
'కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉంది'
కేంద్ర బడ్జెట్ ఎండమావిలా ఉందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ అభివర్ణించారు. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బడ్జెట్పై ప్రసంగించిన అనంతరం పార్లమెంట్ వెలుపల రాపోలు ఆనంద భాస్కర్ స్పందించారు. ఈ బడ్జెట్ కార్పొరేట్ వ్యవస్థల పరిరక్షణకు దోహదపడేదిగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత, సంక్షేమానికి విఘాతం కలిగించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్తో తెలంగాణకు అంతగా ఒరిగేదేమి లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ (ఉద్యానవన) యూనివర్సిటీని మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.