సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ వేగవంతం చేసింది.
మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి,మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి ,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు త్వరలో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్నారు.
కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి జయసుధ గెలిచారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి జయసుధను దింపుతారని ప్రచారం. ఇప్పటికే ఈటలతో జయసుధ భేటీ అయిన సంగతి తెలిసిందే.
చదవండి: రాజకీయాలు చేయాల్సిన టైం ఇదా కేసీఆర్..?
ఎవరికి చెక్ పెట్టేందుకు జయసుధ?
ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తుండగా, ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేందుకు జయసుధను తెస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment