న్యూఢిల్లీ: రేపు జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశ అజెండాలో తెలంగాణ అంశంలేదు. రేపు సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారని ముందు అనుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోనీ కమిటి నియమించడం, కేంద్ర హొం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కు ఆనారోగ్యం కారణంగా ఈ సమావేశంలో తెలంగాణ అంశాన్ని చేర్చలేదని తెలిసింది. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం చర్చిస్తారు.
మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర విభజన అంశం చర్చిస్తారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆమోదం తెలుపుతారని తెలంగాణవాదులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చే సమావేశంలో ఈ అంశం చర్చించే అవకాశం ఉంది.
అజెండాలో లేని తెలంగాణ అంశం
Published Wed, Aug 7 2013 9:48 PM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement