న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా ఇక నుంచి రాజకీయాల్లో తనదైన ముద్రవేయనున్నారు. గతంలో అనేక సార్లు సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ ఆమెకు సభ్యత్వ రసీదు చేశారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. బీజేపీ చేరడం గర్వంగా ఉందన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు తెలిపారు. 29 ఏళ్ల సైనా.. 20 ఇంటర్నేషనల్ టైటిల్స్‌ను గెలుచుకున్నారు. 2009లో వరల్డ్ నంబర్ 2, 2015 సంవత్సరంలో వరల్డ్ నంబర్ వన్ స్థానానికి ఎదిగారు. ప్రస్తుతం ఆమె తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment