
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. ‘పార్టీకి ఎంత నిబద్ధతతో పని చేసినా, నాపట్ల నిర్లక్ష‍్య వైఖరితోనే వ్యవహరిస్తోంది. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా వ్యవహిరిస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించడం లేదు. నా రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపించాను. అయితే ఏ పార్టీలో చేరతాననే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్న నన్ను కావాలనే పక్కన పెడుతున్నారు. అయినా పార్టీ కోసం సంస్థాగతంగా కృషి చేశాను.’ అని తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వీడారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాపోలు కాంగ్రెస్‌ను వీడటం ఆ పార్టీపై ప్రభావం పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment