సాక్షి, న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఆమె సోదరి చంద్రాన్షు సైతం బీజేపీలో చేరారు. బుధవారం వారిద్దరూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అనంతరం పార్టీలో చేరి మీడియాతో మాట్లాడారు. ‘క్రీడారంగంలో అనేక టైటిల్స్ గెలిచాను. దేశం పేరు నిలబెట్టాను. దేశం కోసం మంచి చేసే బీజేపీలో నేడు చేరాను. కష్టపడి పనిచేసే వారంటే చాలా ఇష్టం. మోదీ రాత్రి పగలూ కష్టపడి దేశం కోసం పనిచేస్తున్నారు. ఆయనతో కలిసి దేశం కోసం పనిచేయడం నా అదృష్టం. మోదీ దేశంలో క్రీడారంగానికి చాలా మేలు చేశారు. నరేంద్ర మోదీ నుంచి నాకు స్ఫూర్తి లభిస్తుంది. దేశం కోసం మంచి చేస్తానన్న నమ్మకం ఉంది..’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment