టీఆర్ఎస్పై సీఈసీకి కాంగ్రెస్ ఎంపీ ఫిర్యాదు | congress-party-mp-rapolu-ananda-bhaskar-takes-on-trs-leaders | Sakshi
Sakshi News home page

Published Fri, May 29 2015 11:45 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానానికి పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్భాస్కర్ ఆరోపించారు. ఇదే విషయంపై శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను కలసి రాపోలు ఆనంద్ భాస్కర్ ఫిర్యాదు చేశారు. అనంతరం రాపోలు ఆనంద్ భాస్కర్ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రత్యక్ష పద్దతిలో నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. రాపోలు ఆనంద్ భాస్కర్ వెంట ఎంఏ ఖాన్ కూడా ఉన్నారు. తెలంగాణ శాసనమండలకి ఎమ్మెల్యే కోటాలో జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అయితే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలుపించుకునేందుకు టీఆర్ఎస్కు అవకాశం ఉంది. కానీ ఐదుగురు అభ్యర్థులను రంగంలోకి దింపింది. అందులోభాగంగా ఐదో అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందుకోసం ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలలో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు... అధికార టీఆర్ఎస్పై సీఈసీకి ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement