
రాజ్యసభలో సుజన, కేకే డిష్యూం డిష్యూం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు తెలుగు ఛానళ్ల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్బంగా ఎంపీలు సుజనా చౌదరి, కేకేలు ఒకరితోఒకరు వాగ్వివాదానికి దిగారు. తెలంగాణలోని ఛానళ్ల నిలిపివేతపై ఎంఎస్వోల అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా నిరసన తెలిపారు. ఎంఎస్వోలను తెలంగాణ ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కేకే జోక్యం చేసుకు... సుజనా చౌదరి ఆరోపణలు అర్థరహితమంటు వ్యాఖ్యానించారు.
సుజన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కేకే ప్రకటించారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ జోక్యం చేసుకుని... పరిస్థితిని మొత్తం సమీక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. మీడియా స్వేచ్ఛ, నియంత్రణ అంశాలను అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోరాదని పలు రాజకీయ పక్షాలకు హితవు పలికారు. అమెరికా, బ్రిటన్ దేశాలలో ఉన్న మీడియా రెగ్యులేషన్ సంస్థలను పరిగణనలోకి తీసుకోవాలి రాపోలు సూచించారు.