‘ఆత్మగౌరవం కోసమే విభజన కోరుతున్నాం’ | rapolu ananda bhaskar seeks telangana statehood | Sakshi
Sakshi News home page

‘ఆత్మగౌరవం కోసమే విభజన కోరుతున్నాం’

Published Mon, Aug 12 2013 6:25 PM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

rapolu ananda bhaskar seeks telangana statehood

న్యూఢిల్లీ: ఆత్మగౌరవం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనను కోరుతున్నామని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. సీమాంధ్రలో ఆ పరిస్థితి లేదని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో పుష్కలంగా నీటి వనరులున్నాయన్నారు. తెలంగాణ వాసులు కోస్తాలోని వనరుల్లో  వాటా కోరడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
 
 

ఇప్పుడు కోరుతున్నది రాష్ట్ర విభజనను కాదని,  ప్రత్యేక తెలంగాణ డిమాండ్ అని ఆయన అన్నారు. . 2001 నుంచి కాంగ్రెస్ ఎజెండాలో తెలంగాణ ఏర్పాటు అంశం ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement