ప్రశాంతంగానే విభజన ప్రక్రియ: రాపోలు
రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రశాంతంగానే జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. ప్రక్రియ సాఫీగా సాగుతుందనే సంకేతాలు అధిష్టానం నుంచి సంకేతాలున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు.
కాగా అంతకు ముందు తెలంగాణ ఎంపీలు... కాంగ్రెస్ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేదితో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగవతం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సీమాంధ్ర నేతలకు అధిష్టానం కొన్నిసలహాలు, సూచనలు ఇచ్చిందని అన్నారు.
తెలంగాణ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని తాను అన్నట్టుగా తనపై దుష్ప్రచారం జరుగుతోందని మరో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలపై తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరణ ఇచ్చానని తెలిపారు.