాంగ్రెస్ బహిష్కృత నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా(77) తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సమయంలో బీజేపీలోకి చేరనున్నారన్న వార్తలను కొట్టిపారేసిన వాఘేలా.. బుధవారం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఇతర బీజేపీ నేతలు తోడురాగా తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరేకు అందజేశారు. తన నియోజకవర్గ ప్రజలను సంప్రదించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు వాఘేలా చెప్పారు. జూలై 21న తన 77వ జన్మదినం సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటన చేశారు. ఈ నెల 8న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. -
పటేల్‌కు ఓటు వేయలేదు: వాఘేలా
అహ్మదాబాద్: గత నెలలో కాంగ్రెస్‌ను వీడిన శంకర్‌సిన్హ్ వాఘేలా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయలేదని తెగేసి చెప్పారు. ఓడిపోయే అభ్యర్థికి ఓటు ఎవరు వేస్తారని ఆయన ప్రశ్నించడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నుంచి అయిదో సారి రాజ్యసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరిన అహ్మద్ పటేల్ విజయం సాధించడం అనుమానమేనని వాఘేలా అన్నారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఆయనకు ఓటు వేయరని, అహ్మద్ పటేల్‌కు 40 మించి ఓట్లు రావని జోస్యం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 57 మంది ఎమ్మెల్యేలుండగా, ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. ఇక 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండగా, అహ్మద్ పటేల్ విజయం సాధించాలంటే మరో ఎమ్మెల్యే మద్దతు ఆ పార్టీకి అవసరం. అయితే ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీ మద్దతుపై పటేల్ ఆశలు పెట్టుకున్నారు. -
వాఘెలా రాహుల్‌కు ముఖం చాటేశారు
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పార్టీ సీనియర్ నేత శంకర్‌సిన్హా వాఘెలా ముఖం చాటేశారు. ట్విట్టర్లో రాహుల్‌ను అనుసరించడాన్ని విరమించుకున్నారు. ఆయన రాహుల్‌ని మాత్రమే కాకుండా మరోసీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్, జీపీసీసీ ప్రెసిడెంట్ భరత్‌సిన్హ సోలంకీ తదితరులను కూడా ఆయన ఆదివారం ట్విట్టర్లో అన్‌ఫాలో అయ్యారు. అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సైబర్ సమావేశం జరగడానికి కొద్ది సేపట్లోనే ఆయన ట్విట్టర్లో రాహుల్‌ను అన్‌ఫాలో అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సైబర్ సెల్‌కు మార్గనిర్దేశాలు చేసే వ్యక్తుల్లో వాఘెలా కూడా ఒకరు. బాపుగా పిలిచే వాఘెలా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకు ఫలితంగానే తాజాగా ఆయనను రాహుల్‌ను విడవడం జరిగిందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని గత కొద్ది నెలలుగా వాఘెలా కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. పైగా ప్రస్తుతం ఎన్నికల్లో ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించబోమంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. త్వరలో గుజరాత్లో ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర నేతల మధ్య వ్యవహారం పొసగడం లేదని, ఒకరిపై ఒకరు తీవ్ర అసహనంతో ఉన్నారని అంటున్నారు. తాజా పరిణామం చూస్తే అది నిజమేనేమోనని, గుజరాత్ కాంగ్రెస్‌లో ఏదో జరగబోతుందంటూ పలువురు కథనాలు అల్లేయడం మొదలుపెట్టారు. -
రూ. 1700 కోట్ల కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్ టైల్ కార్పొరేషన్ (ఎన్టీసీ) కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీసీకి సంబంధించిన రూ. 1700 కోట్ల విలువైన భూముల అమ్మకాలలో నాటి కేంద్ర మంత్రి శంకర్ సింగ్ వాఘేలాతోపాటు ఎన్టీసీ మాజీ చైర్మన్ రామచంద్ర పిళ్లై హస్తం ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. ఆ క్రమంలోనే బుధవారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మంగళవారం ఎన్టీసీ మాజీ చైర్మన్ పిళ్లై నివాసం, కార్యాలయాల్లో జరిపిన తనిఖీలలో పలు ఆధారాలు లభ్యమయ్యాయని, అవి కుంభకోణంలో పిళ్లైతోపాటు మాజీ మంత్రి వాఘేలా పాత్రలను నిర్ధారించేవేనని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశవ్యాప్తంగా ఎన్టీసీకి చెందిన భూములను విక్రయించాలని నిర్ణయించిన దరిమిలా, తమకు అనుకూలురైన వ్యక్తులకు భూములు కట్టబెట్టేందుకు వాఘేలా, పిళ్లైలు నిబంధనలను మార్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం చార్జిషీటు దాఖలుతో ఆ ఆరోపణలు వాస్తవాలేనని తేలే అవకాశం ఉంది. -
ఐఎస్ఐఎస్ కు బీజేపీ సహాయం: వాఘేలా
అహ్మదాబాద్: తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు గుజరాత్ లో విస్తరించేందుకు బీజేపీ సహాయం చేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శంకర్ సిన్హ్ వాఘేలా తీవ్రారోపణలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు. అందుకే ఐఎస్ఐఎస్ లాంటి సంఘవ్యతిరేక శక్తులకు సహకరిస్తోందని ఆరోపించారు. దేశం పట్ల విధేయత ప్రదర్శించని ముస్లిం మత నాయకులకు కొంత మంది బీజేపీ నాయకులు గాలం వేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వాఘేలా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపైనా పరోక్షంగా విమర్శలు గుప్పించారు వాఘేలా. -
గుజరాత్ కు మోడీ అన్యాయం చేశారు: వాఘేలా
అహ్మదాబాద్: కేంద్ర మంత్రి పదవుల కేటాయింపు విషయంలో గుజరాత్ కు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా విమర్శించారు. సొంత రాష్ట్రానికి నరేంద్ర మోడీ అన్యాయం చేశారని ఆరోపించారు. కేవలం ఒకటిన్నర పదవులు మాత్రమే ఇచ్చి గుజరాత్ ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు. గుజరాత్ నుంచి 26 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒకటిన్నర పదవి మాత్రమే ఇస్తారా అంటూ ప్రశ్నించారు. గుజరాత్ నుంచి భారుచ్ ఎంపీ మన్సుఖ్ వాసవకు మాత్రమే గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి పదవి దక్కింది. మోడీతో కలుపుకుని ఒకటిన్నర పదవులుగా వాఘేలా లెక్కగట్టారు. అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించినా వారు తమ రాష్ట్ర ప్రతినిధులుగా పరిగణించబోమని స్పష్టం చేశారు.