ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అండగా ఉండాలి
-
ఎంపీ రాపోలు ఆనందభాస్కర్
-
ఇథియోపియాలో పర్యటన
పాలకుర్తి టౌన్: ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా దేశంలో ఉన్న ప్రవాస భారతీయులకు భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం అండ గా నిలబడాల్సిన అవసరం ఉందని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ఆదివా రం ఇథియోపియాలో ఎంపీ రాపోలు, పలువురు పర్యటించారు. వారి బృందానికి ఆ దేశ రాజధాని నగరం అడిస్ అబాబాలో ఇండియన్ బిజినెస్ ఫోరానికి చెందిన మయూరి కోఠారి, దౌత్య వ్యవహారాల అధికారి అశోక్‌కుమార్ స్వాగతం పలికారు. ఈసందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఎంపీ రాపోలు మాట్లాడారు. అనంతరం ఎంపీ అర్జున్‌లాల్ మీనా మాట్లాడుతూ భారత ప్రభుత్వం తరఫున ప్రవాస భారతీయులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. బృందంలో ఐఏపీడీ అర్జున్ శర్మ, తదితరులు ఉన్నారు.